![Suryavanshi Hit Theatres On April 30 - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/15/akshay.jpg.webp?itok=-7scp7xS)
అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘సూర్యవంశీ’ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మార్చి 14 (ఆదివారం)న రోహిత్‌శెట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్, అజయ్ దేవగన్ అతిథి పాత్రలు పోషించారు. ‘‘సూర్యవంశీ సినిమా ట్రైలర్ ఏడాది కిత్రం విడుదలైంది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత కరోనా పరిస్థితుల వల్ల సినిమాను విడుదల చేయలేకపోయాం. కానీ మా సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేస్తామని చెప్పాం. ప్రామిస్ ఈజ్ ఈ ప్రామిస్. ‘సూర్యవంశీ’ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నాం. థియేటర్స్‌లో సినిమాను చూసినప్పుడు కలిగే అనుభూతి వేరు. ఆ రహీ హై పోలీస్ (పోలీస్ వస్తున్నాడు)’’ అని పేర్కొన్నారు అక్షయ్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment