ముంబై: బాలీవుడ్ కిలాడి అక్షయ్‌కుమార్‌కు ‘సూర్యవంశీ’ సినిమా షూటింగ్‌లో ఎడమచేతి కండరానికి గాయమైంది. అయితే, అక్షయ్ గాయాన్ని లెక్కచేయకుండా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ గాయం అక్షయ్‌కుమార్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కత్రినాకైఫ్‌తో ఉన్న ఈ వీడియోను అక్షయ్ షేర్ చేశారు. ఈ వీడియోలో అక్షయ్‌కు గాయమైనట్టు, గాయమైన భాగంలో బ్లాక్ ప్యాచ్ ధరించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. కాగా అక్షయ్ ఫిల్హాల్ అనే మ్యూజిక్ వీడియోలో తొలిసారిగా నటించారు. ఈ మ్యూజిక్ వీడియోపై స్పందించిన అక్షయ్ మాట్లాడుతూ ...‘నేను అన్ని కామెంట్లను చూస్తున్నాను. ఈ వీడియో చూస్తే నమస్తే లండన్ సినిమా గుర్తొస్తుందని అంటున్నారు. ప్రస్తుతం నేను నమస్తే లండన్‌లో నటించిన కత్రినాతోనే సూర్యవంశీలో నటించడం చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు.
కిలాడి స్టార్‌కు గాయాలు
Published Sun, Nov 10 2019 1:27 PM | Last Updated on Fri, Mar 22 2024 10:57 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement