వర్గ దృష్టితో కుల నిర్మూలన
సమీక్షణం
వర్గ దృష్టితో కుల నిర్మూలన
పుస్తకం : పల్లవి లేని పాట
రచన : రంగనాయకమ్మ
విషయం : ‘ఎక్కడ ఏ ఉద్యమం, ఏ విప్లవం, అపజయం పాలైనా దానికి కారణం ప్రజలు అవరు. నాయకులే అవుతారు. ప్రజలకు ఏ నూతన చైతన్యాలూ, ఏ నూతన నియమాలూ నేర్పని, నేర్పే అర్హతలు లేని నాయకులే స్వప్పాల్ని నవ్వుల పాలు చేస్తారు.’ : రంగనాయకమ్మ
కొండపల్లి కోటేశ్వరమ్మ రాసిన ‘నిర్జన వారధి’ చదివాక చెరుకూరి సత్యనారాయణ రాసిన ‘తొణికిన స్వప్నం’ అనే వ్యాసానికి సమాధానంగా ‘విరిగిన స్వప్నం’ పేరుతో రంగనాయకమ్మ రాసిన వాక్యాలు పైవి. అన్ని కమ్యూనిస్టు పార్టీలకు, విప్లవ పార్టీలకు ఉపకరించే మాటలవి. ‘పల్లవి లేని పాట’ పేరుతో ఒక నవలికా, కుల విధానం, దెయ్యాల శాస్త్రం, మార్క్సిజం గురించిన కొన్ని వ్యాసాలూ కలిపి వేసిన ఈ పుస్తకం ఓ వంద పుస్తకాలు చదివిన అనుభవాన్ని కలిగిస్తుంది. ఉన్నవి 18 వ్యాసాలే అయినప్పటికీ సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక అంశాలపై పాఠకుడికి విస్తృత అవగాహన కలిగిస్తాయి. కొడవటిగంటి కుటుంబరావు తాత్విక వ్యాసాలలో ఉన్న ‘బుద్ధికొలత వాదం’పై చేసిన విమర్శకు స్పందించిన విరసం నాయకులకు జవాబుగా మరో మూడు వ్యాసాలు రాసి, మార్క్సిస్టుకు ఉండాల్సిన జాగ్రత్తలు చెప్పారు.
లక్ష్మింపేట మారణకాండకు ముందునించీ అటు దళిత ఉద్యమకారులకీ, ఇటు విప్లవోద్యమకారులకీ మధ్య కుల నిర్మూలనపై ఉన్న బేధాభిప్రాయాల నేపథ్యంలో.... ప్రజాపంథా, జనశక్తి వంటి పార్టీల ధృక్పథాలనూ, వేములపల్లి వెంకటరామయ్య, చంద్రంల ఆలోచనలనూ వివరిస్తూనే, ‘దళిత సమస్య పరిష్కారానికి బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాలడు, మార్క్సు మాత్రమే అవసరం’ అనే తన అవగాహనపై ఉసా, బిఎస్ రాములు, ఎంఎఫ్.గోపీనాథ్, పండ్ల గోపీకృష్ణ, తంగిరాల చక్రవర్తి, వైవి రమణరావులకు జవాబులు ఇచ్చారు. మానవ హక్కుల కార్యకర్త ఎన్.జీవన్‌కుమార్ పాకీపని కార్మికుల విషాద జీవనంపై రాసిన వ్యాసానికి సహానుభూతి చెందారు. చివరగా స్కైబాబా అధూరె కథలపై రాసిన ఏడు ఉత్తరాలను పొందుపర్చారు.
- డా. నూకతోటి రవికుమార్
పేజీలు: 222 వెల: 100
ప్రతులకు: అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్డు,
విజయవాడ-2;
ఫోన్: 0866- 2431181
చావుమీద బతికేవాళ్లు...
పుస్తకం : మరణానంతర జీవితం (నవల)
రచన : నందిగం కృష్ణారావు
విషయం : మరణానంతర జీవితం.. ఇది ఎవరూ చూడలేనిది. అయితే ఎవరైనా మరణిస్తే మూఢాచారాల పేరుతో కలచివేసే సంఘటనలు చాలామందికి ఎదురుపడే ఉంటాయి. పుట్టుక నుంచి గిట్టుక వరకు, అందులోనూ ప్రధానంగా అంత్యక్రియల మూఢాచారాల పేరుతో జరిగే దోపిడీ... ఆ తంతు చేయకపోతే బతికున్నవాడి పుట్టి కూడా మునిగిపోతుందనే పెద్దలు... గ్రామాల్ని గడగడలాడించిన దొరలు సైతం బ్రాహ్మణ్యం ముందు బానిసే అవుతారంటూ రచయిత నందిగం కృష్ణారావు రాసిన ‘మరణానంతర జీవితం’ నవల వాస్తవాల్ని కళ్ల ముందుంచింది. అయినవాడు పోయాడన్న బాధ ఒక పక్క... పంతులు చెప్పినట్టు పాడె కట్టకపోతే దెయ్యాలు, భూతాలవుతారనే భయం మరోపక్క... ఈ రెండింటి మధ్య నలిగిపోయే మనిషి చివరికి కర్మకాండలు పూర్తి కావడమంటే చావు మీద బతికే వాళ్లని వదిలించుకోవడమనే నిజాన్ని లైవ్లీగా రాశారు రచయిత.
- పెమ్మరాజు
పేజీలు: 192; వెల: 120; ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట, హైదరాబాద్-36. ఫోన్: 040-27678430
కొత్త పుస్తకాలు
వాయుగానం (కావ్యం)
రచన: తాళ్లూరి లాబన్‌బాబు
పేజీలు: 152; వెల: 100
ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 403, విజయసాయి రెసిడెన్సీ, 16-11-20/7/1/1, సలీంనగర్ కాలనీ, మలక్‌పేట, హైదరాబాద్-36. ఫోన్: 9848787284
పావని (దీర్ఘకవిత)
రచన: బి.హనుమారెడ్డి
పేజీలు: 94; వెల: 50
ప్రతులకు: అధ్యక్షులు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం, ఒంగోలు-523002. ఫోన్: 9440288080
ఝాన్సీ హెచ్.ఎం. (కథలు)
రచన: చెన్నూరి సుదర్శన్
పేజీలు: 128; వెల: 100
ప్రతులకు: రచయిత, 1-1-21/19, ప్లాట్ నం.5, రోడ్ నం.1, శ్రీ సాయి లక్ష్మి శోభా నిలయం, రామ్ నరేష్ నగర్, హైదర్‌నగర్, హైదరాబాద్-85. ఫోన్: 9440558748
పొందూరు మరో పోర్‌బందర్
రచన: వాండ్రంగి కొండల్‌రావు
పేజీలు: 108; వెల: 20
ప్రతులకు: వాసవి ప్రింటర్స్, మార్కెట్, పొందూరు, శ్రీకాకుళం జిల్లా-532168. ఫోన్: 9573577898
కలరవాలు (కవిత్వం)
రచన: ఆత్మకూరు రామకృష్ణ
పేజీలు: 168; వెల: 100
ప్రతులకు: రచయిత, 8-8-01, ప్రణీత రెసిడెన్సీ, గుంటుపల్లి, విజయవాడ-521241.
ఫోన్: 9493405152
మనిషిలోకి ప్రవహించాలి (కవిత్వం)
రచన: ద్వానా శాస్త్రి
పేజీలు: 62; వెల: 50
ప్రతులకు: రచయిత, 1-1-428, ఆర్చీస్ నెస్ట్, గాంధీనగర్, హైదరాబాద్-80.
ఫోన్: 9849293376