అమ్మో... కోటి రూపాయలా! | Ah ... one crore! | Sakshi
Sakshi News home page

అమ్మో... కోటి రూపాయలా!

Jun 25 2015 12:09 AM | Updated on Sep 3 2017 4:18 AM

అమ్మో... కోటి రూపాయలా!

అమ్మో... కోటి రూపాయలా!

కృతీసనన్ ఇప్పటివరకూ తెలుగులో రెండు సినిమాలు చేస్తే, హిందీలో చేసింది కేవలం ఒకటే. ఆమె తాజాగా హిందీలో నటిస్తున్న చిత్రం ‘దిల్‌వాలే’.

కృతీసనన్ ఇప్పటివరకూ తెలుగులో రెండు సినిమాలు చేస్తే, హిందీలో చేసింది కేవలం ఒకటే. ఆమె తాజాగా హిందీలో నటిస్తున్న చిత్రం ‘దిల్‌వాలే’. రోహిత్ శెట్టి దర్శకత్వంలో షారుక్ ఖాన్, కాజోల్ మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్‌ధావన్‌కు జోడీ కృతీ సనన్.
 
 చిత్రం ఏమిటంటే, ఈ భారీ ప్రాజెక్టుతో కృతీకి క్రేజ్ అమాంతం పెరిగిపోయి ఓ జాక్‌పాట్ తగిలింది. సౌందర్య సాధనాల ఉత్పత్తుల కంపెనీ ఒకటి తమ వాణిజ్య ప్రకటనలో నటించడానికి ఆమెకు ఏకంగా కోటి రూపాయలు ఆఫర్ చేసిందట.
 
 దీంతో కృతి ఆనందానికి అవధులు లేవు. బాలీవుడ్‌లో ఒక్క సినిమాతోనే ఇంత బంపర్ ఆఫర్ కొట్టేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement