నెట్‌ఫ్లిక్స్ బాటలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney+ Hotstar) కూడా తమ యూజర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. పాస్‌వర్డ్ షేరింగ్‌ను పరిమితం చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు పాస్‌వర్డ్ షేరింగ్‌పై ఆంక్షలు నవంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు తెలియజేస్తూ సబ్‌స్క్రైబర్ ఒప్పందానికి సంబంధించిన అప్‌డేట్‌లను కెనడాలోని సబ్‌స్క్రైబర్‌లకు ఈ-మెయిల్ చేసింది.
ది వెర్జ్ కథనం ప్రకారం.. అకౌంట్ పాస్‌వర్డ్ షేరింగ్‌పై డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కఠిన ఆంక్షలను తీసుకొస్తోంది. దీనికి సంబంధించి దాని వెబ్‌సైట్‌లోని హెల్ప్ సెంటర్‌ను కూడా అప్‌డేట్ చేసింది.
యూజర్లు నిబంధనలను ఉల్లంఘించి పాస్‌వర్డ్ షేర్ చేయకుండా వారి అకౌంట్లను పర్యవేక్షించనుంది. కెనడియన్ సబ్‌స్క్రైబర్ ఒప్పందంలో "అకౌంట్ షేరింగ్"పై కొత్త నిబంధనను చేసింది. అందులో సబ్‌స్క్రయిబ్ అయిన యూజర్ల ఖాతాలను పర్యవేక్షిస్తామని కంపెనీ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని, సబ్‌స్క్రిప్షన్‌ను శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించింది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పాస్‌వర్డ్ షేరింగ్ ఆంక్షలు కెనడాలో 2023 నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. భారత్‌తో సహా ఇతర దేశాల్లో కూడా ఈ ఆంక్షలను అమలు చేయాలని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment