బాలీవుడ్ హీరోతో ప్రభాస్ మల్టీ స్టారర్.. నిజమేనా..? | Rohit Shetty Multi starer with Salman Khan, Prabhas | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ హీరోతో ప్రభాస్ మల్టీ స్టారర్.. నిజమేనా..?

Published Tue, Jun 13 2017 12:44 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

Rohit Shetty Multi starer with Salman Khan, Prabhas

బాహుబలి సినిమాతో నేషలన్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో ప్రభాస్. బాహుబలి రెండు భాగాలు బాలీవుడ్లో కూడా ఘన విజయం సాధించటంతో ప్రభాస్తో స్ట్రయిట్ హిందీ సినిమా చేసేందుకు అక్కడి స్టార్ డైరెక్టర్ ప్రయత్నాలు చేస్తున్నారు. కరణ్ జోహార్ లాంటి నిర్మాతలు ప్రభాస్తో సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపించినా... ఇంత వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం రాలేదు.

తాజాగా బాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, ప్రభాస్తో ఓ భారీ మల్టీ స్టారర్ను ప్లాన్ చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. మాస్ మసాలా ఎంటర్టైనర్లు, యాక్షన్ కామెడీలు రూపొందించే రోహిత్ శెట్టి.. సల్మాన్ ఖాన్, ప్రభాస్లు హీరోలుగా భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉండటంతో బడ్జెట్ సమస్య తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి ఈ మెగా మూవీని నిర్మించడానికి ఏ నిర్మాతైన ముందుకొస్తాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement