Vijayawada: CP Announced Restrictions On New Year 2023 Celebrations, Details Inside - Sakshi
Sakshi News home page

Vijayawada: న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు.. అర్ధరాత్రి తర్వాత హడావిడి కుదరదు

Published Fri, Dec 30 2022 2:23 PM | Last Updated on Fri, Dec 30 2022 4:27 PM

Vijayawada: CP Announced Restrictions New Year 2023 celebrations - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విజయవాడ: నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు ప్రకటించింది పోలీస్‌ శాఖ. ఈ మేరకు వేడుకలకు సంబంధించి ఆంక్షలను శుక్రవారం నగర సీపీ కాంతిరానా టాటా ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, కేకులు కట్ చేస్తూ హడావిడి చేయడం లాంటి చర్యలు కుదరవని హెచ్చరించారు ఆయన. 

బార్ అండ్ రెస్టారెంట్లు అనుమతి ఇచ్చిన సమయానికి మించి తెరవకూడడదు. అలాగే డీజేలకు అనుమతి తీసుకోవాలి. ఈవెంట్స్ ఆర్గనైజర్లు, క్లబ్ లు, పబ్ ల నిర్వాహకులు పోలీసు అనుమతి తీసుకోవాలని, అర్ధరాత్రి 12 గంటల వరకు వేడుకలు నిర్వహించినా.. జనం మాత్రం ఒంటిగంటకల్లా ఇళ్లకు చేరుకోవాలని ముందస్తు సూచన చేశారు సీపీ. అలాగే.. ఫ్లై ఓవర్లు మూసేస్తామని, రాత్రిళ్లు రోడ్లపై తిరగడం కుదరదని ప్రజలకు తెలిపారు. 

విజయవాడలో 31 రాత్రి తర్వాత.. 144 సెక్షన్, సెక్షన్ 30 అమలులో అవుతుందని ప్రజలకు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో  మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర సీపీ స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement