గోల్ మాల్ సెట్లో అల్లు అర్జున్ | Allu Arjun On Golmaal Sets | Sakshi
Sakshi News home page

గోల్ మాల్ సెట్లో అల్లు అర్జున్

Published Wed, Jul 26 2017 1:48 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM

గోల్ మాల్ సెట్లో అల్లు అర్జున్

గోల్ మాల్ సెట్లో అల్లు అర్జున్

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం త‌న నెక్ట్స్  సినిమా కోసం రెడీ అవుతున్నాడు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో పాటు ఫిజికల్ గా కూడా వేరియేషన్ చూపించేందుకు కసరత్తులు చేస్తున్నాడు. వ‌క్కంతం వంశీ ద‌ర్శక‌త్వంలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా చేయ‌నున్నాడు బ‌న్నీ.

ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి మరికాస్త సమయం పట్టనుండటంతో ఓ యాడ్ షూటింగ్ కోసం ముంబై వెళ్లాడు బన్నీ. అక్కడ గోల్ మాల్ ఎగైన్ సెట్స్ ని విజిట్ చేశాడు. గోల్ మాల్ టీం స‌భ్యుల‌తో క‌లిసి కాసేపు స‌ర‌దాగా గడిపాడు. అల్లు అర్జున్ కి ప్రస్తుతం సౌత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌గా, బ‌న్నీ సినిమాలు హిందీలోకి డ‌బ్ అయి మంచి విజ‌యం సాధిస్తున్నాయి.

ప‌లువురు హిందీ ద‌ర్శక నిర్మాత‌లు ఆయ‌నతో సినిమాలు చేసేందుకు సిద్ధమ‌వుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. గోల్ మాల్ ఎగైన్ చిత్రం రోహిత్ శెట్టి దర్శక‌త్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, పరిణితో చోప్రా హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా అర్షద్ వార్సీ, తుషార్ కపూర్, కునాల్ కేము, నీల్ నితిన్ ముకేశ్, టబు మరియు ప్రకాశ్ రాజు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement