ఒడిశా రాష్ట్రంలో శుక్రవారం జరిగి న పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ఉద్యమంలో ఉన్న జిల్లా వాసి మృతి చెం దాడు. పాన్‌గల్ మండలం గోప్లాపూర్‌కి చెందిన మధు అలియాస్ గొల్లరాములు (35) పోలీసు తూటాలకు బలయ్యాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం..
పాన్‌గల్, న్యూస్‌లైన్: ఒడిశా రాష్ట్రంలో శుక్రవారం జరిగి న పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ఉద్యమంలో ఉన్న జిల్లా వాసి మృతి చెం దాడు. పాన్‌గల్ మండలం గోప్లాపూర్‌కి చెందిన మధు అలియాస్ గొల్లరాములు (35) పోలీసు తూటాలకు బలయ్యాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం... గోప్లాపూర్‌కి చెందిన గొల్లగౌరమ్మ, పెంటయ్య దంపతుల కుమారుడు గొల్లరాములు ఐదో తరగతి వరకు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనే చదువుకున్నాడు. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాన్‌గల్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, తొమ్మిది, పదో తరగతి వనపర్తిలో పూర్తి చేశాడు. 1996-97లో వనపర్తి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌లో చేరిన రాములు ఎస్‌ఎఫ్‌ఐ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అదే సమయంలో ప్రజా నాట్య మండలిలో పనిచేస్తూ నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితుడై, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అతను ఎక్కడున్నాడో తెలియదని, ఇన్నేళ్ల తర్వాత టీవీల్లో ఆయన మరణ వార్త వింటున్నామని గ్రామస్తులు తెలిపారు. రాములు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోప్లాపూర్‌లో విషాదం అలుముకుంది. రాములు తల్లి గౌరమ్మకు అనారోగ్యంతో బాధపడుతోంది. పక్షపాతంతో మంచం పట్టిన తండ్రి పెంటయ్యకు కుమారుడి మరణవార్త చెప్పలేదు.
కుటుంబ నేపథ్యం...
నిరుపేద కుటుంబానికి చెందిన గొల్ల పెంటమ్మ, గౌరమ్మలకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. గొల్ల రాములు కుటుంబంలో మూడో కుమారుడు. పెద్ద కొడుకు పెద్ద బిచ్చన్న గ్రామంలో వ్యవసాయం చేసుకుంటుండగా, రెండో కుమారుడు చిన్న బిచ్చన్న రేషన్ డీలరుగా పని చేస్తున్నారు. ముగ్గురు కూమార్తెల్లో ఒక్క కూతురు చనిపోయింది.