Omicron Hyderabad Restrictions: కొత్త వేరియంట్‌కు వేగంగా విస్తరించే గుణం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే చారిత్రక ట్యాంక్‌బండ్ సహా చార్మినార్‌ల వద్ద ‘ఫన్‌డే’ వేడుకలను రద్దు చేసింది. సందర్శకులపైనే కాకుండా సాధారణ ప్రజలపై కూడా ఆంక్షలు విధించింది. ప్రతి ఒక్కరూ మాస్క్‌ను విధిగా వాడాలనే ఆదేశాలను ఖచ్చితం చేసింది.
వైరస్‌కు హాట్‌స్పాట్‌లుగా మారిన జియాగూడ, మేకలమండి, మలక్‌పేట్ గంజ్, బేగంబజార్, పాతబస్తీ, మలక్‌పేట్, బేగంపేట్, మాదన్నపేట, గుడిమల్కాపూర్, సరూర్‌నగర్ మార్కెట్లపై మళ్లీ ఆంక్షలు విధించింది. కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించిన వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.
చదవండి: (వెంటపడ్డాడు.. నమ్మించాడు.. పలుమార్లు గదికెళ్లి కోరికలు..)
Comments
Please login to add a commentAdd a comment