ఉద్యమంలా హరితం
♦ 11న పెద్దఎత్తున మొక్కలు నాటాలని
♦ కలెక్టర్ రఘునందన్‌రావు ఆదేశం
♦ 11న పెద్దఎత్తున మొక్కలు నాటాలని ఆదేశం
♦ మండలాల్లో హరితహారం బాధ్యత ఎంపీడీఓలకు అప్పగింత
♦ ప్రత్యేకాధికారుల సమావేశంలో కలెక్టర్ రఘునందన్‌రావు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాలో హరితహారం ఉద్యమంలా నిర్వహించాలని కలెక్టర్ రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. ఈ నెల 11న పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో మండలాల ప్రత్యేకాధికారులతో ‘హరితహారం’ కా ర్యక్రమంపై చర్చించారు.మహోద్యమంలా సాగే ఈ కార్యక్రమంలో అన్నివర్గాల ప్రజలను భాగస్వామ్యులను చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పారిశ్రామిక వాడలు, రోడ్లకు ఇరువైపులా ఖాళీ స్థలాల్లో..
మిషన్ కాకతీయ చెరువుగట్లపైనా మొక్కలు నాటడానికి వీలుగా ముందుగానే గుంతలు తీసి సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో హరితహారం కొనసాగాలని చెప్పారు. గుంతలు తీయడం మొద లు, మొక్కలు నాటడం, వాటి సంరక్షణకు బా ధ్యులను నియమించాలని ఆదేశించారు. మం డల స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమానికి స్థానిక ఎంపీడీఓలను బాధ్యులను చేయాలని జెడ్పీ సీఈఓ రమణారెడ్డికి స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో మొ క్కలు నాటే బాధ్యత డీ ఈఓకు అప్పగించారు. రైతులకు సంబంధించి ఆధార్ సీడింగ్ ప్రక్రియను వేగిరం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కాట ఆమ్రపాలి, సబ్‌కలెక్టర్ శ్రుతి ఓజా, అసిస్టెంట్ కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.