కేరళ: కోజికోడ్‌లో బాలుడి మృతదేహానికి పీపీఈ కిట్లతో అంత్యక్రియలు చేస్తున్న సిబ్బంది (ఫైల్)
బెంగళూరు: పక్క రాష్ట్రం కేరళలో రోజురోజుకు మహమ్మారి కరోనా విజృంభణ పెరుగుతుండడంతోపాటు నిఫా వైరస్ కూడా కలకలం సృష్టించడంతో కర్ణాటక అప్రమత్తమైంది. కేరళకు రాకపోకలు సాగించొద్దని ఆంక్షలు విధించింది. అత్యవసరమైతేనే వెళ్లాలని ప్రజలకు సూచించింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక ద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ ప్రకటించారు. అక్టోబర్ చివరి వరకు ఈ పరిస్థితి విధిస్తున్నట్లు తెలిపారు.
చదవండి: బట్టతల శాపం కాదు అదృష్టం! ఈ ఉత్సవం మీకోసమే..
‘పొరుగు రాష్ట్రం కేరళలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు, హోటళ్లు, పరిశ్రమలు, ఇతర సంస్థలు కేరళకు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. అక్టోబర్ నెలాఖరు వరకు వాయిదా వేసుకోండి’ అని మంత్రి సుధాకర్ ట్వీట్ చేశారు. ఇప్పటికే కేరళ నుంచి వచ్చేవారికి ప్రత్యేక నిబంధనలు రూపకల్పన చేశారు. వచ్చే వారందరికీ టెస్టులు తప్పనిసరిగా చేశారు. కేరళ నుంచి వచ్చే వారి వలనే దక్షిణ కర్ణాటక, ఉడిపి ప్రాంతంలో కరోనా వ్యాప్తి పెరిగిందని వైద్యారోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పై ఆంక్షలు విధించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి జావేద్ అక్తర్ ఉత్తర్వులు జారీ చేశారు.
చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి తండ్రి అరెస్ట్
Considering the prevailing situation in neighbouring Kerala, all educational institutions, hospitals, nursing homes, industries, hotels and other establishments in the state have been advised to instruct their wards to defer their travel from Kerala until the end of October 2021. https://t.co/3uY5vEPVJS
— Dr Sudhakar K (@mla_sudhakar) September 7, 2021
Comments
Please login to add a commentAdd a comment