ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, కత్రీనా కైఫ్‌లు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సూర్యవంశీ’. అజయ్‌దేవగన్ ‘సింగం’, ‘సింగం రీటన్స్’, ‘సింబా’ చిత్రాల దర్శకుడైన రోహిత్ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా దర్శకుడికి, హీరోకి మధ్య సెట్‌లో వివాదం చోటుచేసుకున్నట్లు బాలీవుడ్ టాక్. అంతేకాకుండా వీరిద్దరి వివాదం కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని సోషల్‌మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి.
అయితే ఈ వార్తలపై కిలాడీ అక్షయ్ స్పందిస్తూ.. అదే పంథాలో చమత్కారమైన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో ‘దర్శకుడు రోహిత్ శెట్టి, అక్షయ్‌లు ఇద్దరు ఒకరినోకరు పిడిగుద్దులు గద్దుకుంటూ, తోసుకుంటూ కొట్టుకుంటున్న వీరిని కొంత మంది వచ్చి అడ్డుకుంటారు. దీంతో అక్షయ్ నన్ను ఆపకండి మేము కొట్టుకోవాల్సిందే.. అంటూ గట్టిగా ఆరుస్తూ.. అలసిపోయి వారిద్దరు కింద పడిపోతారు’. అంతేకాకుండా కత్రీనా కైఫ్ న్యూస్ రిపోర్టర్‌గా వ్యవహరించిన 30 సెకన్ల ఈ వీడియోకి ‘బిగ్ బ్రేకింగ్ న్యూస్: సూర్యవంశీ సినిమా షూటింగ్‌లో హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు రోహిత్ శెట్టిలకు మధ్య తలెత్తిన వివాదం, మధ్యవర్తిగా వ్యవహరించిన నిర్మాత కరణ్ జోహార్’ అనే టైటిల్‌తో వీడియో షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఫన్నీ మీమ్స్‌తో పాటు ఎమోజీలను కామెంట్ రూపంలో తెలుపుతున్నారు. అంతేకాకుండా మరికొంతమంది నెటిజన్లు అక్షయ్ ఫన్నీ ఆలోచనకు ఫిదా అవుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా గతంలో అక్షయ్ కుమార్, కత్రీనా కైఫ్‌లు జంటగా వచ్చిన నమస్తే లండన్, సింగ్ ఈజ్ కింగ్, హమ్‌కో దీవానా ఖర్ గాయో, వెల్‌కమ్, తీస్‌మార్ ఖాన్ వంటి సినిమాలలో హీరో,హీరోయిన్లుగా కనిపించారు. ఆ తర్వాత దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వీళ్లు ఇద్దరూ మళ్లీ ‘సూర్యవంశీ’తో ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులను అలరించనున్నారు.