seemandhra bandh
-
స్తంభించిన సీమాంధ్ర
వైఎస్సార్సీపీ బంద్ పిలుపు విజయవంతం పార్టీ శ్రేణులతో జత కలిసిన సమైక్యవాదులు, ఎన్జీవోలు, విద్యార్థులు అన్ని జిల్లాల్లో రాస్తారోకోలు, దిష్టిబొమ్మ దహనాలు సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్లో అప్రజాస్వామిక పద్ధతిలో ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో ఆ పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు బంద్‌ను విజయవంతం చేశారు. విద్యా, వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. బస్సులు నిలిచి పోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాం కులు మూతపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నాలు చేశారు. పార్టీకి రాజీనామా చేసిన ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కంబాలచెరువు వద్ద కాంగ్రెస్ జెండాలను తగులబెట్టారు. సోనియా ఫ్లెక్సీని కుళ్లిన కోడిగుడ్లు, టమాటాలతో కొట్టారు. పిఠాపురం, రావులపాలెం, మామిడికుదురు ప్రాంతాల్లో జాతీయ రహదారులను దిగ్బంధించగా, సామర్లకోటలో మున్సిపల్ కార్యాలయంపై వైఎస్సార్సీపీ నేతలు నల్లజెండా ఎగురవేశారు. - పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం లో బీజేపీ నేతల ప్లెక్సీలు, బుట్టాయగూడెంలో సోనియా దిష్టిబొమ్మను వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో తగలబెట్టారు. ఏలూరులో ఆళ్ల నాని ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. ఆచంట సెంటర్లో నరేంద్రమోడీ, బీజేపీ నాయకుడు కనుమూరి రఘురామకృష్ణంరాజుల ఫ్లెక్సీలు, పెనుమంట్రలో కేంద్రమంత్రుల ఫ్లెక్సీలు దహనం చేశారు. ఉండి ప్రధాన కూడలిలో రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. - వైఎస్సార్ సీపీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ నేతృత్వంలో మద్దిలపాలెంలో వాహనా లను అడ్డుకున్నారు. రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి నేతృత్వంలో విద్యార్థినులు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట షిండే, రాహుల్, సుష్మాస్వరాజ్, సోనియా వ్యంగ్య చిత్రాల్ని ప్రదర్శించారు. కేజీహెచ్ వైద్యులు ఆస్పత్రి ఆవరణలో నిరసన ప్రదర్శన చేశారు. ఏయూ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏయూ పరిధిలో బుధవారం జరగాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి. మాడుగులలో టీడీపీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. - శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కేంద్రమంత్రి కృపారాణి ఇంటిపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ చెప్పు విసిరి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీనివాస్‌తో సహా 16 మందిని అరెస్ట్ చేశారు. శ్రీకాకుళంలో బస్సులను నిలిపివేశారు. వైఎస్సార్ కూడలి, సూర్యమహల్ కూడళ్ల వద్ద యూపీఏ ప్రభుత్వం, సోనియా, చంద్రబాబుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆమదాలవలసలో పాలకొండ రోడ్డును దిగ్బంధించారు. విజయనగరంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గురాన అయ్యలు ఆధ్వర్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ఎదుట బైఠాయించారు. పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో సుమారు 400 మంది ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం గంటస్తంభం వద్ద మానవహారం నిర్వహించారు. - కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కర్నూలు నగరంతో పాటు ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన్, ఆళ్లగడ్డ, పాణ్యం, నందికొట్కూరు, మంత్రాలయం, బనగానపల్లె, ఆత్మకూరు ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, సమైక్యవాదులు రోడ్లపై ప్రదర్శనలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ శ్రేణులు డోన్‌లో జాతీయ రహదారిని దిగ్భంధించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. - కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేశ్‌బాబు, నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్‌బాషా ఆధ్వర్యంలో బంద్ విజయవంతంగా సాగింది. వికలాంగులు నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో వైఎస్సార్సీపీ నేతలు వందలాది బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పాతబస్టాండ్ వద్ద సోనియాగాంధీ దిష్టిబొమ్మకు ఉరి వేశారు. రైల్వేకోడూరులో గాంధీ విగ్రహం కళ్లకు గంతలు కట్టి నిరసన తెలిపారు. - అనంతపురంలో వైఎస్సార్సీపీ నేత ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో దుకాణాలను మూయించారు. కలెక్టర్ కార్యాలయంలో ట్రెజరీ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ ముఖద్వారం వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. హిందూపురంలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భార్య కాపు భారతి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. - చిత్తూరులో బంద్ నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడిచేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద బుధవారం ఉదయం ఆందోళన చేపట్టారు. అక్కడే ఉన్న పోలీసులు ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. -
సీమాంధ్రలో ఆగ్రహ జ్వాలలు...నిరసనలు
హైదరాబాద్ :నిరంకుశంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభ ఆమోదించటంతో సీమాంధ్ర భగ్గుమంటోంది. సమైక్యవాదులంతా రోడ్లపైకి వచ్చి నిరసన తెలపటంతో బుధవారం సీమాంధ్రలో బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. అనంతపురం : జిల్లాలో తెల్లవారుజాము నుంచే బంద్ కొనసాగుతోంది. దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమిత మయ్యాయి. కర్నూలులోనూ బంద్ కొనసాగుతోంది. సమైక్యవాదులు రోడ్లపైకి వచ్చి కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నారు. 850 బస్సులు డిపోలలోనే నిలిచిపోయాయి. రాయదుర్గంలో వైఎస్ఆర్ సీపీ నేత కాపు భారతి ఆధ్వర్యంలో బంద్, ఆర్టీసీ డిపోల ముందు ధర్నా చేపట్టారు. వైఎస్ఆర్ జిల్లా : రాష్ట్ర అడ్డగోలు విభజినను నిరసిస్తూ వైఎస్సార్‌జిల్లాలో సమైక్యవాదులు రోడ్డెక్కారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్‌పిలుపు మేరకు ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తెల్లవారుజామునుంచే ఆందోళనలు చేపట్టారు. కడపలో రోడ్లపై టైర్లకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. కిరణ్, చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందంటున్న సమైక్యవాదుల ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు సమైక్యవాదులంతా ఒక్కటై బంద్ నిర్వహిస్తున్నారు. బద్వేల్, పోరుమామిళ్లలో మాజీ ఎమ్మెల్యే బీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. చిత్తూరు: చిత్తూరు జిల్లాలో బంద్ జరుగుతోంది. జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమతం అయ్యాయి. విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్చందంగా మూసివేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. మదనపల్లిలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో చెన్నై-ముంబయి జాతీయ రహదారి దిగ్బంధం చేయటంతో రాకపోకలు నిలిచిపోయాయి. విజయనగరం : తెలంగాణ బిల్లును పార్లమెంట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లా సాలూరులో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారంటూ సోనియా దిష్టిబొమ్మ దహనం చేశారు. సోనియా, కాంగ్రెస్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. చీపురుపల్లిలో బంద్ జరుగుతోంది. శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో సమైక్యఆందోళనలు మిన్నంటాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యవాదులు రోడ్డెక్కారు. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు ఇలా ప్రతిఒక్కరూ రాష్ట్రవిభజనను వ్యతిరేకిస్తూ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కుమ్మక్కై రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాయని మండిపడ్డారు. మూడు పార్టీలకు త్వరలోనే తగిన గుణపాఠం చెప్తామని సమైక్యవాదులు హెచ్చరించారు. విశాఖ: విశాఖలోనూ ఉదయం నుంచే బంద్ కొనసాగుతోంది. విద్యా, వ్యాపార సంస్థల మూతపడ్డాయి. దాంతో నేడు ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రవిభజనకు నిరసనగా అనకాపల్లిలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ నేత కొణతాల లక్ష్మీనారాయణ, టౌన్ కన్వీనర్ జానీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతుండటంతో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. పశ్చిమ గోదావరి : పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా బంద్ జరుగుతోంది. ఉదయం నుంచే సమైక్యవాదులు, వైఎస్ఆర్ సీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో ఎదుట వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, సమైక్యవాదులు ఆందోళనకు దిగటంతో బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. జిల్లాలోని 500లకు పైగా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. వైఎస్ఆర్సీపీ నేత ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. తూర్పుగోదావరి : రాష్ట్ర విభజనపై రాజమండ్రి మహిళలు కన్నీరు పెడుతున్నారు. మా తెలుగుతల్లి కన్ను మూసింది. మా మనసు క్షోభించిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోనియా గాంధీ తన కుమారుడిని పీఎం చేసేందుకు రాష్ట్రాన్ని విభజించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి చంద్రబాబు నాయుడు అన్ని విధాల సహకరించారంటూ విమర్శిస్తున్నారు. సమైక్యద్రోహులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజనపై కాకినాడ వాసులు మండిపడుతున్నారు. సీమాంధ్ర ప్రజల భవిష్యత్ అంథకారం చేసేందుకు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రాహుల్, మోడిలు కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ది చెబుతామంటూ హెచ్చరిస్తున్నారు. ప్రకాశం : అడ్డగోలుగా రాష్టాన్ని విభజించారంటూ ఒంగోలులో వైఎస్ఆర్సిపి నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్ సిపి అధినేత .జగన్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో బంద్ కొనసాగుతోంది. తెల్లావారుజామునే ఆర్టీసీ డిపోకు చేరుకున్న వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. డిపో ఎదుట బైటాయించి సోనియాగాంధీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్సిపి నేతలు కుప్పం ప్రసాద్, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కటారి శంకర్, సింగరాజు వెంకట్రావులను పోలీసులు అరెస్టు చేశారు. పొదిలి ఆర్టీసీ డిపోలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు బస్సులను నిలిపివేశారు. గుంటూరు:గుంటూరు జిల్లాలోనే బంద్ జరుగుతుంది. చిలకలూరిపేట ఆర్టీసీ డిపో ఎదుట వైఎస్ఆర్ సీపీ నేత మర్రి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 107 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. -
ఆగని విభజన మంటలు
-
కొనసాగుతున్న బంద్...నిలిచిన్ బస్సులు
-
అనంతపురంలో కొనసాగుతున్న బంద్
-
విభజన ఆపాలంటూ విద్యార్ధుల ఆందోళన
-
నేడు కూడా తూ.గో.జిల్లాలో సమైక్య బంద్
-
తిరుపతిలో మహిళల ఆత్మహత్యాయత్నం
-
కర్నూలులో రోడ్డెక్కిన సమైక్యవాదులు
-
చిత్తూరు జిల్లావ్యాప్తంగా బంద్
-
నేడు సీమాంధ్ర బంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ వైఖరికి నిరసనగా ఈ నెల 14వతేదీన సీమాంధ్రలో బంద్ పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపునిచ్చింది. గురువారం లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీలపై తెలంగాణవాదులు దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండించింది. సీమాంధ్ర ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విభజన అంశంపై బహిరంగ ప్రకటన చేయకుండా ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్న సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీలను సస్పెండ్ చేసి కేవలం రాజకీయ లబ్ధి కోసమే బిల్లును ఆమోదింపజేసేందుకు చేస్తున్న కుటిల యత్నాలను సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ఐక్యంగా ఎదుర్కోవాలని కోరారు. బిల్లును ఓడించేందుకు ఇతర పార్టీల మద్దతు తీసుకోవాలని సూచించారు. 15 రోజుల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతున్న తరుణంలో రాజ్యాంగ నిబంధనల కు విరుద్ధంగా సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టామని చెప్పడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలను కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్, రైల్వే బడ్జెట్ల ఆమోదం కోసమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే సీమాంధ్రులంతా కలిసి కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడం ఖాయమని హెచ్చరించారు. -
బంద్ సంపూర్ణం
సాక్షి నెట్వర్క్: తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ గురువారం సీమాంధ్ర బంద్ విజయవంతమైంది. ఏపీఎన్జీవోలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, విద్యాసంస్థల్ని మూయించారు. ఈ బంద్‌కు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. వైఎస్సార్సీపీ నేతలు పలుచోట్ల రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజమండ్రిలో విశాలాంధ్ర మహాసభ, ఏపీఎన్జీవోలు, న్యాయవాదులు విద్యార్థి సంఘాలు ఓఎన్జీసీ బేస్ కార్యాలయాన్ని మూసి వేయించారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో వైఎస్సార్ సీపీ నేతలు, ఎన్జీవోలు బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. విశాఖలో ఏయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. విజయనగరంలో టీడీపీ నేతలు రైల్‌రోకో చేపట్టారు. విజయవాడలో ఎన్జీవో నేతలు బస్సుల ను అడ్డుకున్నారు. న్యాయవాదులు కోర్టుల మెయిన్‌గేట్‌కు తాళాలువేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా దర్గామిట్టలోని ఎన్జీవో భవన్ నుంచి ఎన్జీవోలు భారీ నిరసన ప్రదర్శన తీశారు. ఒంగోలులో తెల్లవారుజామున ఆర్టీసీ డిపోవద్ద ఎన్జీవోలు, వైఎస్సార్సీపీ నేతలు బైఠాయించి, బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ బంద్ విజయవంతం చేశాయి. వేకువ జాము నుంచే బస్సులను అడ్డుకున్నాయి. అనంతపురం జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాల యాలు మూతపడ్డాయి. ఆందోళనకారులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫ్లెక్సీలతో పాటు తెలంగాణ బిల్లు ప్రతులను దహనం చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి కార్యదర్శి బద్రీనాథ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కడపలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విభజన బిల్లును దహనం చేశారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. రైల్వేకోడూరులో వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ విగ్రహం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పులివెందులలో బైక్‌ర్యాలీ నిర్వహించి, దుకాణాలను మూయించారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కర్నూలు-రాయిచూరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఆదోనిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టగా.. టీడీపీ, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆళ్లగడ్డలో బస్సుల రాకపోకలు అడ్డుకున్నారు. బంద్ సందర్భంగా చిత్తూరు, మదనపల్లె, తిరుపతి, పుంగనూరు, నగరి పట్టణాల్లో జనజీవనం స్తంభించింది. వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో జరిగిన బంద్‌లో పాల్గొన్నారు. నగరిలో వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ఆర్.కే.రోజా, పలమనేరులో మాజీ ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. తిరుమల బస్సులకు మినహాయింపు ఇచ్చారు. -
YSR జిల్లాలో కొనసాగుతున్న బంద్
-
'సీమాంధ్ర ఎంపీలు సభను స్తంభింపచేయాలి'
హైదరాబాద్ : తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీవోలు గురువారం సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ సీమాంధ్ర ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. పార్టమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే సీమాంధ్ర ఎంపీలు పార్టీలకతీతంగా సభను స్తంభింప చేయాలన్నారు. సీమాంధ్ర బంద్‌ను విజయవంతం చేయాలని అశోక్ బాబు కోరారు. -
'తెలంగాణ బిల్లును భోగి మంటల్లో తగలబెడతాం'
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఈనెల 17, 18 తేదీల్లో సీమాంధ్ర బంద్‌కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈనెల 20న అసెంబ్లీని ముట్టడిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు తెలిపారు. ఈ నెల 14 అన్ని సీమాంధ్ర జిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తెలంగాణ బిల్లును భోగి మంటల్లో తగలబెట్టే కార్యక్రమం చేపడతామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల సహాయ సహకారాలతో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. సమైక్యం కోసం సీమాంధ్ర నాయకులు కృషి చేస్తారని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోమని నేతలు ప్రజల సమక్షంలో హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వాయిదా పడకుండా చూడాల్సిన బాధ్యత సభ్యులదేనని అశోక్‌బాబు అన్నారు. సభలో బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. -
విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాటం
-
నిరసన జ్వాల
సాక్షి, కడప: కడపలో జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, నగర సమన్వయకర్త అంజాద్‌బాషా ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. అప్సర సర్కిల్లో సురేష్‌బాబు బంద్‌ను పర్యవేక్షించారు. రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు. అంజాద్‌బాషా ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్‌ర్యాలీ చేపట్టారు. కోటిరెడ్డి సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, ఏడురోడ్ల కూడళ్లతో పాటు ప్రధాన వీధులలో వాహనాల్లో తిరుగుతూ దుకాణాలు మూయించి బంద్ చేపట్టారు. వై-జంక్షన్లో రోడ్డుపై కనిపించిన ఓ ఆర్టీసీ బస్సు అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అంజాద్‌తో పాటు వైఎస్సార్‌పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు. చింతకొమ్మదిన్నె వైఎస్సార్ సర్కిల్లో మాజీ మేయర్వ్రీంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. జమ్మలమడుగులో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఆధ్వర్యంలోబంద్ కొనసాగింది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు మూసేశారు. ఆర్టీసీ బస్సులు కూడా తిరగలేదు. ప్రొద్దుటూరులో నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగింది. పుట్టపర్తి సర్కిల్ , టీబీరోడ్డు, గాంధీరోడ్డులోని దుకాణాలను మూయించారు. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మునిసిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, ఎన్జీవోల సంఘం పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యాయ జేఏసీ నేత రషీద్‌ఖాన్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి సర్కిల్లో మానవహారం చేపట్టారు. రాష్ట్రం విడిపోతే అన్ని రంగాల్లోనూ రాయలసీమ తీవ్రంగా నష్టపోతుందని, సీమ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని పట్టణవాసులు ముక్త కంఠంతో నినదించారు. పులివెందులలో వ్యాపారులు రెండోరోజూ స్వచ్ఛందంగా దుకాణాలు మూసి బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీనేతలు బంద్‌ను పర్యవేక్షించారు. ఆర్టీసీ బస్సులు డిపో నుంచి బయటకు కదల్లేదు. రాజంపేట బైపాస్‌రోడ్డులో వైఎస్సార్సీపీ నేత పోలా శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్లలో వైఎస్సార్సీపీ నేతలు బైక్‌ర్యాలీ నిర్వహించారు. రైల్వేకోడూరులో పంజం సుకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. రాయచోటిలో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూత పడ్డాయి. -
నిరసన జ్వాల
సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజనపై ‘అనంత’లో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. జిల్లా వ్యాప్తంగా సమైక్యాంద్ర ఉద్యమం ఊపందుకుంది. విభజనకు నిరసనగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన బంద్ విజయవంతమైంది. శనివారం విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 970 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అనంతపురంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ఇంటిని ముట్టడించే యత్నం చేయగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ నేత ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు బంద్ పర్యవేక్షించారు. సప్తగిరి సర్కిల్లో టైర్లకు నిప్పు పెట్టి సమైక్య నినాదాలు చేశారు. ఎస్కేయూ నుంచి భారీగా నగరంలోకి వచ్చిన విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం విద్యార్థులను అదుపులోకి తీసుకుని త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కళ్యాణదుర్గం రోడ్డులో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఇతర నేతలు రాస్తారోకో నిర్వహించారు. సమాజ్‌వాదీ పార్టీ, ఉపాధ్యాయ జాక్టో నాయకులు ర్యాలీ నిర్వహించారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో మాతృ మరణాలపై సమీక్షను వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కన్వీనర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు అడ్డుకున్నారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. ఆర్ట్స్ కళాశాల విద్యార్థులను కట్టడి చేసేందుకు హాస్టల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ నేతలు.. సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మలను దహనం చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి కాంగ్రెస్ పార్టీ జెండాలు, కండువాలను దహనం చేశారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఇనాయతుల్లా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేశారు. లేపాక్షి, చిలమత్తూరు, బత్తలపల్లి, ముదిగుబ్బలో ర్యాలీ లు, మానవహారాలు చేపట్టారు. కదిరిలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఇస్మాయిల్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి జీవోఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. టీడీపీ నేత అత్తార్ చాంద్‌బాషా, దేవానంద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలిలో వంటావార్పు చేపట్టారు. కళ్యాణదుర్గంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బోయ తిప్పేస్వామి ఆధ్వర్యంలో బంద్ పాటించారు. టీడీపీ నేత హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కుందుర్పి, గాండ్లపెంట, విడపనకల్లు, అమరాపురం, కూడేరు, గార్లదిన్నె, కణేకల్లు, బుక్కపట్నం, గుడిబండ, కంబదూరు, బుక్కరాయసముద్రం, పుట్టపర్తి, ఓడీసీ, అమడగూరు మండలాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థులు బైక్‌ర్యాలీలు, ర్యాలీలు నిర్వహించారు. మడకశిరలో వైఎస్సార్సీపీ నాయకులు వైసీ గోవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ చేపట్టారు. సోనియాగాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నల్లమాడలో వైఎస్ఆర్సీపీ నేత సోమశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పరిగిలో టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపురామ చంద్రారెడ్డి సతీమణి కాపు భారతి ఆధ్వర్యంలో బంద్ పాటించారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేత దీపక్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నాయకులు, టీడీపీ నేతలు.. ఉరవకొండలో జాక్టో ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. -
చంద్రబాబు,సీమాంధ్ర కాంగ్రెస్ నేతల పై నిప్పులు
-
శ్రీకాకుళంలో కొనసాగుతున్న బంద్
-
జిల్లావ్యాప్తంగా సంపూర్ణ బంద్
-
పరీక్షలు వాయిదా వేసిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ
ఆంధ్రప్రదేశ్ విభజనకు కేంద్ర మంత్రి మండలి పచ్చ జెండా ఊపడంతో సీమాంధ్రలో బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు రాష్ట్రంలోని పలు యూనివర్శిటీలు శనివారం వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించాయి. తమ యూనివర్శిటీ పరిధిలో జరాగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేసినట్లు విశాఖపట్నంలోని ఆంధ్రయూనివర్శిటీ ప్రకటించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నేడు, రేపు జరగవలసిన అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ శనివారం హైదరాబాద్‌లో విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. వీటితోపాటు అనంతపురంలోని జేఎన్టీయూ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీలు కూడా పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. -
'దమ్ముంటే కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయాలి'
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి తాము వ్యతిరేకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. కేబినెట్ నిర్ణయం రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగిస్తోందని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపుకు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. విజభనను అడ్డుకోవాల్సిన టీడీపీ నేతలు తమను విమర్శించటం ఎంత వరకూ సబబు అని జూపూడి ప్రశ్నించారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇంకా పార్టీలో ఎందుకున్నారో చెప్పాలని ఆయన నిలదీశారు. చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలని సూచించారు. -
నేడు సీమాంధ్ర బంద్: పి.అశోక్‌బాబు
సాక్షి, విజయవాడ: ఆరుకోట్ల మంది తెలుగు ప్రజల మనోభావాలను పక్కనపెట్టి కేంద్ర కేబినేట్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం సీమాంద్ర బంద్‌కు పిలుపు ఇస్తున్నట్లు ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు చెప్పారు. విజయవాడలో గురువారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ బంద్‌కు ప్రజలంతా మద్దతు పలకాలని కోరారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల చేతకానితనం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్రం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. కేబినేట్ ఆమోదం పొందినంత మాత్రాన తెలంగాణ వచ్చినట్లు కాదన్నారు. మొదటి అడుగు మాత్రమే పడిందని, ఇంకా చాలా దశలున్నాయని చెప్పారు. కేబినేట్ ఆమోదం పొందిన తర్వాత ఆగిపోయిన బిల్లులు ఎన్నో ఉన్నాయని, ఈ బిల్లు కూడా అలానే అవుతుందన్న ఆశాభావం ఉందని తెలిపారు. -
రెండో రోజు కొనసాగిన సీమాంధ్ర బంద్
-
స్తంభించిన సీమాంధ్ర
సాక్షి నెట్వర్క్ : రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రమంత్రి మండలి తీసుకున్న నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 72గంటల బంద్ పిలుపు మేరకు శుక్రవారం సీమాంధ్ర స్తంభించింది. అన్ని జిల్లాల్లోనూ బంద్ సంపూర్ణంగా సాగింది. ఏపీఎన్జీవోల సంఘం కూడా 48గంటల బంద్‌కు పిలుపిచ్చిన నేపథ్యంలో సామాన్య జనజీవనానికి తీవ్ర ఆటంకం కలిగింది. అత్యవసర సర్వీసులు మినహా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్యసంస్థలు, సినిమాహాళ్లు, పెట్రోలుబంకులు మూతపడ్డాయి. వైఎస్సార్ సీపీ శ్రేణులు జాతీయ రహదారుల దిగ్బంధం చేపట్టడంతో హైవేలపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విశాఖ పోర్టుకూ బంద్ సెగ : విశాఖలో పోర్టు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మినరల్స్ అండ్ మెటల్ ట్రేడింగ్ కార్పొరేషన్, కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ కార్యాలయాల ఎదుట వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సమైక్యవాదులు బైఠాయించారు. ఆంధ్ర మోటార్ ట్యాంక్ లారీ వర్కర్స్ యూనియన్ బంద్ చేపట్టడంతో సుమారు 1100 ఆయిల్లారీలు నిలిచిపోయాయి. దీంతో ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీ ప్లాంట్లలో ఉత్పత్తులు స్తంభించాయి. ప్రకాశం జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు జాతీయ రహదారిపై టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. ప్రభుత్వ వాహనానికి నిప్పు : కర్నూలు జిల్లా ఆలూరులో ప్రభుత్వ వాహనాన్ని సమైక్యవాదులు తగులబెట్టారు. మద్దికెరలో ఓ షాపు తెరిచి ఉండటంతో అందులో ఆరు టీవీలను పగులగొట్టారు. కర్నూలు, పాణ్యం నియోజకవర్గాల పరిధిలోని రహదారులను వైఎస్సార్ సీపీ శ్రేణులు దిగ్బంధించాయి. నంద్యాలలో పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వెల్దుర్తిలో జాతీయ రహదారిని, మంత్రాలయంలో బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో కర్ణాటకకు వెళ్లే రహదారిని దిగ్బంధించారు. వైఎస్సార్ జిల్లా కడపలో విద్యార్థుల అరెస్టులకు నిరసనగా ఆకాశవాణి కేంద్రాన్ని ముట్టడించారు. పులివెందులలో జేఎన్టీయూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లావ్యాప్తంగా హైవేలపై రాస్తారోకోలు నిర్వహించారు. ఐకేపీ కార్యాలయంలో కంప్యూటర్లు ధ్వంసం : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఐకేపీ కార్యాలయంలో కంపూటర్లు ధ్వంసం చేశారు. పుట్టపర్తిలో వైఎస్సార్సీపీ నేత హరికృష్ణ ఆధ్వర్యంలో మన్మోహన్, సోనియా, బాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్లమీదకు చేరి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో తెలుగుతల్లి విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. చిత్తూరు, అనంతపురం, తిరుపతి, బెంగళూరు జాతీయ రహదారులను పార్టీ కార్యకర్తలు దిగ్బంధించారు. చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆందోళకారులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఉద్యోగ జేఏసీ నేతలు శ్రీవారిమెట్టు మార్గంలో రోడ్డుపై బండ్లు అడ్డంగా పెట్టి భక్తులను అడ్డుకున్నారు. విభజన వార్తలను చూడలేమంటూ గోకుల్ సర్కిల్లో టీవీలను పగులగొట్టి నిరసన తెలియజేశారు. బీఎస్ఎన్ఎల్ ఆఫీసుపై దాడి : తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో జేఏసీ నేతలు బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. జగ్గంపేటలో పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో పార్టీశ్రేణులు జాతీయ రహదారి-16ని దిగ్బంధించి రాకపోకలను స్తంభింపచేశారు. రాజానగరంలో పాత జాతీయ రహదారిపై సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ముమ్మిడివరం, పిఠాపురంలలో 216 నంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏటీఎంలు సైతం మూతపడ్డారుు. 214 జాతీయ రహదారిని అనుసంధానిస్తూ ఉభయ గోదావరి జిల్లాల మధ్య గల చించినాడ బ్రిడ్జిని ఎన్జీవోలు దిగ్బంధించారు. ఇచ్ఛాపురం చెక్‌పోస్టు మూసివేత : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌లో వాహన తనిఖీలు, కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. టెక్కలి వైఎస్ఆర్సీపీ నేతలు జగతిమెట్ట వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఎచ్చెర్లలో అంబేద్కర్ వర్సిటీ విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వైద్యసేవలకూ ఆటంకం : ప్రభుత్వ నర్సులు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు అత్యవసర విధులు మినహా మిగిలిన అన్ని సేవలను బహిష్కరిస్తున్నట్లు ప్రభుత్వ నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి.భాగ్యలక్ష్మి విశాఖలో తెలిపారు. దీంతో రోగుల సేవలకు తీవ్ర ఆటంకం కలిగింది. ఎక్కడికక్కడ రైల్‌రోకోలు కడపలో రిజర్వేషన్ కౌంటర్ ధ్వంసం సాక్షి నెట్వర్క్: శుక్రవారం వైఎస్సార్ సీపీ నేతలు, సమైక్యవాదులు పలుచోట్ల రైల్‌రోకోలు చేపట్టారు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు దాదాపు మూడు గంటలకుపైగా రైలురోకో నిర్వహించారు. అరకోణం ప్యాసింజర్ రైలును 50 నిమిషాలు, మరో గూడ్స్ రైలును 1.15 గంటలు, ముంబై నుంచి చెన్నైకు వెళ్లే దాదర్ ఎక్స్‌ప్రెస్‌ను అరగంటకుపైగా నిలిపేశారు. ఆ తర్వాత ముంబై నుంచి కన్యాకుమారికి వెళ్లే జయంతి ఎక్స్‌ప్రెస్‌ను మరో అరగంటపాటు ఆపారు. మధ్యాహ్నం రైలుపట్టాలపైనే భోజనం చేశారు. కడపలో సమైక్యవాదులు రైల్వే రిజర్వేషన్ కౌంటర్, కంప్యూటర్, ఫర్నిచర్లను ధ్వంసంచేశారు. దీంతో రిజర్వేషన్ సేవలు నిలిచిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్లో సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. ఏలూరులో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే జన్మభూమి, విశాఖవైపు వెళ్లే యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లను కొద్దిసేపు అడ్డుకున్నారు. అనంతపురం జిల్లాలో అనంతపురం, ధర్మవరం, కదిరి, తాడిపత్రిల్లో ఆందోళనకారులు రైల్‌రోకో నిర్వహించారు. గుంటూరు-యశ్వంత్‌పూర్, హిందూపురం-గుంతకల్లు ప్యాసింజర్ రైళ్లను నిలిపివేశారు. రామచంద్రనగర్ రైల్వేగేటు వద్ద, అనంతపురంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద రైల్వే లైన్‌పై టైర్లు అడ్డంగా వేసి నిప్పుపెట్టారు. గుంతకల్లులో ఆందోళనకారులు రైల్వే డీఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం రైల్వే స్టేషన్‌ను ముట్టడించారు. సిగ్నల్ రూమ్‌లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైల్వే సిబ్బందితో సమైక్యాంధ్ర నినాదాలు చేయించారు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, సమైక్యవాదులు ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకున్నారు. -
రగులుతున్న సీమాంధ్ర జిల్లాలు
హైదరాబాద్ : కేంద్ర కేబినెట్ నోట్‌కు వ్యతిరేకంగా సీమాంధ్రలో బంద్ కొనసాగుతోంది. రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర మంత్రిమండలి తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన 72 గంటల బంద్ సీమాంధ్రలో జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గ నిర్ణయం వెలువడిన కొద్దిసేపటికే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా 72 గంటల బంద్ పాటించాలని నిర్ణయించినట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. సీమాంధ్రలోని 1౩ జిల్లాల్లో ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. ఎక్కడికక్కడ సమైక్యవాదులు ఆందోళనలు ఉధృతం చేశారు. ఉదయం నుంచే వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, సమైక్యవాదులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలియచేస్తున్నారు. -
శ్రీవారి భక్తులకు సమైక్య సెగ
సాక్షి, తిరుమల/తిరుపతి : సీమాంధ్ర బంద్ ప్రభావంతో మంగళవారం తిరుమల శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొండపైకి వెళ్లేవాళ్లు, తిరుమల నుంచి తిరిగి వచ్చేవారు రవాణా సదుపాయాలు లేక అష్టకష్టాలు పడ్డారు. ఉదయం నుంచే తిరుమల, తిరుపతి మధ్య తిరిగే 107 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. టీటీడీ, ప్రైవేట్ వాహనాలతోపాటు ద్విచక్రవాహనాలనూ సమైక్యవాదులు అనుమతించలేదు. దీంతో వేలాదిమంది భక్తులు తిరుపతిలోనే ఉండిపోయారు. రోడ్లపైనే పడిగాపులు కాశారు. కొంతమంది కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. తిరుపతిలో ఉండే ఉద్యోగులను, ఆలయ సిబ్బందిని తెల్లవారుజామునే అలిపిరి టోల్గేట్ తర్వాత ఘాట్‌రోడ్డు మీదుగా టీటీడీ లారీలు, ఇతర వాహనాల ద్వారా తిరుమలకు చేర్చారు. ఆ సమయానికి రాని కొంతమంది రవాణా సౌకర్యంలేక వెనుదిరిగారు. సాయంత్రం 4 గంటల తర్వాత కొన్ని బస్సులు, రాత్రి 7 గంటల తర్వాత మొత్తం బస్సుల రాకపోకలు కొనసాగాయి. భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో లఘుదర్శనం కల్పించారు. సాయంత్రం వరకు శ్రీవారి ఆలయ ప్రాం గణం కొంత బోసిపోయినట్టు కనిపించింది. తిరుమలకు రాలేని భక్తులకు అలిపిరి, శ్రీనివాసం, విష్ణునివాసం, రైల్వే స్టేషన్ల వద్ద టీటీడీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు అందజేశారు. టీటీడీ కాంప్లెక్స్‌లలో ఆశ్రయం కల్పించినట్లు ఈవో ఎంజీ గోపాల్ విలేకరులకు తెలిపారు. బస్టాండ్‌లో తోపులాట సాయంత్రం 4 గంటల నుంచి బస్సులు, ప్రయివేట్ వాహనాల కోసం భక్తులు ఎగబడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద భక్తుల మధ్య తీవ్రమైన తోపులాటలు జరిగాయి. కొందరిని బస్టాండు కంపార్ట్మెంట్లో పెట్టి గేట్లు మూసేశారు. బయట ఉన్న భక్తులను రోడ్లపైనే కూర్చోబెట్టి టికెట్ల మంజూరు చేశారు. చంటి బిడ్డలు, మహిళలు, వృద్ధులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. -
కడపలో బంద్
-
దిగ్విజయ్ ఇంటి ముందు APNGO నేతల ఆందోళన
-
ఎంబీబీఎస్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా
ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ (రెఫర్డ్ బ్యాచ్) విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. సీమాంధ్ర జిల్లాల్లో తీవ్రస్థాయిలో సమ్మె జరుగుతున్న కారణంగా ఎగ్జామినర్లు అందుబాటులో లేరని, అందుకే ఈ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ వైద్య కళాశాలలకు సమాచారమిచ్చారు. నిర్ణయించిన తేదీల ప్రకారం ఈనెల 27, 28, 30, 31 తేదీలలో జరగాలి. కానీ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్న కళాశాలల అధ్యాపకులే కాకుండా, బయట రాష్ట్రాల నుంచి లేదా జిల్లాల నుంచి ఎగ్జామినర్లు రావాల్సి ఉంటుంది. కానీ ఈ పరిస్థితుల్లో రావడానికి ముందుకు రాలేదని తెలిసింది. తిరిగి ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తేదీలు ఇవ్వలేదు. ఇదిలా ఉండగా, తెలంగాణ జిల్లాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నా వైస్ చాన్స్‌లర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇక్కడ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించలేదని తెలంగాణ వైద్యులు ఆరోపించారు. ఎగ్జామినర్లుగా ఎవరికి విధులు అప్పజెప్పారన్న సమాచారం కూడా ఇవ్వలేదని ఓ వైద్యుడు పేర్కొన్నారు. దీనిపై వైద్య మంత్రి స్పందించక పోవడం ఘోరమని విమర్శించారు. -
ఉద్యోగుల సమ్మెకాదు.. ప్రజా ఉద్యమం:అశోక్ బాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యోగుల సమ్మెను హైకోర్టు తప్పు పట్టిందని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు బుధవారం విశాఖపట్నంలో వ్యాఖ్యానించారు. రాష్టంలో జరుగుతోంది ఉద్యోగుల సమ్మె కాదని... ప్రజా ఉద్యమం అని ఆయన అభిప్రాయపడ్డారు. తమను హైకోర్టు తప్పు పట్టిన... తాము చేపట్టిన ఉద్యమాన్ని ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమని నిరాకరించిన సెప్టెంబర్ 7న సమైక్యాంధ్ర సభను నిర్వహించి తీరుతామని ఆయన పేర్కొన్నారు. అయితే రాష్ట్ర విభజనకు నిరసనగా ఎపీఎన్జీవో చేపట్టిన సమ్మెపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్రం ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయాన్ని మీరెలా సవాల్ చేస్తారని హైకోర్టు ఎపీఎన్జీవోల సంఘాన్ని ప్రశ్నించింది. సమ్మె చేయాలని మీకు అంతగా ఆసక్తి ఉంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి సమ్మెలో పాల్గొనాలని ఎపీఎన్జీవోలకు సూచించింది. సమ్మెకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయడానికి తమకు కొంత గడువు కావాలని ఏపీఎన్జీవో సంఘం హైకోర్టును కోరింది. దాంతో ఆ కేసు తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఏపీఎన్జీవోలు చేపట్టిన సమ్మె అనైతికం అంటూ రవికుమార్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రవికుమార్ వేసిన పిటిషన్ బుధవారం హైకోర్టులో వాదనకు వచ్చింది. హైకోర్టులో జరిగిన వాదనకు ఎపీఎన్జీవోల తరుఫున సీమాంధ్ర సచివాలయం ఉద్యోగులు ఫోరం హజరైంది. అయితే బుధవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు విశాఖపట్నంలోని పైవిధంగా స్పందించారు. -
ఎరువులకూ సమ్మె సెగ
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాదీ రైతులకు ఎరువుల సమస్య తలెత్తనుంది. విచిత్రమేంటంటే.. ఓడరేవుల్లో, గోడౌన్లలో పుష్కలంగా ఎరువుల నిల్వలు ఉన్నా అవి రైతుల దరిచేరని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీమాంధ్ర ప్రాంతంలో ఉధృతంగా జరుగుతున్న సమ్మె ఒక వైపు, నాబార్డ్ చైర్మన్ ప్రకాశ్ బక్షి సిఫారసులకు నిరసనగా ‘ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల’ సిబ్బంది ఆందోళన బాట పట్టడం మరోవైపు.. ఎరువుల సరఫరాపై ప్రభావం చూపించనున్నాయి. ఈ సమస్యలను అధిగమించి సకాలంలో రైతుల ఎరువుల సరఫరాకు ప్రత్యామ్నాయాలపై అటు ప్రభుత్వం కానీ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులుకానీ దృష్టి సారిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. విదేశాల నుంచి మన ఓడరేవులకు చేరుతున్న ఎరువులు, వాటిని రైల్వే వ్యాగన్లలో వివిధ జిల్లా కేంద్రాలకు తరలించడంతోనే తమ బాధ్యత తీరిపోయిందన్న వైఖరి ప్రభుత్వంలో కనిపిస్తోంది. ఎరువుల సమస్యపై ప్రస్తావిస్తే ‘ఎక్కడా ఎరువుల కొరత లేదు. ప్రతి జిల్లాలోను అవసరానికన్నా ఎక్కువగానే ఎరువుల నిల్వలు ఉన్నాయంటూ’ అధికారులు గణాంకాలను ఉదహరిస్తున్నారు. అవసరానికి మించి నిల్వలు ఉండటం వాస్తవమే అయినా అవి రైతులకు అందచేయడంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఆలోచించడంలేదు. పెరిగిన యూరియా వినియోగం..: గత ఏడాదితో పోల్చుకుంటే రాష్ట్రంలో యూరియా, డీఏపీ వినియోగం తగ్గింది. డీఏపీ తదితర ఎరువులపై ‘సబ్సిడీ’ తీసివేయడంతో యూరియా ధరకు, మిగతా ఎరువుల ధరలకు మధ్య వ్యత్యాసం భారీగా పెరిగింది. కాంప్లెక్స్ ఎరువులు కొనలేక, పైరుకు ఏదో ఒక ఎరువు వేయాలన్న ధోరణితో రైతులు యూరియా వేస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్‌లో జూలై 31 నాటికి 7.45 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది 8.35 లక్షల టన్నుల యూరియా అమ్ముడైంది. ఇదే సమయంలో గత ఏడాది డీఏపీ 1.86 లక్షల టన్నులు అమ్ముడవగా, ఈ ఏడాది 1.51 లక్షల టన్నులు అమ్ముడవడమే దీనికి నిదర్శనం. నిల్వలు భారీగా ఉన్నా..: అంతర్జాతీయ మార్కెట్లో టన్ను యూరియా 330 డాలర్ల నుంచి 303 డాలర్లకు పడిపోయిన నేపథ్యంలో దాదాపు 20 లక్షల టన్నుల యూరియా కొనుగోలు చేశామని, గుజరాత్, ముంబై తదితర పడమటి ప్రాంతమంతా అధిక నిల్వలతో నిండిపోవడం కారణంగా ఈ 20 లక్షల టన్నుల యూరియా మన తూర్పు తీర ప్రాంత ఓడరేవులకే వస్తోందని ఓ ఎరువుల కంపెనీ అధికారి వివరించారు. ఆగస్టు నెలలో ఇప్పటి వరకూ 13 ర్యాక్‌లలో (రైల్వే వ్యాగన్లు) దాదాపు 35,750 టన్నుల ఎరువులు వివిధ జిల్లాలకు సరఫరా అయ్యాయని, ఓడరేవుల్లో మరో 17 ర్యాక్‌ల(46,750 టన్నులు) లోడింగ్ జరుగుతోందని, రెండు మూడు రోజుల్లో ఈ సరకు కూడా వివిధ జిల్లాలకు చేరుకోనుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఆగస్టు నెలలో 4,63,530 టన్నుల యూరియా సరఫరా లక్ష్యం కాగా ఇప్పటికే(16-8-13కు) 2,61,893 టన్నుల యూరియా వివిధ జిల్లాలకు సరఫరా చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఎరువుల నిల్వలకు కొదవ లేదని కాకపోతే వచ్చిన నిల్వలను రైతుల వద్దకు సక్రమంగా చేరవేయడంలోనే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఓ ఎరువుల కంపె నీ ప్రతినిధి వివరించారు. సీమాంధ్రలో జరుగుతున్న సమ్మె కారణంగా రైల్వే వ్యాగన్ల నుంచి ఎరువుల బస్తాలను రోడ్డు మార్గంలో తరలించేందుకు ‘ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు’ ముందుకు రావడంలేదని, దాంతో ఎరువులను ఎక్కువగా తెలంగాణ జిల్లాలకు తరలించామని ఓ ఎరువుల కంపెనీ అధికారి చెప్పారు. సహకార సంఘాల ఆందోళన..: సీమాంధ్రలో జరుగుతున్న సమ్మెకు తోడు, ప్రాథమిక సహకార సంఘాల(ప్యాక్స్)ను నిర్వీర్యం చేస్తూ ‘బక్షి సిఫారసుల’ అమలును వ్యతిరేకిస్తూ ‘సహకార’ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. ఈ నెల 19న అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీసీబీల ముట్టడి కార్యక్రమాలను ప్రకటించారు. ఎరువుల సరఫరాలో ‘ప్యాక్స్’ కీలక పాత్ర పోషిస్తున్నాయి. కృష్ణా డెల్టాలో ఇప్పుడిప్పుడే వరి నాట్లు జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ‘ప్యాక్స్’ సిబ్బంది ఆందోళన బాట పడితే ఎరువులు గోడౌన్లలోనే ఉండిపోయే ప్రమాదం ఉంది. రాబోయే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇదే విషయాన్ని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావిస్తే, ఇప్పటి వరకు ఎరువుల రవాణా సమస్య తలెత్తలేదని, భవిష్యత్‌లో అలాంటి సమస్య వస్తే ఆలోచిస్తామని అంటున్నారు. -
సీమాంధ్రలో.. ఉప్పెనంత ఉద్యమం
సాక్షి నెట్వర్క్: సమైక్యమే శ్వాసగా ఉద్యమిస్తున్న సీమాంధ్రులకు సకల జనుల సమ్మె తోడవడంతో సమైక్యపోరాటం తారస్థాయికి చేరింది. మలిరోజూ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా సాగింది. సమ్మెకు తోడుగా అడుగడుగునా సమైక్యవాదులు బుధవారం నిరసనలను హోరెత్తించారు. ప్రజలే కదలివచ్చి స్వచ్ఛందంగా భాగస్వాములైతే ఉద్యమం ఏ రూపులో ఉంటుందో ప్రస్తుత సమైక్యాంధ్ర పోరు అద్దంపడుతోంది. తెలుగు మాట్లాడే వారంతా కలిసుందామనే భావోద్వేగంతో రాజకీయాలు, వర్గాలు, కులాలు, మతాలకతీతంగా జనం ముందుకొచ్చి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. అడ్డగోలు విభజనకు వ్యతిరేకంగా విస్పష్ట ప్రకటన చేసిన వైఎస్సార్ సీపీకి బాసటగా నిలుస్తూ, వేర్పాటు ప్రకటన చేసిన కాంగ్రెస్ నేతలపైనా, రెండు కళ్ల సిద్ధాంతంతో ఇరువర్గాలనూ ఏమారుస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపైనా ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ఎక్కడికక్కడ సమైక్యవాదులు కాంగ్రెస్, టీడీపీ నేతలను అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతల అడ్డగింత కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు చేపట్టిన 200 మంది ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు కేయీ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్ రాగా, నీటిపారుదల శాఖ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విశాఖలో జరిగిన సింహగర్జనలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మాట్లాడుతుండగా దొంగ రాజీనామాలు చేసిన వారికి మాట్లాడే హక్కు లేదంటూ జేఏసీ నేతలు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా పీలేరులో డిజిటల్ ప్లెక్సీల్లో చిరంజీవి, లగడపాటి, సాయిప్రతాప్, పురంధేశ్వరి చిత్రాలను ముద్రించి సీమాంధ్ర దొంగలుగా ప్రకటించారు. ఈ దొంగలను పట్టించినవారికి రూ.10లక్షలు నగదు బహుమతి ఇస్తామంటూ రాసిన ఫ్లెక్సీలను ఊరేగించారు. మంత్రి వట్టి వసంతకుమార్‌ను గణపవరంలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో జేఏసీ నేతలకు టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, కాంగ్రెస్ నేతలు మద్దతు ప్రకటించడానికి రాగా, అప్పటి వరకు కూర్చొన్న వారంతా ‘మీ మొహాలు చూపించవద్ద’ంటూ లేచి వెళ్లిపోయారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి తాళాలు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రెండువేల మందికి పైగా రెవెన్యూ ఉద్యోగులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి తాళాలు వేసి దీక్షలు చేపట్టారు. రాజమండ్రిలో ట్రాన్స్‌కో ఉద్యోగులు ఆకులు కట్టుకుని అర్ధనగ్న ప్రదర్నన చేశారు. వివిధ శాఖల ఉద్యోగులు కాకినాడలో కలెక్టరేట్‌ను ముట్టడించి కార్యకలాపాలను స్తంభింపజేశారు. రాజమండ్రి, కాకినాడ, ఏలేశ్వరం డిపోల్లో ఆర్టీసీ ఉద్యోగులు ధర్నాలు చేపట్టారు. గొల్లప్రోలు తహశీల్దార్ కార్యాలయం ఎదుట మెయిన్ రోడ్డుపై స్నానం చేస్తూ రంపచోడవరం ఎంపీడీవో విశ్వనాథ్ నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండు ఎదురుగా భారీ మానవహారం ఏర్పాటు చేశారు. షార్ ఉద్యోగుల ర్యాలీ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో ఉద్యోగులు, వారి సతీమణులు సమైక్యాంధ్ర జేఏసీగా ఏర్పడి ర్యాలీ నిర్వహించారు.అనంతపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ జాక్టో చేపట్టిన దీక్షలకు ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, జెడ్పీ ఎదురుగా పీఆర్జేఏసీ చేపట్టిన దీక్షలకు వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. 20వేలమందితో భారీ ప్రదర్శన హిందూపురంలో రెడ్డి సేవా సంఘం, వైఎస్సార్సీపీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి సారథ్యంలో 20వేలమందితో భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖలో చెన్నై-కోల్‌కతా జాతీయరహదారిపై పలుచోట్ల వంటావార్పులు చేయడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్తంభించింది. అటు ఒడిశా, కోల్‌కతా వెళ్లాల్సిన లారీలు, సరకుల వాహనాలు, ఇటు చెన్నై, కేరళ వెళ్లాల్సిన సరకుల లోడ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విశాఖ పోర్టుకు లారీల రాక ఆలస్యమవడంతో నౌకలు సకాలంలో కార్గోతో వెళ్లలేకపోయాయి. థింసా నృత్యంతో గిరిజనుల నిరసన విశాఖ ఏజెన్సీలోని 11మండలాల్లో బంద్ పూర్తిస్థాయిలో జరిగింది. పర్యాటక ప్రాంతమైన అరకులో గిరిజనులంతా కలిసి విభజనకు వ్యతిరేకంగా సాంప్రదాయ థింసా నృత్యం ప్రదర్శించారు. శ్రీకాకుళంలో రెవెన్యూ, జిల్లా పరిషత్ ఉద్యోగుల దీక్షా శిబిరాలను పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కుంభా రవిబాబు సందర్శించి సంఘీభావం తెలిపారు. సీతంపేట ఐటీడీఏ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఎన్జీఓల మానవహారం ఏలూరులో ఎన్జీవోలు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి ఫైర్‌స్టేషన్ సెంటర్లో మానవహారం జరిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సత్తి చంద్రారెడ్డి అనే రైతు పెనుమంట్ర మండలం మార్టేరులో బుధవారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ‘నిజం తెలుసుకో తెలుగు సోదరా’ ‘నిజం తెలుసుకో తెలుగు సోదరా’ అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర విభజనకు సుముఖత వ్యక్తం చేయలేదంటూ దినపత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లతో రూపొందించిన పోస్టర్లను వైఎస్సార్ సీపీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆవిష్కరించారు. విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల, ప్రభుత్వాస్పత్రి, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీల నుంచి వందలాది మంది ఉద్యోగులు, వైద్య విద్యార్ధులు మహానాడు జంక్షన్లో జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. దీంతో హైవేపై రెండుగంటలకు పైగా ట్రాఫిక్ స్తంభించి కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. వైఎస్సార్సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయ కర్త జోగి రమేష్ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో అన్నిచోట్లా వైఎస్ఆర్ సీపీ నేతలు రిలేదీక్షలకు కూర్చొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులో బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి లాడ్జి సెంటర్ వరకు వేలాదిమంది కార్యకర్తలు పాదయాత్ర చేశారు. పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ మేకతోటి సుచరిత, జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డితో పాటు నేతలు అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి మెట్లుదిగుతున్న సుచరిత స్వల్ప అస్వస్థతకు లోనై కాసేపు అక్కడే కూర్చుండిపోయారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు చేపట్టిన ఉద్యోగులకు వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి మద్దతు తెలిపారు. మోకాళ్లపై కూర్చుని టీచర్ల నిరసన ఆత్మకూరులో టీచర్లు నల్లబ్యాడ్జీలు నోటికి కట్టుకొని మౌన ప్రదర్శన చేశారు. అనంతరం గౌడుసెంటర్ వద్ద మోకాళ్లపై నిలిచి నిరసన వ్యక్తం చేశారు. కడపలో ఆర్టీపీపీ ఉద్యోగులు విధులను బహిష్కరించి రోడ్లపైనే నిరసన తెలియజేస్తూ రిలే దీక్షలు ప్రారంభించారు. బద్వేలులో పలు గ్రామాల ప్రజలు జాతీయ రహదారులపై రోడ్లకు అడ్డంగా కంపచెట్లు వేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. విద్యార్థుల రక్తదానం విజయనగరం పట్టణంలో వివిధ వర్గాల ఉద్యమకారులు ప్రతీ ఐదు నిమిషాలకు మానవహారాలు, నిరసనలు నిర్వహించారు. 80మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ‘వేర్పాటు’పై యుద్ధమే.. విశాఖ సింహగర్జనలో తీర్మానం కేంద్రం తీసుకున్న వేర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు సమైక్య పోరాటం ఆపేది లేదని విశాఖలో జరిగిన సింహగర్జనలో సమైక్యవాదులు తేల్చిచెప్పారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సీమాంధ్ర యూనివర్సిటీలకు చెందిన జేఏసీ నేతలు, ఎమ్మెల్యేలు, కళాకారులు, విద్యార్థులు హాజరయ్యారు. వంగపండు ప్రసాదరావు బృందంతో పాటు వివిధ సంఘాలకు చెందిన కళాకారులు గజ్జెకట్టి ఆటపాట వినిపించారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర పౌరులకు రక్షణ కల్పించడం కోసం రాజధానిలో భారీ బహిరంగ సభ, త్వరలో ఛలో ఢిల్లీ చేపట్టాలని తీర్మానించారు. సమైక్యాంధ్ర కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న 350కుటుంబాల సభ్యులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కూడా ఈ సందర్భంగా తీర్మానించారు. విభజన భయానికి మరో తొమ్మిదిమంది బలి సాక్షి నెట్వర్క్: రాష్ట్రం ముక్కలవుతుందనే భయంతో మరణాల పరంపర కొనసాగుతూనే ఉంది. సీమాంధ్రలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం తొమ్మిదిమంది తనువు చాలించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే నలుగురు మృతి చెందారు. పూతలపట్టు మండలంలోని ఎం. బండపల్లెకు చెందిన ముత్తుస్వామి(46) రాష్ట్ర విభజన జరిగితే ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయేమోనన్న అనుమానంతో తీవ్ర ఆందోళనకు గురై బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బి.కొత్తకోట మండలం నామాలపల్లె దళితవాడకు చెందిన వ్యవసాయ కూలీ గోపాలు(47) గుండెపోటుతో మృతిచెందాడు. కార్వేటినగరం మండలం ఎంఎం విలాసం పంచాయతీ ఎం.కృష్ణాపురం గ్రామానికి చెందిన టైలర్ సీ భాస్కర్(40), వీ.కోట మండలం నక్కనపల్లెకు చెందిన చలపతి(41) టీవీల్లో వార్తలు చూస్తూ గుండెపోటుతో కన్నుమూశారు. కృష్ణాజిల్లా కూచిపూడి మండలం మొవ్వ అంబేద్కర్ నగర్‌కు చెందిన గద్దె సుబ్బారావు (60) మంగళవారం టీవీ చూస్తూ హఠాత్తుగా కిందపడిపోయి చనిపోయినట్టు బంధువులు తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న డి. మునిస్వామి రాష్ట్ర విభజన నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులను చూసి తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు. విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరం మండలం పి. ధర్మవరం గ్రామానికి చెందిన చిందాడ అప్పారావు (58) సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో బుధవారం టీవీ చూస్తూ భావోద్వేగానికి గురై హఠాన్మరణం చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పారావుకు కొడుకులు లేకపోవడంతో అంత్యక్రియల బాధ్యతను అతని నలుగురు కుమార్తెలూ భుజానకెత్తుకున్నారు. సమైక్యాంధ్ర ఇక సాధ్యం కాదేమోనని మనస్తాపం చెంది అనంతపురం జిల్లా లేపాక్షి మండలం విభూదిపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఈశ్వరప్ప (62) గుండెపోటుతో మృతి చెందాడు. విభజన వార్తలతో గత వారంరోజులుగా మనస్తాపంతో ఉన్న వైఎస్సార్ జిల్లా వేంపల్లె దళితవాడకు చెందిన శీలం రాజు (28) ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు తెలిపారు. -
రెండోరోజూ సీమాంధ్ర బంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా ఉద్యోగులు చేపట్టిన సమ్మెతో సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు రెండోరోజూ మూతపడ్డాయి. బుధవారం కూడా పరిపాలన పూర్తిగా స్తంభించింది. ఏపీ ఎన్జీవో, ఉపాధ్యాయ జాక్టో, నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బ్యాంకులు, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు రోడ్డెక్కలేదు. 122 డిపోల్లో బస్సులు బయటకురాలేదు. నెల్లూరు డిపోలో 158 బస్సులు డిపో దాటాయి. కానీ అవి కూడా పూర్తిస్థాయిలో తిరగలేదు. తిరిగిన కొన్ని బస్సులకు కూడా ప్రయాణికుల ఆదరణ లభించలేదు. తిరుమలకు బుధవారం 106 బస్సులు తిప్పినట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌తో పాటు సీమాంధ్రలోని అన్ని బస్స్టేషన్లు బోసిపోయాయి. హైదరాబాద్, సీమాంధ్ర జిల్లాల మధ్య ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. పరిమిత సంఖ్యలో ప్రైవేటు బస్సులు మాత్రం తిరుగుతున్నాయి. సమైక్యాంధ్ర ఆందోళనల నేపథ్యంలో సీమాంధ్ర అంతటా సరుకు రవాణాకు అంతరాయం కలిగింది. 13 జిల్లాల్లోని రవాణా శాఖ కార్యాలయాలు పనిచేయకపోవడంతో.. లారీలకు ఫిట్‌నెట్ సర్టిఫికెట్లు, పర్మిట్లు తీసుకోవడం సాధ్యం కాలేదు. దాదాపు 10 వేల లారీలు రోడ్డక్కెకుండా నిలిచిపోయాయి. హైదరాబాద్‌లో సమ్మె ప్రభావం నామమాత్రంగానే కనిపించింది. అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు బుధవారం యథావిధిగా పనిచేశాయి. పలు శాఖాధిపతుల కార్యాలయాల్లో భోజన విరామ సమయంలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీ నిరసన ప్రదర్శనలు చేశారు. చిత్తూరు జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ల ఉద్యోగులు కార్యాలయాల ముందు బైఠాయించి నిరసనలు తెలియజేశారు. అనంతపురం జిల్లాలో ఏపీ ఎన్జీవోల సమ్మెతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ బోసిపోయాయి. వైఎస్సార్ జిల్లాలో సుమారు 35వేల మంది ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. కృష్ణా జిల్లాలో విద్యాసంస్థలను స్వచ్చందంగా మూసివేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉద్యోగులు వంటావార్పు నిర్వహించారు. గుంటూరు జిల్లాలో ఉద్యోగులందరూ రోడ్లపైకి చేరి ఆందోళనలు చేశారు. విశాఖ జిల్లాలోని అన్ని పట్టణ కేంద్రాల్లో దుకాణాలు మూతపడ్డాయి. విశాఖపట్నం పోర్టుకు వివిధ ప్రాంతాలనుంచి రావలసిన మత్స్య ఉత్పత్తులు, లారీల రాక ఆలస్యమవుతుండటంతో నౌకలు సకాలంలో కార్గోతో ప్రయాణించడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా పరిషత్ ఉద్యోగులు దీక్షలు, విద్యుత్తుశాఖ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. విజయనగరం జిల్లాలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను సైతం కార్యాలయాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఏలూరులో ఎన్జీవోలు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి ఫైర్‌స్టేషన్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. కాకినాడలో వర్తక, వాణిజ్య, వ్యాపార దుకాణాలను మూసివేసి బంద్ పాటించారు. సమ్మెలో టీటీడీ ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా టీటీడీ ఉద్యోగులు రెండోరోజూ విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. దీంతో టీటీడీ పరిపాలనా భవనం, అనుబంధ కార్యాలయాలు వెలవెలబోయాయి. బుధవారం వేకువజామున 3 గంటల నుంచి తిరుమల డిపోకు చెందిన 106 బస్సు సర్వీసులు తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించాయి. -
తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకుంటాం: మంత్రి వట్టి
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రక్రియను నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతుందన్న నమ్మకం తమకుందని వట్టి వసంతకుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని గణపవరంలో ఆయన విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. ఎవరూ రాజీనామాలు చేయొద్దని ఆయన సీమాంధ్రలోని ప్రజాప్రతినిధులకు సూచించారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకిద్దామని సీమాంధ్ర ప్రాంతంలోని 159 మంది ఎమ్మెల్యేలకు వట్టి వసంతకుమార్ పిలుపునిచ్చారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే పార్లమెంట్లో బిల్లు పెట్టే నైతిక హక్కు ఉండదు ఆయన స్పష్టం చేశారు. మెజార్టీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుంటే కోర్టుకు వెళ్లే అవకావం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీల కతీతంగా సమైక్యాంధ్ర కోసం పోరాటం చేద్దామని సీమాంధ్రలోని అన్ని పార్టీల నాయకులకు సూచించారు. నాతో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులందరు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించిన మరుక్షణమే తామంతా తమ పదవులకు రాజీనామాలు చేస్తామని వట్టి వసంతకుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసినా మేమంతా విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామన్నారు. అధిష్టానం నిర్ణయం కంటే ప్రజల నిర్ణయమే మాకు ముఖ్యం మంత్రి వట్టి వసంతకుమార్ పేర్కొన్నారు. -
‘సమైక్య’నిర్ణయం వచ్చేవరకు సమ్మె
* ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు * 16న అన్ని ఉద్యోగ సంఘాలతో భేటీ సాక్షి, హైదరాబాద్: సమ్మె విరమించమని తమ మీద తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయని, ఒత్తిళ్లకు తలొగ్గి సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే దిశగా స్పష్టమైన నిర్ణయం వెలువడే వరకు సమ్మె కొనసాగిస్తామని చెప్పారు. ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి అశోక్‌బాబు మంగళవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. మంగళవారం తొలిరోజు సమ్మెలో 99 శాతం మంది ఉద్యోగులు పాల్గొన్నారని, సీమాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె వల్ల రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయిందన్నారు. సమ్మెను విజయవంతం చేయడం ద్వారా.. రాష్ట్ర విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయం ఎంత వివాదాస్పదమో ఉద్యోగులు, ప్రజలు చెప్పకనే చెప్పారన్నారు. విభజనవాదుల చర్యలకు భయపడబోమని, వారు చేసే ప్రకటనలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పోటీగా వ్యాఖ్యలు చేయబోమని చెప్పారు. ఇరు ప్రాంతాల ఉద్యోగుల మధ్య ఉన్న సత్సంబంధాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేయడం మంచిదికాదని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలకు హితవు పలికారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను బెదిరించడం, మహిళలను అసభ్య పదజాలంతో దూషించడం తెలంగాణ ఉద్యోగులకు తగదన్నారు. నిరసన వ్యక్తం చేయడానికి ఇబ్బందిలేకుండా చర్య లు చేపడతామని మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చింద ని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా సీమాంధ్ర ఎంపీలు రాజీనామాలు చేసి ఉద్యమంలో కలవాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 16న గుంటూరు లేదా విజయవాడలో అన్ని సంఘాలతో సమావేశం కానున్నామని, ఆ సమావేశంలో ఢిల్లీ యాత్ర తేదీలను ఖరారు చేస్తామని తెలిపారు. వి భజన నిర్ణయం జరిగిపోయిందనే వాదనలో వాస్తవం లేదన్నారు. రాజకీయ కారణాల మీద ఉద్యోగులు సమ్మెకు ఎలా వెళతారని ప్రశ్నించగా.. ‘‘విభజన తర్వాత 8.5 లక్షల మంది ఉద్యోగులకు స్థానభ్రంశం ఉండదని, సీనియారిటీ, పదోన్నతుల విషయాల్లో మార్పులు లేకుండా యథావిధిగా ఉంచుతామని ప్రభుత్వం ప్రకటిస్తే సమ్మె విరమించడానికి సిద్ధం’’ అన్నారు. ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఉపసంఘం సమ్మె విరమించుకునేలా సీమాంధ్ర ఉద్యోగ సంఘాలను ఒప్పించటానికి మంత్రివర్గ ఉపసంఘం ప్రయత్నాలు ప్రారంభించింది. బుధవారం ఉదయం 11.30 గంటలకు చర్చలకు రావాల్సిందిగా. ఏపీఎన్జీవో, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులను ఉపసంఘం ఆహ్వానించింది. -
రవాణా సమ్మెకు ప్రత్యామ్నాయం కష్టమే: మంత్రి బొత్స
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెవల్ల సీమాంధ్ర ప్రాంతంలో 11 వేల బస్సులు డిపోల్లోనే ఆగిపోయాయని రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ప్రస్తావించగా.. ‘‘ఇంత పెద్ద ఎత్తున సమ్మె జరుగుతున్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం ఇబ్బందే. అయినా ప్రభుత్వపరంగా మావంతు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను కోరుతున్నాం. రాష్ట్ర విభజన ప్రకటనపై సీమాంధ్ర ఉద్యోగుల అభ్యంతరాల గురించి మేం ఆంటోనీ కమిటీకి, పార్టీ అధిష్టానానికి తెలియజేస్తాం. ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలి’’ అని బొత్స కోరారు. కాగా.. ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజిస్తోందన్న వాదనలను బొత్స ఖండించారు. ‘‘సీట్ల కోసమైతే తెలంగాణకు ఎందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణకంటే సీమాంధ్రలోనే ఎక్కువ సీట్లు ఉన్నాయి కదా..?’’ అని ప్రశ్నించారు. సీమాంధ్ర మంత్రులు రాజీనామాలు చేయాలని సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు చేసిన డిమాండ్‌ను ప్రస్తావించగా... సీమాంధ్ర ప్రాంతంలోని జర్నలిస్టులు ఎందుకు రాజీనామాలు చేయలేదని మంత్రి ఎదురు ప్రశ్నించారు. -
13 జిల్లాల్లో కొనసాగుతున్న ఆందోళనలు
-
సీమాంధ్రలో ఏపీఎన్జీఓల సమ్మె ప్రారంభం!
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతాల్లో ఏపీఎన్జీఓల సమ్మె తీవ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు సోమవారం అర్థరాత్రి నుంచి సమ్మె ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఏపీఎన్జీవోలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మెలో 4 లక్షలమంది ఉద్యోగులు పాల్గొననున్నారు. ఏపీ ఎన్జీవోలతోపాటు పలు కార్మిక సంఘాలు కూడా సమ్మెలో పాల్గొననున్నాయి. సమ్మె వాయిదా వేయడం తమ చేతుల్లో లేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు ఆశోక్ పేర్కొన్నారు. ఆంటోనీ కమిటీ పరిధి స్పష్టంగా లేదంటూ ఏపీఎన్జీవోలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు దిగితే సమ్మె ఉధృతమవుతుంటూ హెచ్చరిస్తున్నారు. ఈ సమ్మెలో భాగంగా హైదరాబాద్ లో హెచ్‌వోడీ కార్యాలయాలు బంద్ కు పిలుపునిచ్చాయి. రేపు అత్సవసర సేవలు మినహా వైద్యసేవలు బంద్ కానున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం పలు జిల్లాల విద్యార్థి జేఏసీ బంద్ కు పిలుపునిచ్చాయి. వెల్పేర్‌లో కమిషనరేట్‌లో సేవలు బంద్ కానున్నాయి. సీమాంధ్రలో పెట్రోల్ బంక్ లు బంద్ కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా బంద్ కు పిలుపునిచ్చాయి. -
విశాఖపట్నంలో సమైక్యవాదుల అరెస్ట్
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. రైల్‌రోకోకు సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో రైల్‌రోకోకు ప్రయత్నించిన సమైక్యవాదులను అరెస్టు చేశారు. రైల్వే స్టేషన్ వద్ద భారి పోలీస్ బందోబస్తు పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట రైల్వేస్టేషన్లో సమైక్యవాదులు రైల్‌రోకో చేపట్టనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరులో నిరాహారదీక్ష చేసేందుకు సిద్దమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డిను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా టెంట్ తొలిగించారు. చిత్తూరు జిల్లాలో 12వ రోజు కొనసాగుతున్న బంద్ కొనసాగుతోంది. దుకాణాలు ఇంకా తెరుచుకోలేదు. -
గుండెపోటుతో ఒక్కరోజే 12 మంది మృత్యువాత
సాక్షి నెట్వర్క్: రాష్ట్రం ముక్కలవుతుందనే భయంతో సీమాంధ్రజిల్లాల్లో మృత్యుఘంటికలు మోగుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయంతో మనస్తాపానికి గురై శనివారం ఒక్కరోజే 12 మంది గుండెపోటుతో మరణించారు. పశ్చిమగోదావరి జిల్లాలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. నిడదవోలుకు చెందిన లారీ డ్రైవర్ బడుగు శంకరుడు (42), నరసాపురానికి చెందిన హోంనీడ్స్ ఏజెన్సీ యజమాని ప్రత్తి శ్రీనివాస్ (46), నరసాపురం మండలం దర్భరేవు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ యడ్ల నాగేశ్వరరావు (54)గుండె ఆగి చనిపోయారు. పెరవలి మండలం ముక్కామలకు చెందిన యాండ్ర రంగారావు (31), గోపాలపురానికి చెందిన డేవిడ్‌రాజు (53), ఉండి మండలం మహదేవపట్నానికి చెందిన జల్లి సహదేవుడు (35) గుండెపోటుతో మరణించారు. అదేవిధంగా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని రామళ్లకోట గ్రామానికి చెందిన ఏపూరి రమణ (41), రత్నపల్లెకు చెందిన నారాయణ (52), అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో ఆర్ఎంపీ వైద్యుడు కృష్ణ (42), గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన తూమాటి నాగయ్య (45), చిత్తూరు జిల్లా కలకడవుండలం ఎర్రకోటపల్లె గ్రావూనికి చెందిన ఎం.వెంక ట్రావుయ్యు(60), తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన బెల్లంకొండ సీతారత్నం(55) గుండెపోటుతో శనివారం మృత్యువాత పడ్డారు. -
ఒకే మాట..ఉద్యమ బాట..
సమైక్యాంధ్ర ఉద్యమ ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఉద్యోగులు, విద్యార్థులు, వర్తకులు, కార్మికులు, శ్రామికులు ఉద్వేగంతో ఉద్యమబాట పడుతున్నారు. ఆయా వర్గాలు, సంఘాలు తమ సృజనతో వినూత్న నిరసన రూపాలు రూపొందిస్తూ ఉద్యమానికి ఊపు తెస్తున్నాయి. ఏడో రోజూ జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. సాక్షి, రాజమండ్రి : కేసీఆర్ నాశయ..నాశయ, సోనియా నాశయ.. నాశయ..సమైక్యాంధ్ర వర్థయ.. వర్థయ. అంటూ వేదపండితులు శాపనార్ధాలు పెట్టారు. ‘కేసీఆర్‌కు ఉరి.. సమైక్యాంధ్రకు దారి’ అంటూ కార్మిక, శ్రామిక, పేదవర్గాలవారు మిన్నంటేలా నినాదాలు చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లాలో కొనసాగుతున్న ఉద్యమం మంగళవారం ఏడోరోజుకు చేరింది. ఉద్యమం కారణంగా జిల్లాలో వాణిజ్యం స్తంభించింది. ఒకటో తేదీ నుంచి బ్యాంకులు, ఏటీఎంలు పనిచేయకపోవడంతో ఉద్యోగులకు జీతాలు కరువయ్యాయి. అయినా లెక్కచేయని ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా త్యాగం చేస్తామంటూ ఉద్యమించారు. పస్తులున్నా ఫరవాలేదు. తెలుగుజాతి ఒక్కటిగా ఉంటే చాలంటూ కార్మిక, శ్రామిక సంఘాల వారు సమైక్య ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. రాజమండ్రి, కాకినాడల్లో సుమారు 200 ఏటీఎంలు వారం రోజులుగా మూతపడ్డాయి.sem వర్తకం, వాణిజ్యం జిల్లాలో 80 శాతం మూతపడింది. బ్యాంకుల్లో రోజుకు రూ. 40 నుంచి రూ. 50 కోట్ల చొప్పున లావాదేవీలు నిలిచిపోయాయి. రోజుకు రూ. నాలుగు కోట్ల మేర బంగారం అమ్మకాలు, రూ. పది కోట్ల మేర కిరాణా, రూ. 50 నుంచి 75 లక్షల మేర వస్త్ర వ్యాపారం నిలిచిపోయినట్టు అంచనా. ఏ వర్గం బంద్ పిలుపు ఇవ్వకుండానే వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేస్తున్నారు. బంగారం, వస్త్ర దుకాణాలు కూడా నిరవధికంగా బంద్ పాటిస్తుండడంతో ఈ ప్రభావం బుధవారం నుంచి ప్రవేశిస్తున్న శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్‌పై పడనుంది. శాంతి, గణపతి హోమాలు రాజమండ్రిలో పురోహితులు, బ్రాహ్మణ సమాఖ్యల ఆధ్వర్యంలో పుష్కరాలరేవు వద్ద శాంతి హోమం, గణపతి హోమం నిర్వహించారు. అనంతరం యువకులు ర్యాలీ చేశారు. మహిళా శక్తి సంఘాల సభ్యులు, నాయకులు సుమారు 300 మంది మహిళలు ర్యాలీ నిర్వహించారు. కోటిపల్లి బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవిత బీమా సంస్థ ఏజెంట్లు తాడితోట, పుష్కరాలరేవు సెంటర్లో రాస్తారోకో చేసి మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సప్లయ్ కంపెనీలు, మైక్, సౌండ్ సిస్టం సంఘాలు సంయుక్తంగా మెయిన్‌రోడ్డుపై భారీగా ర్యాలీ నిర్వహించాయి. వాయిద్య కళాకారుల సంఘం ర్యాలీ నిర్వహించింది. ఆనాల వెంకటప్పారావు రోడ్లో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, మంగళవారపు పేటలోని స్థానికులు, మున్సిపల్ ఉద్యోగులు నగరపాలకసంస్థ ఎదురుగా, ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు ఆర్టీసీ బస్టాండు ఎదుట, న్యాయవాదులు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట వంటా వార్పూ నిర్వహించారు. లాయర్లు నిర్వహిస్తున్న రిలే దీక్షలు ఏడోరోజుకు చేరాయి. ఏపీఎన్జీవోలు పుష్కరఘాట్‌లో, ఇసుక ర్యాంపు రవాణా, బోట్ వర్కర్ల సంఘాలు లారీలతో భారీగా ర్యాలీ నిర్వహించాయి. స్టెయిన్లెస్ స్టీల్ అండ్ మెటల్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను ఊరేగించి దగ్ధం చేశారు. సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం సభ్యులు సమైక్య ఉద్యమంలో పాల్గొన్నారు. కోటిపల్లి బస్టాండ్‌లో వివిధ పాఠశాలలకు చెందిన చిన్నారులు కేసీఆర్ శవయాత్ర చేశారు. ర్యాలీ చేసి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోనసీమలో మరింత ఉద్ధృతం అమలాపురంలో మంత్రి విశ్వరూప్‌తో పాటు ఎమ్మెల్సీ రవికిరణ్ వర్మ, మాజీ మంత్రుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లపై వంటావార్పూ చేపట్టారు. ముమ్మిడివరం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వ్యాపారులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కొత్తపేటలో వికలాంగులు ధర్నా, రాస్తారోకో చేశారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి మోటారుసైకిల్ ర్యాలీ చేశారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రైవే ట్ కళాశాలకు చెందిన డిగ్రీ, జూనియన్ విద్యార్థులు టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రావులపాలెంలో మోటారు వర్కర్స్ యూనియన్ సభ్యులు ఆటోలతో మానవహారం నిర్వహించారు. మల్కిపురంలో ఉపాధ్యాయ సంఘాలు విధులు బహిష్కరించాయి. పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో బంగారు ఆభరణాల దుకాణదారులు వంటా వార్పు నిర్వహించారు. వైద్య ఉద్యోగులు ఉద్యమించారు. జర్నలిస్టుల ఆందోళన రాజమండ్రి జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. నగరంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ మండల కేంద్రం సర్పవరం జంక్షన్ వద్ద జర్నలిస్టులు మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాల విలేకరులు ర్యాలీలు నిర్వహించారు. జేఏసీ కార్యాచరణ సమైక్య ఉద్యమం సమష్టిగా నిర్వహించేందుకు అన్ని వర్గాలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ కాకినాడ ఎన్జీఓ హోంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించారు. జగ్గంపేటలో సమైక్యాంధ్ర కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. జాతీయ రహదారిపై మూడు గంటలపాటు రాకపోకలు స్తంభింపచేసి వంటా వార్పూ చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 16వ నెంబరు జాతీయ రహదారిపై రాజానగరం, దివాన్‌చెరువు, లాలాచెరువు వద్ద రాస్తారోకో చేసి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. రాజమండ్రి రూరల్, అనపర్తి, మండపేట, రామచంద్రపురం, రంపచోడవరం తదితర నియోజకవర్గాల్లో సమైక్యాంధ్ర ఉద్యమాలు అదే జోరు.. అదే హోరుతో కొనసాగాయి. పాల్గొన్న నేతలు రాష్ట్ర విభజనకు ములకారకుడు చంద్రబాబునాయుడేనని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు అన్నారు. సామర్లకోట రైల్వేస్టేషన్ సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన వంటా వార్పు కార్యక్రమంలో నియోజకవర్గ కో-ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడుతో కలిసి ఎమ్మెల్సీ పాల్గొన్నారు. రాష్ట్రం ముక్కలు చేయడాన్ని సహించేది లేదని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు స్పష్టం చేశారు. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సమైక్యవాది కావడం వల్లనే ఎన్టీఆర్‌ను గౌరవిస్తున్నామన్నారు. సమైక్యాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్ పిలుపునిచ్చారు. తాజీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి రాయవరం మండలం మాచవరం ఉపసర్పంచ్ ఎన్నికల్లో పాల్గొన్న సందర్భంగా బోసు ఈ పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ది కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ముందుకు వచ్చిందని మరో సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేటలో 16వ నెంబరు జాతీయ రహదారిపై జేఏసీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆత్రేయపురంలో జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేసి, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్రావు సమైక్యవాదని వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు జక్కంపూడి రాజా అన్నారు. మంగళవారం తన నివాసంలో గువ్వల కెనెడీ సమైక్యాంధ్ర కోసం వేసిన చిత్రాలను ఆవిష్కరించారు. అనంతరం రాజమండ్రి కంబాలచెరువు సెంటర్లో జక్కంపూడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
విభజన వద్దు: సమస్త వృత్తుల చైతన్యనాదం.. పల్లెల్లోనూ పల్లవించిన నినాదం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిపోనివ్వమంటూ సీమాంధ్రలో రగిలిన ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. వరుసగా ఆరో రోజు సోమవారం కూడా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా సాగింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వేర్పాటు నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు, రాజకీయపార్టీల నేతలు, మేధావులు, వివిధవర్గాల ప్రజలే కాదు.. సామాన్యజనం కూడా రోడ్లపైకి వస్తున్నారు. పిల్లా, పెద్దా, ముసలి, ముతక బేధం లేకుండా వ్యక్తిగతంగా కుటుంబాలు సైతం నిరసనదీక్షలకు దిగుతున్నాయి. రాష్ట్రం సమైక్యంగా లేకుంటే తమకు భవితవ్యమే లేదనే ఆందోళనతో అన్ని కులాలు, వృత్తుల వారు స్వచ్ఛందంగా ఆందోళనలు చేపడుతున్నారు. నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామీణప్రాంతాల నుంచి ఉద్యమం ఇప్పుడు మూరుమూల పల్లెలకు సైతం విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించని ఆ పార్టీ నేతల మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులతీరుపై సమైక్యవాదులు, సామాన్యప్రజానీకమే కాదు స్వయంగా ఆ పార్టీ కార్యకర్తలే నిప్పులు చెరుగుతున్నారు. వైఎస్సార్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద సమైక్యవాదులు చేపట్టిన రిలే దీక్షల శిబిరాన్ని సందర్శించేందుకు వచ్చిన మంత్రి అహ్మదుల్లాకు చేదు అనుభవం ఎదురైంది. దీక్షా శిబిరం వద్దకు రావద్దని చెప్పడంతో మంత్రి, సమైక్యవాదుల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ దశలో సమైక్యవాదులు మంత్రిపై దాడికి యత్నించడంతోపాటు చెప్పులు విసిరారు. దీంతో ఆయన అతికష్టంపై పోలీసు రక్షణలో దీక్షా శిబిరం వద్దకు రాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. చిరంజీవి, కావూరి, బొత్స డబ్బుకు అమ్ముడుపోయి మాకంటే హీనంగా మారారని ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో హిజ్రాలు దుమ్మెత్తిపోశారు. మంత్రి పదవి కోసం కావూరి కక్కుర్తి పడి రాష్ట్రం ముక్కలవుతున్నా చేతకానివాడిలా ఉండిపోయారని ఆయన ఇంటిని ముట్టడించిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పెదబొడ్డేపల్లిలో సోమవారం ఉదయం మంత్రి బాలరాజు కాన్వాయ్‌ను ఉపాధ్యాయులు అడ్డగించి మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. కోపోద్రిక్తుడైన మంత్రి వారిపై చెయ్యెత్తి దాడి చేసేంత పని చేశారు. పరిస్థితి వేడెక్కడంతో పోలీసులు ఆయనను బతిమాలి అక్కడ నుంచి పంపించేశారు. విశాఖలో తన వాహనాన్ని అడ్డగించిన నిరసనకారులపై గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పక్కనే ఉన్న సీఐ సత్యనారాయణతో ‘నీ గన్ ఇవ్వు..ఒక్కొక్కరినీ కాల్చేస్తా’నంటూ ఆవేశంతో ఊగిపోయూరు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించిన మంత్రి తోట నరసింహం సరైన సమయంలో తాను రాజీనామా చేస్తానన్నారు. టీడీపీ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ అనంతపురం నగరంలోని కోర్టు రోడ్డులో ఆ పార్టీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని న్యాయవాదులు అడ్డుకున్నారు. విజయనగరం పట్టణంలో చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. అన్నిచోట్లా మున్సిపల్ ఉద్యోగుల సమ్మె సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ పిలుపుమేరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ అధికారులు, సిబ్బంది 72గంటల సమ్మెలో భాగంగా సోమవారం విధులను బహిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రిలలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీలో వైద్యసేవలను నిలుపుచేసి డాక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు. క్వారీ ఏరియాలో గుడాల ప్రసాద్ అనే యువకుడు భార్య, ఇద్దరు పిల్లలతో పాటు 24 గంటల దీక్ష ప్రారంభించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన భారీ బహిరంగసభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి హాజరై ఉద్యమానికి ఊతమిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో రైల్ రోకో నిర్వహించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్ ఆండ్ బీ ఈఈ లక్ష్మీనారాయణరెడ్డికి సన్మానం చేశారు. ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు శంకర్‌విలాస్ సెంటర్లో యాచకులు నిరసన ప్రదర్శన, మానవహారం చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ గుంటూరు నగర పార్టీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్ని మూయించారు. విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ నేతృత్వంలో జరిగిన ధర్నాలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, సెంట్రల్ కన్వీనర్ పి. గౌతంరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందేనని పొలిటికల్ జేఏసీ తరపున మాజీ మంత్రులు మండలి బుద్ద ప్రసాద్, దేవినేని నెహ్రూ డిమాండ్ చేశారు. విజయనగరం శివారు ప్రాంతంలో మజ్జిపేట కాలనీ వద్ద విజయనగరం నుంచి విశాఖ వెళ్తున్న దుర్గ్ పాసింజర్ రైలును ఆందోళనకారులు అరగంటపాటు అడ్డుకున్నారు. బొబ్బిలిలో రైల్‌రోకో నిర్వహించారు. హిందూపురం మెప్మా పీఓ విజయభాస్కర్ రాజీనామా అనంతపురం జిల్లా హిందూపురం మునిసిపాలిటీలో మెప్మా ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్న విజయభాస్కర్ సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు అనంతపురం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవరావు, డీఆర్వో హేమసాగర్ మద్దతు తెలిపారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో గుండా రవికుమార్ అనే వికలాంగుడు ఆత్మహత్యకు విఫలయత్నం చేశాడు. తెలంగాణ ఉద్యోగుల ‘సమైక్యాంధ్ర’ నినాదాలు చిత్తూరు జిల్లా పీలేరులో తెలంగాణ ప్రాంత అధికారులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేయడంతో వారికి స్థానిక ఉద్యోగులు సన్మానం చేశారు. ఐదురోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ఆయన సతీమణి లావణ్య ప్రకటించారు. చిత్తూరులోని మత్య్సశాఖ కార్యాలయంలో రెండు ప్రభుత్వ వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో రెండున్నర గంటలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. విశాఖ జిల్లా ఏజెన్సీలో వైఎస్సార్ సీపీ సహా వర్తక, వాణిజ్య సంఘాల ఆధ్వర్యంలో దుకాణాలు మూయించారు. మన్యంలోని టూరిస్టు ప్రదేశాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. మ్యూజియం, పద్మావతి గార్డెన్, బొర్రా గుహలు మూతపడ్డాయి. నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైల్‌రోకో చేశారు. కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు పాల్గొన్న నిరసన కార్యక్రమంలో గోపి అనే యువకుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. విభజన వార్తలతో కలత ఒకరి ఆత్మహత్య, నలుగురు గుండెపోటుతో మృతి సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభజన వార్తలను తట్టుకోలేక సోమవారం వేర్వేరు ప్రాంతాలలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు గుండెపోటుతో మరణించగా, ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన కొవ్వూరి రాంబాబు (50), కామవరపుకోట మండలం వీరంపాలెంకు చెందిన బొమ్మగంటి సత్యనారాయణ (63) విభజన వార్తలపై తీవ్ర కలత చెందారు. దీంతో వారు నిద్రలోనే గుండెపోటుతో మరణించారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుమడాం గ్రామానికి చెందిన పొడమచ్చిలి బంగారి(51) టీవీలో విభజన వార్తలు చూస్తుండగా ఉద్వేగానికి గురై గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా.. కొద్దిసేపటికే మృతి చెందారు. రాష్ట్ర విభజనను తట్టుకోలేక అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం గోనబావికి చెందిన వడ్డే కొల్లప్ప (60), అనంతపురం నగరానికి చెందిన శివశంకరరావు(42) గుండెపోటుతో మృతి చెందారు. కాగా, నిడదవోలు మండలం ఉనకరమిల్లిలో రవికుమార్ (35) మూడు రోజులుగా సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నాడు. రాష్ట్ర విభజన ఖాయమనే వార్తల నేపథ్యంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంజనేయులు కుటుంబానికి చెవిరెడ్డి సాయం సమైక్యాంధ్ర కోసం ఆత్మాహుతి చేసుకున్న చిత్తూరు జిల్లా పాకాల మండలం కూనపల్లెకు చెందిన ఆంజనేయులు(48) కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం ఆర్థిక సాయం అందజేశారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చిన ఆయన రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ ఎవరూ బలిదానాలకు పాల్పడవద్దని కోరారు. -
సమైక్య ఉద్యమం ఉధృతం
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంతో సీమాంధ్ర అట్టుడుకుతోంది. ప్రజా, విద్యార్థి సంఘాలు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నాయి, మహిళలూ రోడ్డెక్కి ఉద్యమపథాన సాగుతున్నారు. ఊరూవాడ సమైక్య నినాదం ప్రతిధ్వనిస్తోంది. ఆదివారం పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమంలో కదంతొక్కారు. రాష్ట్రాన్ని విభజించొద్దంటూ అనంతపురంలో ముస్లింలు రోడ్డుపైనే ప్రార్థనలు చేశారు. ఆటో యూనియన్, మినీవ్యాన్, బోర్‌వెల్స్, జేసీబీ ఓనర్ల అసోసియేషన్ల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. టవర్‌క్లాక్, సప్తగిరి, వైఎస్సార్ సర్కిళ్లలో కేసీఆర్, సోనియా శవయాత్రలు, దిష్టిబొమ్మ దహనాలు చేపట్టారు. ఎస్కేయూలో అమరణ నిరాహారదీక్ష చేస్తున్న విద్యార్థి జేఏసీ నాయకులను నందమూరి లక్ష్మీపార్వతి పరామర్శించారు. వీరి దీక్షను రాత్రి 10 గంటలు దాటాక పోలీసులు భగ్నం చేశారు. చిత్తూరులో నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే సీకేబాబు తన దీక్షను మళ్లీ పొడిగించారు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి నిరాహార దీక్ష విరమించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని ఉద్యమకారులు తిరుపతి ఎంపీ చింతామోహన్‌ను కోరినప్పటికీ ఆయన ససేమిరా అని చెప్పారు. చంద్రగిరి రాయలువారి కోటపెకైక్కి ఆందోళనకారులు నిరసన తెలియజేశారు. పర్యాటకులను బయటకు పంపి కోటకు తాళాలు వేశారు. మదనపల్లిలో హిజ్రాలు ఎమ్మెల్యే షాజహాన్ కార్యాలయం ముందు ఆటపాటలతో నిరసన తెలియజేశారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న హిజ్రాలంతా ఉద్యమంలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి డప్పుకొట్టి కూరగాయలు తరిగి వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. రజకులు ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట బట్టలు ఉతికారు. లారీ వర్కర్స్ అసోసియేషన్ వారు లారీలపై కేసీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చెప్పులతో కొడుతూ ర్యాలీ నిర్వహించారు. తోపుడు బండ్లవారు మోకాళ్లపై నిరసన తెలియజేశారు. జర్నలిస్టులు గాంధీ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రెవెన్యూ అసోసియేషన్ వారు సబ్‌కలెక్టర్ కార్యాలయం ముందు వంటావార్పు నిర్వహించారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు జ్యోతి థియేటర్ సర్కిల్లో నడిరోడ్డుపై వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఎస్వీయూలో విద్యార్థుల ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజుకు చేరుకుంది. రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కనువిప్పు కలిగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుమల పట్టణ నేతలు ఆదివారం శ్రీవారికి విన్నవించారు. హుండీలో వినతిపత్రాలు సమర్పించి, అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొరపెట్టుకున్నారు. కడపలో వికలాంగులు ర్యాలీ తీశారు. మైదుకూరులో ఆర్యవైశ్యులు చేపట్టిన రిలే దీక్షల్లో ైఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. కమలాపురంలో చర్చి పాస్టర్లు, క్రైస్తవులు ర్యాలీలు నిర్వహించి మోకాళ్లపై ప్రార్థనలు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీప్రతిభ కళాశాల విద్యార్థులు కర్నూలు రోడ్డుపై రాస్తారోకో చేశారు మార్కాపురంలో ఏపీ ఎన్జీఓలు, బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మార్టూరులో బంద్ నిర్వహించారు. చీరాలలో పొట్టిశ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో ఆదివారం నెల్లూరుకు సమీపంలోని చింతారెడ్డిపాళెం వద్ద హైవేపై రాస్తారోకో నిర్వహించారు. గూడూరులో జర్నలిస్ట్‌లు కళ్లకు గంతలతో నిరసన తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో పనిచేస్తున్న తమ బంధువుల్ని సీమాంధ్రకు వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తుండడాన్ని తట్టుకోలేక గుంటూరు, కోబాల్డ్‌పేటకు చెందిన ఆటోడ్రైవర్ మంచుపల్లి వందనంబాబు (25) శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పురుగుమందు తాగి మృతిచెందాడు. గుంటూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో హిందూ కళాశాల సెంటర్లో భారీ మానవహారం నిర్వహించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు శిఖండిలా మారిన కేసీఆర్ బుద్ధిమారాలని హిజ్రాలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ పోస్టర్లను చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. తెలుగుజాతి ఐక్యతా సమితి ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ధ విద్యార్థులు నిరసన తెలిపారు. విజయవాడలో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్ కార్యాలయం నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న తెలుగుతల్లి విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజమండ్రిలో జరిగిన సమైక్యాంధ్ర సదస్సులో సకల జనుల సహాయ నిరాకరణకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తక్షణం రాజీనామా చేయాలని, లేకపోతే త్వరలో విడుదలయ్యే రామ్‌చరణ్ సినిమాను అడ్డుకుంటామని ఆయన అభిమానులు హెచ్చరించారు. ఈ నెల ఎనిమిదో తేదీ వరకూ విధులు బహిష్కరించాలని ఉభయ గోదావరి జిల్లాల న్యాయవాదుల ఐక్య కార్యాచరణ సమితి తీర్మానించింది. అమలాపురం శివారు ఇందుపల్లి గ్రామస్తులు, బ్రాహ్మణ సంఘం సభ్యులు అమలాపురం వెళ్లి గడియారం స్తంభం సెంటర్లోని ఆలయం వద్ద హోమాలు నిర్వహించారు. పి.గన్నవరం నియోజకవర్గం నగరంలో ఓఎన్జీసీ గ్యాస్ కలెక్షన్ సెంటర్, రిఫైనరీల నుంచి ఉత్పత్తుల తరలింపును ఆందోళనకారులు అడ్డుకున్నారు. కాగా సీతానగరం, గోకవరంలలో మంత్రి తోట నరసింహాన్ని ఘెరావ్ చేశారు. సీతానగరంలో టీడీపీకి చెందిన రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, మంత్రి తోటకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మండపేట నియోజకవర్గం కేశవరం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ చంద్రమళ్ల వీరేంద్ర (23) రాష్ట్ర విభజన ప్రతిపాదన తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరంలో సమైక్యవాదులు ముగ్గురు శిరోముండనం చేయించుకుని ఒంటినిండా జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు రాసుకుని నిరసన తెలిపారు. కర్నూలు జిల్లాలో జర్నలిస్టులు ర్యాలీలు తీశారు. కర్నూలులో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, వికలాంగులు, అంధులు, బధిరులు నిరసన వ్యక్తం చేశారు. రజక సంఘం ఆధ్వర్యంలో గాడిదలకు నాయకుల చిత్రపటాలు తగిలించి ఊరేగించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈనెల 6న హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిని దిగ్బంధించనున్నట్లు వైఎస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలో యూత్‌కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో ఆందోళనకారులు బస్సు అద్దాల్ని పగలగొట్టారు. ఉత్తరాంధ్ర టెక్నికల్ జేఏసీ ఏర్పాటైంది. దువ్వాడలో, ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఆందోళనకారులు రైళ్లు నిలిపివేశారు. ఏయూలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థుల ఆరోగ్యం మరింత క్షీణించడంతో వారిని కేజీహెచ్‌కు తరలించారు. అయితే మరికొందరు విద్యార్థులు రిలే నిరాహారదీక్షలు మొదలెట్టారు. పశ్చిమగోదావరి జిల్లా తాడిపూడిలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కేబుల్ ఆపరేటర్లు వినోదచానళ్ల ప్రసారాలను నిలిపివేశారు. పోలవరంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దెందులూరు మండలం శ్రీరామవరం గంగానమ్మ ఆలయంలో మహిళలు 1,008 బిందెలతో అభిషేకం చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. నరసన్నపేటలో విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీయగా, ఎచ్చెర్లలో డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. గోదావరి జిల్లాల న్యాయవాదుల ఫిర్యాదు మేరకు రాజమండ్రి త్రీటౌన్ పీఎస్‌లో కేసీఆర్‌పై కేసు నమోదు చేశారు. -
రెండో రోజు కూడా కోనసాగుతున్న నిరసనలు
-
నేడు సీమాంద్ర బంద్‌కు జేఏసీ పిలుపు