కత్రినా.. నిన్నెవరూ చూడరు: దర్శకుడు | Rohit Shetty Trolled For Comment on Katrina Kaif | Sakshi
Sakshi News home page

దర్శకుడి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్‌

Published Mon, Mar 9 2020 6:40 PM | Last Updated on Mon, Mar 9 2020 8:41 PM

Rohit Shetty Trolled For Comment on Katrina Kaif - Sakshi

ముంబై: బాలీవుడ్‌ అగ్ర దర్శ​​కుడు, ‘సూర్యవంశీ’ డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టి స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల ఆమె అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా కత్రినా కైఫ్‌ క్లైమాక్స్‌ సన్నివేశంలో రీటేక్‌ కావాలని  రోహిత్‌ను కోరింది. అప్పటికే ఒకే సన్నివేశాన్ని నాలుగుసార్లు చిత్రీకరించటంతో రోహిత్‌ దానికి అంగీకరించలేదు. అజయ్ దేవ్‌గన్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్ లాంటి సూపర్‌ స్టార్‌లు నటిస్తున్న ఈ సన్నివేశంలో నిన్ను ఎవరూ పట్టించుకోరని సమాధానమిచ్చారు.

ఈ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. నటిని కించపరిచావని విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలపై దర్శకుడు రోహిత్‌ స్పందిస్తూ.. క్లైమాక్స్‌ సన్నివేశంలో నటించడానికి కత్రినా అప్పటికే నాలుగు టేకులు తీసుకుంది. అయినప్పటికీ సన్నివేశం బాగా రాలేదంటూ మరోసారి నటిస్తానని కోరింది. అయితే అది బాంబు పేలుళ్ల సన్నివేశం కావడంతో అందులో నీ నటనను అంతగా ప్రజలు గమనించరని చెప్పానన్నారు. కానీ ఆమె నటించిన సన్నివేశాన్ని ప్రోమోలో పెడతానని చెప్పినట్లు పేర్కొన్నారు. అతని సమాధానంపై సంతృప్తి చెందని ఓ నెటిజన్‌.. ‘ కత్రినా కైఫ్‌ ఈ దశాబ్దపు అత్యుత్తమ హీరోయిన్‌ అని, ఆమెతో పాటు మహిళలను గౌరవించడం నేర్చుకోండి’ అని ఘాటుగానే కామెంట్‌ చేశాడు.

చదవండి: ఆటలో పోరాడి గెలిచిన కత్రినా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement