సమైక్య ఉద్యమం నేటితో 80వ రోజుకు చేరుకుంది. జిల్లాలో సమైక్య ఉద్యమహోరు జోరుగా సాగుతోంది. ర్యాలీలు, మానవ హారాలతో నిరసన తెలియజేస్తున్నారు. రిలేదీక్షలతో సమైక్యకాంక్షను ఢిల్లీకి తెలియజేస్తున్నారు. సమైక్యాంధ్రను సాధించి తీరుతామని నినదిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
సాక్షి, కడప: జిల్లాలో కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం గురువారంతో 79రోజులు పూర్తి చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులు అలుపెరుగని పోరు సాగిస్తున్నారు. కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కార్పొరేషన్ ఉద్యోగులు చేపట్టిన రిలేదీక్షలు 66వ రోజుకు చేరాయి. వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షాశిబిరాన్ని పార్టీ జిల్లా కన్వీనర్ కే సురేష్‌బాబు సందర్శించి సంఘీభావం తెలిపారు. న్యాయవాదులు, వాణిజ్యపన్నులశాఖ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. జమ్మలమడుగులో రెవెన్యూ ఉద్యోగులు, గ్రామనౌకర్లు, వీఆర్‌వోలు రిలేదీక్షలు చేపట్టారు.
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మంత్రి పీ రామసుబ్బారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. పులివెందులలో ఏపీ ఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్, పూల అంగళ్ల మీదుగా ర్యాలీ చేపట్టారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ దీక్షాశిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. రాజంపేటలో బార్‌అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు శరత్‌కుమార్‌రాజు ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.
ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఎన్జీవోలు చేపట్టిన రిలేదీక్షలు గురువారంతో 60రోజులు పూర్తి చేసుకున్నాయి. రైల్వేకోడూరులో జేఏసీ నేతలు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీతో కలిసి ధర్నా నిర్వహించారు. బద్వేలులో వైద్య, ఆరోగ్య సిబ్బంది జేఏసీ నేతలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నర్సులు, ఏఎన్‌ఎంలు రిలేదీక్షలకు కూర్చున్నారు. మైదుకూరులో పలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి సమైక్యనినాదాలు చేశారు. రిలేదీక్షలకు కూర్చున్నారు. ప్రొద్దుటూరులో మునిసిపల్ ఉద్యోగుల దీక్షలు గురువారంతో 60వ రోజుకు చేరాయి. ప్రొద్దుటూరులో చేపట్టదలిచిన విద్యార్థి సింహగర్జన ఏర్పాట్లపై మునిసిపల్ కమిషనర్ వెంకటకృష్ణ సమావేశం నిర్వహించారు. రాయచోటిలో ఏపీ ఎన్జీవోలు, జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.
అదే పట్టు
Published Fri, Oct 18 2013 2:56 AM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM
Advertisement
Advertisement