రాజ్యాధికార సాధనకు మరో ఉద్యమం
బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నారగోని
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ: బడుగు, బలహీన వర్గాలు రాజ్యాధికారాన్ని సాధించుకునేందుకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నారగోని అన్నారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సభ కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టంలోనూ అగ్రకులాలే పెత్తనం చేస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాధికార సాధనతోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ బడ్జెట్‌లో బడుగు, బలహీన వర్గాలను పూర్తిగా విస్మరించిందని, ఉచిత అమలుకు రూ. 25 కోట్లు కేటాయించి నిరుపేద లను అన్యాయం చేశారన్నారు.
ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందిస్తామన్న హామీల అమలుకు చర్యలు చేపట్టలేదన్నా రు. ఈ నెల 9న సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో నిర్వహ/ంచను న్న తెలంగాణ రాష్ట్ర స్థారుు ప్రతినిధుల సభకు ఎ స్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనార్టీ, క్రిష్టియన్లు అ దిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
సమితి జిల్లా ఉపాధ్యక్షుడిగా దుర్గప్రసాద్
స్థానిక హనుమాన్‌పురకు చెందిన కావలి దుర్గా ప్రసాద్ బీసీ సంఘర్షణ సమితి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు సమితి జాతీయ అధ్యక్షులు వీజీఆర్ నారగోని గురువారం ఆయనకు నియామకపత్రం అందజేశా రు. బీసీల సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రోనార్డ్‌జాన్, కుర్మయ్య, రాజశేఖర్ గౌడ్, సత్యంయాదవ్, లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు.