నాట్స్ తెలుగు సంబరాల్లో డీజే సందడి | DJ team to rock in Naats telugu celebrations | Sakshi
Sakshi News home page

నాట్స్ తెలుగు సంబరాల్లో డీజే సందడి

Published Tue, Jun 27 2017 12:10 AM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM

DJ team to rock in Naats telugu celebrations

బన్నీ తో పాటు దేవీ శ్రీ ప్రసాద్.. హరీష్ శంకర్


అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే నాట్స్ తెలుగు సంబరాల్లో ఈ సారి డీజే టీమ్ సందడి చేయనుంది. చికాగో వేదికగా జరిగే సంబరాల్లో సినీ నటుడు అల్లు అర్జున్, దర్శకుడు హరీశ్ శంకర్, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, కథనాయిక పూజా హెగ్డే తదితరులు నాట్స్ తెలుగు సంబరాలకు వెళ్లనున్నారు.

ఈ సంబరాలను అత్యంత ఘనంగా జరిపేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వేలమంది ఈ సంబరాల్లో పాలుపంచుకునేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అల్లు అర్జున్ తో పాటు దేవీ శ్రీ ప్రసాద్ కూడా వస్తుండటంతో అమెరికాలో ఉండే తెలుగు సినీ ప్రేమికులు సంబరాలకు మేముసైతమంటూ ముందుకొస్తున్నారు. సంబరాలకు డీజే టీమ్ తో పాటు జబర్థస్త్‌ టీమ్ కూడా రానుంది. దీంతో సంబరాల్లో ఆట.. పాటతో పాటు కామెడీ షోలు కూడా కావాల్సినంత సంతోషాన్ని పంచనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement