రోహిత్ శెట్టి - రణ్‌వీర్ సింగ్
బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్, సారా అలీ ఖాన్ హీరో, హీరోయిన్లుగా రోహిత్ శెట్టి ‘సింబా’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న లవ్లీకపుల్ దీపికా పదుకోన్ - రణ్‌వీర్ సింగ్‌లను ఉద్దేశిస్తూ రోహిత్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ షేర్ చేశారు.
‘2018, జూన్ 6 ‘సింబా’ ప్రయాణం ప్రారంభమయి నిన్నటికి సరిగా ఐదు నెలలు. 5 నెలల పాటు సాహసోపేతంగా సాగిన మా ప్రయాణం నేటితో ముగియనుంది. ఈ సమయంలో వేల భావాలన్ని కలిసి ఒకేసారి నా మనసులోకి ప్రవేశించినట్లైంది. మా ఇద్దరికి ఇదే తొలి చిత్రం. మా ప్రయాణం చాలా ఫన్నీగా, సంతోషంగా, ముగింపు లేని జ్ఞాపకాల సమాహరంగా సాగింది’ అన్నారు.
రోహిత్ కొనసాగిస్తూ.. ‘నాకు తెలిసిన ఈ వ్యక్తి, నటుడు చాలా నిజాయితీపరుడు.. పని కోసం ప్రాణం పెడతాడు. ఈ రోజు నేను.. నా టీమ్ అంతా ముక్త కంఠంతో చెప్తున్నాం.. రణ్‌వీర్ సింగ్ కన్నా బాగా ఈ పాత్రను మరోకరు పోషించలేరు. ఈ సినిమా ప్రారంభమయినప్పుడు ఇతడు చాలా యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా మాత్రమే తెలుసు. కానీ ఈ రోజు సినిమాలోని ఆఖరి సన్నివేశాన్ని షూట్ చేస్తున్నప్పుడు.. ఇతనిలో నాకొక చిన్న సోదరుడు కనిపించాడు’ అన్నాడు.
‘త్వరలోనే ఈ వ్యక్తి తనతో సమానమైన.. అందమైన.. అద్భుతమైన మరో వ్యక్తితో కలిసి ఇంకో అందమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాడు. నా ‘సింబా ’త్వరలోనే ‘మీనమ్మ’ని వివాహం చేసుకోబోతున్నాడని గర్వంగా ప్రకటిస్తున్నాను. వారిద్దరికి చాలా అందమైన, ఆశీర్వాదాలతో కూడిన మంచి భవిషత్ లభించాలిన మనస్ఫూరిగా కోరుకుంటున్నాను’ అంటూ దీపికా - రణ్‌వీర్‌లకు అభినందనలు తెలియజేశారు. ఈ నెల 14, 15న రణ్‌వీర్, దీపికలు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment