సీమాంధ్రలో ఏపీఎన్జీఓల సమ్మె ప్రారంభం!
Published Tue, Aug 13 2013 12:08 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతాల్లో ఏపీఎన్జీఓల సమ్మె తీవ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు సోమవారం అర్థరాత్రి నుంచి సమ్మె ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఏపీఎన్జీవోలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మెలో 4 లక్షలమంది ఉద్యోగులు పాల్గొననున్నారు. ఏపీ ఎన్జీవోలతోపాటు పలు కార్మిక సంఘాలు కూడా సమ్మెలో పాల్గొననున్నాయి.
సమ్మె వాయిదా వేయడం తమ చేతుల్లో లేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు ఆశోక్ పేర్కొన్నారు. ఆంటోనీ కమిటీ పరిధి స్పష్టంగా లేదంటూ ఏపీఎన్జీవోలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు దిగితే సమ్మె ఉధృతమవుతుంటూ హెచ్చరిస్తున్నారు. ఈ సమ్మెలో భాగంగా హైదరాబాద్ లో హెచ్‌వోడీ కార్యాలయాలు బంద్ కు పిలుపునిచ్చాయి. రేపు అత్సవసర సేవలు మినహా వైద్యసేవలు బంద్ కానున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం పలు జిల్లాల విద్యార్థి జేఏసీ బంద్ కు పిలుపునిచ్చాయి. వెల్పేర్‌లో కమిషనరేట్‌లో సేవలు బంద్ కానున్నాయి. సీమాంధ్రలో పెట్రోల్ బంక్ లు బంద్ కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా బంద్ కు పిలుపునిచ్చాయి.
Advertisement