గుండెపోటుతో ఒక్కరోజే 12 మంది మృత్యువాత | 12 people died with heartbreak due to state division | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ఒక్కరోజే 12 మంది మృత్యువాత

Published Sun, Aug 11 2013 12:41 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

12 people died with heartbreak due to state division

సాక్షి నెట్‌వర్క్:  రాష్ట్రం ముక్కలవుతుందనే భయంతో సీమాంధ్రజిల్లాల్లో మృత్యుఘంటికలు మోగుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయంతో మనస్తాపానికి గురై శనివారం ఒక్కరోజే 12 మంది గుండెపోటుతో మరణించారు. పశ్చిమగోదావరి జిల్లాలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. నిడదవోలుకు చెందిన లారీ డ్రైవర్ బడుగు శంకరుడు (42), నరసాపురానికి చెందిన హోంనీడ్స్ ఏజెన్సీ యజమాని ప్రత్తి శ్రీనివాస్ (46), నరసాపురం మండలం దర్భరేవు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ యడ్ల నాగేశ్వరరావు (54)గుండె ఆగి చనిపోయారు.
 
 పెరవలి మండలం ముక్కామలకు చెందిన యాండ్ర రంగారావు (31), గోపాలపురానికి చెందిన డేవిడ్‌రాజు (53), ఉండి మండలం మహదేవపట్నానికి చెందిన జల్లి సహదేవుడు (35) గుండెపోటుతో మరణించారు. అదేవిధంగా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని రామళ్లకోట గ్రామానికి చెందిన ఏపూరి రమణ (41), రత్నపల్లెకు చెందిన నారాయణ (52), అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో ఆర్‌ఎంపీ వైద్యుడు కృష్ణ (42), గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన తూమాటి నాగయ్య (45), చిత్తూరు జిల్లా కలకడవుండలం ఎర్రకోటపల్లె గ్రావూనికి చెందిన ఎం.వెంక ట్రావుయ్యు(60), తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన బెల్లంకొండ సీతారత్నం(55) గుండెపోటుతో శనివారం మృత్యువాత పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement