హైదరాబాద్ : సమాజంలో 52 శాతం ఉన్న బీసీల అభివృద్దికి బీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని ఏర్పాటుచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహాజన పాదయాత్రను పురస్కరించుకుని బీసీల సమస్యలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ బీసీ సబ్‌ప్లాన్ చట్టం వస్తేనే వారు అభివృద్ది చెందుతారని, దీని కోసం గత రెండేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 92శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్దియే తెలంగాణ అభివృద్ది అన్నారు. వెనకబడిన కులాల ప్రజల అభివృద్ది కోసం ప్రత్యేక చట్టాలు రావాలన్నారు.
రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు విజిఆర్ నారగోని మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందని అన్నారు. బలహీన వర్గాల అభివృద్ది పట్ల ప్రభుత్వాలు స్పందించడం లేదని విమర్శించారు. ఉన్నత వర్గాల వారే అధికారంలోకి రావడం వల్ల బడుగుల జీవితం అరణ్య రోదనగా మారిందన్నారు. రాజ్యాధికారం బడుగుల చేతుల్లోకి రావాలంటే మన ఓట్లను మనమే వేసుకోవాలని అన్నారు. 52శాతం ఉన్న బిసిలను మనం ఓటు బ్యాంక్‌గా ఎందుకు మార్చుకోకుడదని. పోరాటం మనం చేస్తే ఓట్లు వారికి వేస్తున్నారన్నారు.
’బీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని ఏర్పాటుచేయాలి’
Published Thu, Sep 22 2016 8:11 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
Advertisement