బాహుబలి సక్సెస్కి కారణం ప్రభాస్ కాదట..! | Baahubali 2 success is not because of Prabhas says Rohit Shetty | Sakshi
Sakshi News home page

బాహుబలి సక్సెస్కి కారణం ప్రభాస్ కాదట..!

Published Wed, May 10 2017 1:40 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

బాహుబలి సక్సెస్కి కారణం ప్రభాస్ కాదట..! - Sakshi

బాహుబలి సక్సెస్కి కారణం ప్రభాస్ కాదట..!

బాహుబలి సక్సెస్తో ప్రభాస్ ఒక్కసారిగా నేషనల్ స్టార్గా మారిపోయాడు. ముఖ్యంగా ఒక్క ప్రాజెక్ట్ కోసం ఐదేళ్ల సమయం కేటాయించిన డార్లింగ్ కమిట్మెంట్కు ఇండియన్ ఇండస్ట్రీ అంతా సాహో అంటుంది. అదే సమయంలో బాహుబలి సక్సెస్లో రాజమౌళితో పాటు ప్రభాస్కు అదే స్థాయిలో క్రెడిట్ ఇచ్చారు క్రిటిక్స్. కానీ ఓ బాలీవుడ్ దర్శకుడు మాత్రం బాహుబలి సక్సెస్లో ప్రభాస్ క్రెడిట్ ఏం లేదంటూ తేల్చేశాడు.

బాలీవుడ్ మాస్ మసాల ఎంటర్టైనర్స్ను తెరకెక్కించే రోహిత్ శెట్టి బాహుబలి సక్సెస్లో ప్రభాస్ కెడ్రిట్ ఏం లేదంటున్నాడు. కేవలం కథ, దర్శకత్వం వల్లనే బాహుబలి అంతటి ఘన విజయం సాధించిందన్న రోహిత్, నటీనటులు సక్సెస్ హెల్ప్ అయ్యారేగాని వారి గొప్పతనం ఏమి లేదన్నట్టుగా మాట్లాడాడు. అంతేకాదు బాలీవుడ్ జనాలు సినిమా ప్రమోషన్ ఎలా చేయాలో బాహుబలి టీం నుంచి నేర్చుకోవాలని తెలిపాడు. అయితే బాహుబలి సక్సెస్ ప్రభాస్ క్రెడిట్ ఏం లేదంటూనే అవకాశం వస్తే ప్రభాస్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తానని తన మనసులోని కోరికను బయటపెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement