krishna patnam port
-
కృష్ణపట్నం పోర్టు వద్ద సోమిరెడ్డి హైడ్రామా
నెల్లూరు: అదాని కృష్ణపట్నంపోర్టులో ఆదివారం అధికారులు ఎవరూ ఉండరు. పోలీసు సిబ్బంది మొత్తం మేదరమెట్ల సిద్ధం సభ విధులకు వెళ్లారు. ఇదే అదనుగా రాజకీయ మైలేజీ సాధించవచ్చని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తలపెట్టిన కుట్ర భగ్నమైంది. కంటైనర్ టెర్మినల్ పరిరక్షణ సాకుతో చేసిన హైడ్రామా నవ్వులపాలైంది. కృష్ణపట్నంపోర్టు కంటైనర్ టెర్మినల్ పరిరక్షణ పేరుతో సోమిరెడ్డి ముత్తుకూరు, తోటపల్లిగూడూరు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలను వెంటేసుకుని పోర్టు వద్దకు ప్రదర్శనగా వచ్చారు. కొంతమందిని ముందుంచి గోపాలపురం వద్దకు చేరుకున్నారు. పోర్టులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోర్టులో ఉన్నతాధికారులు ఎవ్వరూ లేరని, ముందస్తు సమాచారం లేకుండా, వారి అనుమతి లేకుండా లోపలకు వెళ్లనిచ్చేది లేదని సెక్యూరిటీ అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో సోమిరెడ్డి వర్గీయులు రెచ్చిపోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులు పోర్టు సెక్యూరిటీపై విరుచుకుపడడంతో తోపులాట జరిగింది. కొద్దిసేపు గందరగోళం నెలకొంది. సెలవు రోజు ఆందోళన చేయడం ఏమిటంటూ సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నిస్తూ వారి హైడ్రామాను భగ్నం చేశారు. దీంతో సోమిరెడ్డి చేసేది లేక పోర్టు సీఈఓ జీజే రావుకు ఫోన్ చేశారు. ఇచ్చిన గడువు ప్రకారం కంటైనర్ టెర్మినల్‌ను చూసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే కంటైనర్ టెర్మినల్‌కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, ఆదివారం కనుక తనతో పాటు అధికారులు ఎవరూ ఉండరని, పరిశీలనకు మరో మారు రావాలని సీఈఓ బదులు ఇచ్చారు. దీంతో ఎటూ పాలుపోని సోమిరెడ్డి తన కార్యకర్తలతో కొద్ది దూరం నడిచి, మీడియా ఎదుట అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేసి వెనుదిరిగారు. -
కృష్ణపట్నం: బోటులో చెలరేగిన మంటలు
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని కృష్ణపట్నం సమీపంలో మత్స్యకారుల బోటులో మంటలు చెలరేగి దగ్ధం అయింది. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది బోటులో ఉన్న 9 మంది మత్స్యకారులను రక్షించారు. చెన్నైలోని కాశిమేడు ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన బోటుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టులో చెన్నైకి చెందిన జాలర్లు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. చదవండి: ప్రేమ వ్యవహారం: రాయబారానికి పిలిచి హతమార్చారు! -
కృష్టపట్నం పోర్టుకు ప్రత్యేక పరిమితులు రద్దు
సాక్షి, అమరావతి : కృష్ణపట్నం పోర్టుకున్న ప్రత్యేక పరిమితులను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రామాయపట్నం పోర్టు ప్రతిపాదనకు అవరోదాలు తొలిగినట్లే కనిపిస్తుంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణపట్నం పోర్టుకు విశేష అధికారాలు కట్టబెట్టారు. పోర్టు పరిధిలోని 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్తగా ఎటువంటి పోర్టు నిర్మాణం చేపట్టకూడదని వారు చేసుకున్న ఒప్పందంలో ప్రధాన క్లాజుగా ఉంది. దీంతో అక్కడ వేరే పోర్టులు ఏర్పాటు కాకుండా కృష్టపట్నం పోర్టు కంపెనీకి బాబు ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది.తాజాగా ఒప్పందంలో ఉన్న క్లాజును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొనడంతో రామాయపట్నం పోర్టుకు అవరోదాలు తొలగిపోనున్నాయి. -
తీరం హైఅలర్ట్
నెల్లూరు(క్రైమ్): శ్రీలంక నుంచి సముద్రమార్గం ద్వారా ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడే ప్రమాదం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. శ్రీలంకలో ఆదివారం 8 చోట్ల పేలుళ్లు జరిగి 215 మంది ప్రజలు మృతి చెందగా వందల మందిక్షతగాత్రులైన విషయం తెలిసిందే. సోమవారం కొలంబోలోని ఓ చర్చిలో, హోటళ్లలో పేలుళ్లు సంభవించాయి. వరుస పేలుళ్లతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమై ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. దీంతో ఉగ్రవాదులు సముద్రమార్గం గుండా భారత్‌లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలకు సంకేతాలు అందాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్రాలకు సూచించాయి. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం శ్రీలంక తీరానికి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. తమిళనాడులోని తూత్తుకూడి, కన్యాకుమారి, రామేశ్వరం తదితర ప్రాంతాల్లో తీరం వెంబడి భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. మన రాష్ట్రంలో సైతం అధికారులు అప్రమత్తమయ్యారు. మెరైన్ ఉన్నతాధికారులు సోమవారం సిబ్బందితో సమావేశమయ్యారు. నెల్లూరు తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దు జిల్లా కావడంతో జిల్లాలో తీరం వెంబడి హైఅలెర్ట్ ప్రకటించారు. 167 కి.మీ. మేర జిల్లాలో తీరప్రాంతం విస్తరించి ఉంది. తీరం వెంబడి 125 గ్రాములు ఉన్నాయి. ఆయా గ్రామాల్లోని పెద్దలు, మత్స్యకారులతో మెరైన్ పోలీసులు అత్యవసర సమావేశాలు నిర్వహించారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలను వారికి తెలియజేశారు. కొత్త వ్యక్తులు తారసపడినా, సముద్రంలో అనుమనాస్పదంగా బోట్లు సంచరిస్తున్నా వెంటనే తమకు తెలియజేయాలని కోరారు. ఇస్కపల్లి, దుగరాజపట్నం, శ్రీహరికోట మెరైన్ పోలీసులు బృందాలుగా విడిపోయి తీరం వెంబడి గస్తీని ముమ్మరం చేశారు. జాలర్ల ముసుగులో ఉగ్రవాదులు వచ్చే అవకాశం ఉండడంతో తీరప్రాంత పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉన్న మత్స్యకారులను సైతం గస్తీలో భాగస్వాములను చేశారు. మరోవైపు కోస్ట్‌గార్డ్ సిబ్బంది సముద్రంలో గస్తీ చేపట్టాయి. తమిళనాడు వైపు నుంచి వచ్చే ఏచిన్న బోటును వదలకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయి వివరాలు సేకరించిన అనంతరమే వారిని విడిచిపెడుతున్నారు. దేశానికే తలమానికమైన షార్ వద్ద కేంద్రబలగాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. షార్ చుట్టూ తనిఖీలు ముమ్మరం చేసినట్లు సమాచారం. కృష్ణపట్నం పోర్టులోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. మెరైన్ పోలీసులతోపాటు స్థానిక పోలీసులు సైతం భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. తాజా పరిస్థితులను మెరైన్ పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సిబ్బందికి వివరిస్తూ అందుకు అనుగుణంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. -
పొంచి ఉన్న ఫైలిన్
సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఫైలిన్ తుపాను ప్రభావం కనిపించింది. గురువారం మధ్యాహ్నం నెల్లూరు నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక జిల్లావ్యాప్తంగా మధ్యాహ్నం నుంచి మబ్బులు కమ్మి పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురవగా, మిగిలిన చోట్ల చిరుజల్లులు పడ్డాయి. శుక్రవారం నాటికి తుపాను ప్రభావం అధికంగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి కలెక్టర్ శ్రీకాంత్ నేతృత్వంలో తీరప్రాంత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కృష్ణపట్నం ఓడరేవులో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వెళ్లిన వారు తక్షణం తిరిగి రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో సముద్రంలో అలజడి నెలకొంది. తుపాను తీవ్ర రూపం దాల్చే పరిస్థితిలో లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే సమ్మెలో ఉన్న అధికారులందరినీ విధుల్లో చేరాలని కలెక్టర్ ఆదేశించారు. తీరం.. అప్రమత్తం బిట్రగుంట, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పెనుతుపాన్‌గా మారే ప్రమాదం ఉందనే అధికారిక హెచ్చరికల నేపథ్యంలో తూర్పుతీరం అప్రమత్తమైంది. విపత్తుల సమయంలో కీలకంగా వ్యవహరించే రెవెన్యూ ఉద్యోగులు సహా వివిధ విభాగాలు సమైక్య సమ్మెలో ఉండటంతో తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులు, కాపులే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు తీరంలోనూ వాతావరణ పరిస్థితి క్రమంగా అల్లకల్లోలంగా మారుతుంది. ‘ఫైలిన్’ పెనుతుపాన్ హెచ్చరికలు చేసిన కొద్ది గంటలకే తీరం వెంట సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం నుంచి వాతావరణంలో అనూహ్యంగా మార్పులు ఏర్పడి సముద్రంలో అలల ఉధృతి అధికమైంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలతో తీరం అల్లకల్లోలంగా ఉంది. తాటిచెట్లపాళెం వద్ద సముద్రం కొంత మేర ముందుకు దూసుకువచ్చింది. అలల ఉధృతికి తోడు భారీ జల్లులు పడుతుండటంతో పడవలు, వలలను తీరానికి దూరంగా తరలించి భద్రపరచుకునేందుకు మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జోరువానలో తడుస్తూనే వలలు, పడవలను తీరానికి దూరంగా తరలించారు. ఈదురు గాలులకు తోడు పెద్దపెద్ద శబ్దాలతో అలలు విరుచుకుపడుతుండటంతో గంగపుత్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తుపాన్ భయంతో తీరప్రాంత గ్రామాలైన బంగారుపాళెం, కొత్తబంగారు పాళెం, పాతబంగారు పాళెం, అలిచెర్లబంగారుపాళెం, తాటిచెట్లపాళెం, కడపాళెం, కొత్తకడపాళెం, టెంకాయచెట్లపాళెం చెందిన మత్స్యకారులు హడలిపోతున్నారు. సమైక్య రైతు దీక్ష ఆనం రామనారాయణరెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో జేఏసీ నాయకులు ప్రజాకోర్టు నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధనరెడ్డి నాయకత్వంలో రైతు దీక్షలు జరిగాయి. గూడూరులో పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద జేఏసీ నాయకులు రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అపర భగీరథుడని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి అన్నారు. గూడూరు రూరల్ మండలం తిప్పవరప్పాడు క్రాస్‌రోడ్డు వద్ద రైతు దీక్షలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్, మండల, పట్టణ కన్వీనర్లు మల్లు విజయ్‌కుమార్‌రెడ్డి, నాశిన నాగులు, నాయకులు రాధాకృష్ణారెడ్డి, రాజే శ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంటలో వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో సమైక్య రైతు దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలకు వైఎస్సార్సీపీ నేతలు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, డాక్టర్ బాలచెన్నయ్య సంఘీభావం తెలిపారు. వాకాడులో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నేదురుమల్లి పద్మనాభరెడ్డి, మండల కన్వీనర్ నేదురుమల్లి ఉదయ్‌శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల రైతులు గురువారం రైతు దీక్ష చేపట్టారు. సైదాపురం, రాపూరు, వెంకటగిరిలో జరిగిన రైతు దీక్షల్లో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు పాల్గొన్నారు. సూళ్లూరుపేట బస్టాండ్ సెంటర్లో నియోజకవర్గ సమన్వయకర్త దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో రైతుదీక్ష నిర్వహించారు. నాయుడుపేటలో మరో సమన్వయకర్త నెలవల సుబ్రమణ్యం ఆధ్వర్యంలో రైతులతో కలిసి ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి రైతుదీక్షను చేపట్టారు. సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో తడ, ఓజిలి మండలాల్లో రైతుదీక్ష చేశారు. పెళ్లకూరు, సూళ్లూరుపేట, దొరవారిసత్రం మండలాల్లో జరిగిన దీక్షల్లో కూడా ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆత్మకూరులో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు.కావలిలో గాంధీబొమ్మ సెంటర్లో నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్షలు ప్రారంభమయ్యాయి.