సాక్షి, నెల్లూరు : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం 17వ రోజు మరింత ఉధృతంగా సాగింది. శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా ఉద్యమకారులు మొక్కవోని దీక్షతో ఆందోళనలు కొనసాగించారు. నగరంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అధ్యాపకుల బృందం వీఆర్ హైస్కూల్ గ్రౌండ్‌లో, సమైక్య ఉపాధ్యాయ పోరాట సమితి వీఆర్‌సీ కూడలిలో రిలే దీక్షలు చేపట్టారు. ఆర్టీసీ ఉద్యోగులు వరుసగా మూడో రోజూ బస్టాండ్ ఎదుట వంటావార్పు నిర్వహించారు.
విద్యుత్‌శాఖ మహిళా ఉద్యోగులు కార్యాలయం ఎదుట సోనియా మనసు మారాలని వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. నగరంలో వాణిజ్య శాఖ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. గూడూరులో హిజ్రాలు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. సూళ్లూరుపేటలో వైఎస్సార్ సీపీ నేతలు బస్టాండ్ సెంటర్ నుంచి పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో వెంకటగిరిలోని అడ్డరోడ్డు సెంటర్లో వంటావార్పు నిర్వహించారు.
జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాల ల బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సు లు కూడా పూర్తిస్థాయిలో తిరగడం లేదు. సమైక్య ఉద్యమంతో జిల్లాలో జన జీవనం స్తంభించింది. నగరంలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యం లో ఆత్మకూరు బస్టాండు కూడలిలో మానవహారం నిర్వహించారు.
ఎన్‌జీఓ హోమ్‌లో అటవీశాఖ ఉద్యోగుల రిలే దీక్షలు చేపట్టారు. సమైక్యాం ధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్‌సీ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ బస్‌స్టేషన్ ప్రాంగణంలో కార్మికు లు వంటావార్పు నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ అసోసియేషన్ సమైక్య నినాదంతో ఆందోళన నిర్వహించారు.
వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు ఆ కార్యాలయం నుంచి వీఆర్‌సీ, చిన్నబజారు, పెద్దబజారు, సంతపేట ల మీదుగా తిరిగి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిం చారు. గూడూరు డివిజన్ హిజ్రాల సం ఘం ఆధ్వర్యంలో పట్టణంలో సోని యా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. రోడ్డుపై కబడ్డీ ఆడారు. అనంతరం శాపనార్థాలు పెడు తూ సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆర్టీసీలోని ఎన్‌ఎం యూ, ఈయూ సంఘాల ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బత్తిని విజయ్‌కుమార్, కార్మికులతో కలిసి బస్సుల టాపుపై కూర్చొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం హైవేని దిగ్బంధించారు. దీంతో సుమారు గంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కోట పట్టణంలో ఐసీడీఎస్ ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం ర్యాలీ నిర్వహించారు. కోవూరు ఎన్‌జీఓ హోంలో నాయీబ్రాహ్మణ సంఘం నాయకుల రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాళెం వవ్వేరు బ్యాంకు ఎదుట సమైక్యాంధ్ర మండల జేఏసీ నాయకుల రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. సూళ్లూరుపేట పట్టణంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు దబ్బల రాజారెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సూళ్లూరుపేట జేఏసీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలుపుతూ దీక్షలో కూర్చున్నారు.
నాయుడుపేటలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. గాంధీ మం దిరం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. పెళ్లకూరు మండలంలోని అక్కగారిపేట వద్ద హైవేపై రాస్తారోకో నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్‌లో ఆపస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. ఆత్మకూరు, ఏఎస్‌పేట, అనంతసాగరం మండలాల రెవెన్యూ ఉద్యోగులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఉపాధ్యాయ సం ఘం నేతలకు మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు నడవలేదు. పట్టణంలోని బాలికల గురుకుల కళాశాల నుంచి పట్టణ పురవీధుల్లో జేఏసీ ఆధ్వర్యంలో గురుకుల కళాశాల విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. వింజమూరులోని పోలీస్‌స్టేషన్ సమీపంలో ఎన్‌జీఓల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు పదో రోజుకు చేరుకున్నాయి.
పొదలకూరులో సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వికలాంగ సేవాసంఘం ఆధ్వర్యంలో స్థానిక పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద వికలాంగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వారి దీక్షకు కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు మద్దతు తెలిపారు. కావలి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తెలుగుతల్లి, అల్లూరి సీతారామరాజు, పొట్టిశ్రీరాములు, వీరపాండ్యఖడ్గబ్రహ్మన వేషాలతో ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు శుక్రవారం కూడా మూతపడ్డాయి.
సమైక్యం ఉధృతం
Published Sat, Aug 17 2013 5:01 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
Advertisement