Published
Fri, Sep 30 2016 11:40 PM
| Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
ప్రజాస్వామ్య ఉద్యమాలకు విశేష కృషి
నల్లగొండ టౌన్ : దళితులు, పౌర హక్కులు, ప్రజాస్వామ్య ఉద్యమాల కోసం బొజ్జా తారకం విశేషంగా కృషి చేశారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రఘునాథ్ అన్నారు. శుక్రవారం స్థానికంగా దళిత విద్యావంతుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన బొజ్జా తారకం సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. చుండూరు దళితుల కోసం న్యాయస్థానంలో రాజీలేని పోరాటం నిర్వహించారన్నారు. ఫోరం కన్వీనర్ దర్శనం నర్సింహ అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి జి.మోహన్, టీడీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బండి దుర్గాప్రసాద్, చింత సుధాకర్, రవినాయక్, కొండమడుగు నర్సింహ, అనుదీప్, రంజిత్, సత్యనారాయణ, కామేష్, రాజశేఖర్‌రెడ్డి, వెంకన్న, ప్రభాకర్, పాలడుగు నాగార్జున, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.