రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. రైల్‌రోకోకు సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
విశాఖపట్నంలో రైల్‌రోకోకు ప్రయత్నించిన సమైక్యవాదులను అరెస్టు చేశారు. రైల్వే స్టేషన్ వద్ద భారి పోలీస్ బందోబస్తు పెట్టారు.
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట రైల్వేస్టేషన్‌లో సమైక్యవాదులు రైల్‌రోకో చేపట్టనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గుంటూరులో నిరాహారదీక్ష చేసేందుకు సిద్దమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డిను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా టెంట్ తొలిగించారు.
చిత్తూరు జిల్లాలో 12వ రోజు కొనసాగుతున్న బంద్ కొనసాగుతోంది. దుకాణాలు ఇంకా తెరుచుకోలేదు.
విశాఖపట్నంలో సమైక్యవాదుల అరెస్ట్
Published Sun, Aug 11 2013 9:23 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM
Advertisement
Advertisement