న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ ఆర్‌బీఐ ఊరట కలిగించింది. బీవోబీ వరల్డ్ మొబైల్ యాప్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు తాజాగా బీవోబీకు అనుమతినిచ్చింది.
బీవోబీ వరల్డ్ యాప్ ద్వారా వినియోగదార్లను చేర్చుకోరాదంటూ 2023 అక్టోబర్ 10న ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. వర్తించే మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా వినియోగదార్లను చేర్చుకుంటామని బీవోబీ తెలిపింది.
'బీవోబీ వరల్డ్' యాప్ అనేది పెద్ద సంఖ్యలో కస్టమర్‌ల కోసం ఒక ప్రాథమిక ఛానెల్, వీడియో కేవైసీ ద్వారా ఖాతా తెరవడాన్ని సులభతరం చేస్తుంది. కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఓ మొబైల్ బ్యాంకింగ్ ఛానెల్‌ని ఆర్‌బీఐ నిషేధించడం ఇదే తొలిసారిగా నిలిచింది. ఈ నెల ప్రారంభంలో, కొత్త కస్టమర్లను డిజిటల్‌గా ఆన్‌బోర్డ్ చేయకుండా కోటక్ బ్యాంక్‌ను కూడా ఆర్‌బీఐ నిషేధించింది.
Comments
Please login to add a commentAdd a comment