naragoni
-
బీసీలకు సబ్‌ప్లాన్ అమలు చేయాలి
అనంతపురం సప్తగిరిసర్కిల్ : బీసీలకు సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలని బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షుడు నారగోని డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లను 25 శాతం నుంచి 44 శాతానికి పెంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బండి శివ, ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్, ప్రచార కార్యదర్శి మహేష్, జిల్లా నాయకులు రఘు, మల్లేష్, శీనా, శంకరయ్య, బాలకృష్ణ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
’బీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని ఏర్పాటుచేయాలి’
హైదరాబాద్ : సమాజంలో 52 శాతం ఉన్న బీసీల అభివృద్దికి బీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని ఏర్పాటుచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహాజన పాదయాత్రను పురస్కరించుకుని బీసీల సమస్యలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ బీసీ సబ్‌ప్లాన్ చట్టం వస్తేనే వారు అభివృద్ది చెందుతారని, దీని కోసం గత రెండేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 92శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్దియే తెలంగాణ అభివృద్ది అన్నారు. వెనకబడిన కులాల ప్రజల అభివృద్ది కోసం ప్రత్యేక చట్టాలు రావాలన్నారు. రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు విజిఆర్ నారగోని మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందని అన్నారు. బలహీన వర్గాల అభివృద్ది పట్ల ప్రభుత్వాలు స్పందించడం లేదని విమర్శించారు. ఉన్నత వర్గాల వారే అధికారంలోకి రావడం వల్ల బడుగుల జీవితం అరణ్య రోదనగా మారిందన్నారు. రాజ్యాధికారం బడుగుల చేతుల్లోకి రావాలంటే మన ఓట్లను మనమే వేసుకోవాలని అన్నారు. 52శాతం ఉన్న బిసిలను మనం ఓటు బ్యాంక్‌గా ఎందుకు మార్చుకోకుడదని. పోరాటం మనం చేస్తే ఓట్లు వారికి వేస్తున్నారన్నారు. -
కేసీఆర్ పెద్ద మోసకారి
టీజేఎస్ ప్రధాన కార్యదర్శి నారగోని ఆసిఫాబాద్ : సీఎం కేసీఆర్ పెద్ద మోసకారని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారగోని విమర్శించారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి విస్మరించారని, దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి అతనే గద్దెనెక్కాడని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చైతన్యయాత్రలో భాగంగా స్థానిక రోజ్‌గార్డెన్‌లో శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ ఒరవడి సృష్టించేందుకే తెలంగాణ జనసమితిని ఏర్పాటు చేశామన్నారు. తాము ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, మనల్ని మనం సంస్కరించుకోవడానికే చైతన్యయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ బలహీనపడిందని, కాంగ్రెస్ ముసలివాళ్లతో కాలం వెల్లదీస్తుందని, మోసం చేసే పార్టీల్లోని ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు బయటకి రావాలని పిలుపునిచ్చారు. 96 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలున్న రాష్ట్రంలో కేవలం 3 శాతం ఉన్న అగ్రవర్ణాలు రాజ్యాధికారం అనుభవిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో రెడ్లు, దొరలు రాజకీయ పదవులు అనుభవిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పథకాలకే పరిమితం చేస్తున్నారన్నారు. రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, రిటైర్డ్ కమీషనర్ నాగు, చంద్రన్న, ఎంపీపీ తారాబాయి, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బద్రి సత్యనారాయణ, భరత్ వాగ్మేరే, రేగుంట కేశవరావు మాదిగ, మాలి సంఘం జిల్లా అద్యక్షుడు నికోడె రవీందర్, సిడాం అర్జు, మొండి పాల్గొన్నారు. -
రాజ్యాధికార సాధనకు మరో ఉద్యమం
బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నారగోని మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ: బడుగు, బలహీన వర్గాలు రాజ్యాధికారాన్ని సాధించుకునేందుకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నారగోని అన్నారు. గురువారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సభ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టంలోనూ అగ్రకులాలే పెత్తనం చేస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాధికార సాధనతోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ బడ్జెట్లో బడుగు, బలహీన వర్గాలను పూర్తిగా విస్మరించిందని, ఉచిత అమలుకు రూ. 25 కోట్లు కేటాయించి నిరుపేద లను అన్యాయం చేశారన్నారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందిస్తామన్న హామీల అమలుకు చర్యలు చేపట్టలేదన్నా రు. ఈ నెల 9న సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో నిర్వహ/ంచను న్న తెలంగాణ రాష్ట్ర స్థారుు ప్రతినిధుల సభకు ఎ స్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిష్టియన్లు అ దిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమితి జిల్లా ఉపాధ్యక్షుడిగా దుర్గప్రసాద్ స్థానిక హనుమాన్‌పురకు చెందిన కావలి దుర్గా ప్రసాద్ బీసీ సంఘర్షణ సమితి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు సమితి జాతీయ అధ్యక్షులు వీజీఆర్ నారగోని గురువారం ఆయనకు నియామకపత్రం అందజేశా రు. బీసీల సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రోనార్డ్జాన్, కుర్మయ్య, రాజశేఖర్ గౌడ్, సత్యంయాదవ్, లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు. -
'చేతకాని సీఎంగా మిగలనున్న చంద్రబాబు'
కావలి : అధికారం కోసం ఇష్టానుసారం ఉచిత హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక రాష్ట్ర చరిత్రలో చేతకాని సీఎంగా చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో మిగలనున్నారని బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షుడు వీజీఆర్ నారగోని అన్నారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన రైతు రుణమాఫీ అసాధ్యమని వ్యాఖ్యానించారు. చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తామని బాబు హామీ ఇస్తే బాగుండేదన్నారు. అమలుకు సాధ్యమయ్యే హామీలు ఇవ్వాలే తప్ప అధికారం కోసం ఇలా హామీలు ఇవ్వడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు ఉచిత వాగ్దానాలు ఇవ్వడం పనికి మాలిన చర్యగా నారగోని అభివర్ణించారు. బీసీల రిజర్వేషన్‌ను 25 శాతం నుంచి 44 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. అనంతపురం, శ్రీకాకుళానికి అందుబాటులో ఉండేలా ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.