
రోడ్డు కోసం.. రోడ్డెక్కారు !
♦ వైవీయూ మార్గంలో రోడ్డు పనులు త్వరగా చేయాలంటూ విద్యార్థుల బైఠాయింపు
♦ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
వైవీయూ :
యోగివేమన విశ్వవిద్యాలయం మార్గంలో రోడ్డును త్వరితగతిన పూర్తిచేయాలంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వైవీయూ వైఎస్‌ఆర్ స్టూడెంట్ యూనియన్ నాయకులు, పరిశోధక విద్యార్థులు బాలా జీ నాయక్, శ్రీనివాసులు మాట్లాడుతూ కడప–పులివెందుల మార్గంలో వైవీయూకు వెళ్లే రహదారిని తవ్విన ఆర్‌అండ్‌బీ అధి కారులు పనులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు.
రోడ్డు సరిగా లేక ఇటువైపు వాహనాలు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పదిరోజులుగా బ స్సులు, ఆటోలు విశ్వవిద్యాలయంవైపుగా రావడం లేదని.. దీంతో కిలోమీటర్‌పైగా రోజు నడిచిరావాల్సి వస్తోందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం పూర్తి చేసి వాహనాలను పునరుద్ధరించాల ని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వైవీయూ ప్రిన్సిపల్ ఆచార్య కె.సత్యనారాయణరెడ్డి, పెండ్లిమర్రి ఎస్‌ఐ ఎస్.కె. రోషన్ అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. దీంతో విద్యార్థులు ఆందోళన వీడారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.