ఆ డైరెక్టర్ సెట్లో నేను చాలా సేఫ్ | I feel Rohit Shetty's set is safest, says Kajol | Sakshi
Sakshi News home page

ఆ డైరెక్టర్ సెట్లో నేను చాలా సేఫ్

Published Tue, Nov 10 2015 7:42 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఆ డైరెక్టర్ సెట్లో నేను చాలా సేఫ్ - Sakshi

ఆ డైరెక్టర్ సెట్లో నేను చాలా సేఫ్

ముంబై: బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తీసే మూవీల్లో సెట్ తనకు చాలా సురక్షితమని నటి కాజోల్ అంటోంది. చిత్ర యూనిట్... అందరిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారని తెలిపింది. చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు ఏమైనా జరిగే అవకాశం ఉందని, అయితే రోహిత్ సెట్ చాలా సేఫ్ అంటూ పేర్కొంది. యాక్షన్ సన్నివేశాలు చేయడం అంత సులువు కాదని బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి అభిప్రాయపడ్డాడు. అభిమానుల ఆనందం కోసం చేసే స్టంట్స్ రిస్క్తో కూడుకున్నవని అన్నాడు. సోమవారం నాడు దిల్వాలే ఆడియో ఫంక్షన్ నిర్వహించారు. ఏదైనా యాక్షన్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు గుండె నోటిలోకి వచ్చినట్లుగా అనిపిస్తుందని, అంతా సరిగా జరగాలని ప్రార్థిస్తానని చెప్పాడు.

ఈ మూవీలో నటిస్తున్న వరుణ్ వర్మ తనను బాగున్నానా అని అడిగగా, అందుకు తన వద్ద సమాధానం లేదన్నాడు. డిసెంబర్ 18న 'దిల్ వాలే' ప్రేక్షకుల ముందుకు రానుందని దర్శకుడు తెలిపాడు. హాస్యాన్ని పండించడం చాలా సులువు. కానీ స్టంట్స్ చేయడం ఇండస్ట్రీలోని అందరికి కాస్త ఇబ్బందికరమన్నాడు. ఈ మూవీ కోసం కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించినట్లు దర్శకుడు రోహిత్ చెప్పాడు. బ్లాక్ బాస్టర్ సినిమాలు సింగమ్, సింగమ్ రిటర్న్స్, 'చెన్నై ఎక్స్ప్రెస్'లు స్టార్ డైరెక్టర్ రోహిత్ తీసిన విషయం అందరికి తెలిసిందే.

ఈ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. షారుక్ మాట్లాడుతూ.. యూనిట్ సభ్యులను అందర్నీ ఆయన ప్రోత్సహిస్తాడన్నాడు.  రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న 'దిల్ వాలే'లో బాలీవుడ్ హిట్ పెయిర్ షారుక్ ఖాన్, కాజోల్ మళ్లీ కలిసి నటిస్తున్నారు. వరుణ్‌ధావన్‌కు జోడీగా కృతీ సనన్ కనిపించనుంది. ఈ కార్యక్రమానికి షారుక్ ఖాన్, కాజోల్, వరుణ్ వర్మ, దర్శకుడు రోహిత్ శెట్టి, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement