
'నా విజయాల్లో గోవాకు భాగముంది'
పనాజీ: తన సినిమా విజయాల్లో గోవాకు చాలా భాగం ఉందని బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి అన్నారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ ను గురువారమిక్కడ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'నా విజయాల్లో గోవాకు భాగముంది. గోవాను నా రెండో మాతృభూమిగా భావిస్తా. ముంబై నా జన్మస్థలం. గోవా నా కర్మభూమి' అని రోహిత్ శెట్టి పేర్కొన్నారు.
ఆయన తీసిన పలు సినిమాలు గోవాలో షూటింగ్ జరుపుకున్నాయి. గోవా అంటే తనకెంతో ఇష్టమని, లోకల్ టాలెంట్ ప్రోత్సహిస్తానని ఆయన హామీయిచ్చారు.