సభలో మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం
సాక్షి, సూర్యాపేట(నల్లగొండ): వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో తెలంగాణ గడ్డ మీద హిందూమతం పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పి కొడదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సీసీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను నిర్వహించారు.
ఈ సందర్భంగా తమ్మినేని హాజరై తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిని సన్మానించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, నాగార్జునరెడ్డి, ఎం.రాములు, కె.యాదగిరిరావు, ధీరావత్ రవినాయక్, బి.శ్రీరాములు, కోట గోపి, గోవిందు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment