జనగామ జిల్లా సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు జేఏసీ చైర్మ¯ŒS ఆరుట్ల దశమంతరెడ్డి తెలిపారు.
-
నేడు హైదరాబాద్‌కు వెళ్లనున్న బృందం
-
జాతీయ రహదారిపై బతుకమ్మ ఆటలు
-
l 5న డివిజ¯ŒS వ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలు
జనగామ : జనగామ జిల్లా సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు జేఏసీ చైర్మ¯ŒS ఆరుట్ల దశమంతరెడ్డి తెలిపారు. స్థానిక జూబ్లీ ఫంక్ష¯ŒS హాల్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు. ముసాయిదా ప్రకటన నేపథ్యంలో శనివారం జేఏసీలోని ఓ బృందం మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కలిసేందుకు హైదరబాద్‌కు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు జాతీయ రహదారి ఆర్టీసీ చౌరస్తాలో మహిళల బతుకమ్మ ఆ టలతో నిరసన తెలుపుతామన్నారు. 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహిం చి, మొమోరాండం ఇస్తామన్నారు. 5న డివిజన్ లోని మండలాలు, గ్రామాల్లో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలిపాలన్నారు. ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి రాజీనామా చేసి ఉద్యమంలో కలిసి రావాలని డిమాండ్ చేశారు.
ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి బాలలకీ‡్ష్మ మాట్లాడుతూ చేర్యాల ను రెవెన్యూ డివిజ¯ŒSగా చేసి, జనగామను జిల్లా చేయాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజరెడ్డి, డాక్టర్ లకావత్ లక్షి్మనారాయణ నాయక్, లింగయ్య, సతీష్, శ్రీరాములు, శశిధర్, కైలాసం, రాజు, సురేష్, వి జయ్, ప్రకాష్, సోమేశ్వరాచారి, రమేష్, ఎల్లయ్య, శ్రీను, కిరణ్, శేఖర్ పాల్గొన్నారు.