టెహ్రాన్:ఇరాన్‌పై దాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలతో ఇరాన్ అప్రమత్తమైంది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం(అక్టోబర్7) ఉదయం 6 గంటల దాకా దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల నుంచి విమానాలను ఇరాన్ రద్దు చేసింది .అయితే విమానాల భద్రతకు సంబంధించి కొన్ని చర్యలు తీసుకున్న తర్వాత విమాన సర్వీసులన్నింటినీ పునరుద్ధరించినట్లు సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు.
అక్టోబర్ 7 సందర్భంగా ఇజ్రాయెల్ దాడి చేస్తుందేమోనన్న అనుమానంతోనే ఇరాన్ తన గగనతలంలో విమానాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది.గతేడాది అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి వేల మందిని చంపేశారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ అటు హమాస్ ఇటు హెజ్బొల్లా గ్రూపులపై దాడులు చేస్తూనే ఉంది. ఈ తీవ్రవాద గ్రూపులన్నీ ఇరాన్ స్నేహితులే కావడం గమనార్హం.
ఇదీ చదవండి: ఏడువైపులా శత్రువులతో పోరాడుతున్నాం: ఇజ్రాయెల్
Comments
Please login to add a commentAdd a comment