సాక్షి, అమరావతి : కృష్ణపట్నం పోర్టుకున్న ప్రత్యేక పరిమితులను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రామాయపట్నం పోర్టు ప్రతిపాదనకు అవరోదాలు తొలిగినట్లే కనిపిస్తుంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణపట్నం పోర్టుకు విశేష అధికారాలు కట్టబెట్టారు. పోర్టు పరిధిలోని 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్తగా ఎటువంటి పోర్టు నిర్మాణం చేపట్టకూడదని వారు చేసుకున్న ఒప్పందంలో ప్రధాన క్లాజుగా ఉంది. దీంతో అక్కడ వేరే పోర్టులు ఏర్పాటు కాకుండా కృష్టపట్నం పోర్టు కంపెనీకి బాబు ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది.తాజాగా ఒప్పందంలో ఉన్న క్లాజును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొనడంతో రామాయపట్నం పోర్టుకు అవరోదాలు తొలగిపోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment