Rail roko
-
హైకోర్టులో మాజీ సీఎం సీఎం కేసీఆర్‌కు ఊరట...
-
Farmers Protest: ‘రైల్‌రోకో’కు దిగిన రైతులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఛలో నిరసన మార్చ్‌లో భాగంగా నాలుగు గంటల పాటు నిర్వహించే రైతుల రైల్‌రోకో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. ఇందులో భాగంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌తో పాటు హర్యానాలోని పలు ప్రాంతాల్లో రైతులు రైల్‌రోకోకు దిగారు. సాయంత్రం 4 గంటల వరకు రైల్‌రోకో జరగనుంది. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సంయుక్తంగా రైల్‌రోకోకు పిలుపునిచ్చాయి. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) సహా తమ ఇతర డిమాండ్లను కేంద్రం ఆమోదించాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. #WATCH | Punjab: Farmers organisations hold 'Rail Roko' protest, in Amritsar. pic.twitter.com/kqmSYjd1z9 — ANI (@ANI) March 10, 2024 రైల్‌రోకోలో భాగంగా వందలాది మంది రైతులు రైల్వే ట్రాక్‌లపై కూర్చొని నిరసన తెలుపుతారని కిసాన్ మజ్దూర్ మోర్చా సర్వన్ సింగ్ పందేర్ చెప్పారు. రైతులు చేపట్టిన రైల్‌రోకో కార్యక్రమంతో పంజాబ్, హర్యానాల్లో 60 చోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. మరోవైపు మార్చ్ 6వ తేదీ నుంచి రైతులు చేపట్టిన ‘ఢిల్లీ ఛలో’ ర్యాలీ కొనసాగుతుండటంతో ఢిల్లీ సరిహద్దుల వద్ద పోలీసులు భద్రత పెంచారు. హర్యానాలోని అంబాల జిల్లాలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఫిబ్రవరిలో రైతులు ఢిల్లీ ఛలో నిరసన ర్యాలీ చేపట్టిన సందర్భంగా వారితో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. పలు పంటలకు ఐదేళ్లపాటు మద్దతు ధర ఇస్తామని ఈ చర్చల్లో కేంద్రం ప్రతిపాదించింది. కేంద్రం తీసుకువచ్చిన ఈ ప్రతిపాదన రైతులకు నచ్చకపోవడంతో వారు ఢిల్లీ ఛలో నిరసన ర్యాలీని మళ్లీ పునరుద్ధరించారు. ఇందులో భాగంగా రాస్తారోకోలు, రైల్‌రోకోలకు పిలుపునిచ్చి దశల వారిగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదీ చదవండి.. హిట్లర్ అధికారం పదేళ్లకే ముగిసింది -
ఎస్టీ హోదా కోసం దేశవ్యాప్తంగా కుర్మీల ఆందోళన!
కోల్‌కతా/బరిపడ/రాంచీ: తమకు షెడ్యూల్ తెగ(ఎస్టీ) హోదా కల్పించాలని, కుర్మాలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలంటూ మంగళవారం కుర్మీలు చేపట్టిన ఆందోళనలతో బెంగాల్, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు రైలు పట్టాలపై బైఠాయించడంతో ఆగ్నేయ రైల్వే 18 రైళ్లను రద్దు చేసింది. మరో 13 రైళ్లను వేరే మార్గాల్లోకి మళ్లించి, 11 రైళ్ల గమ్యస్థానాన్ని కుదించింది. ఆందోళన కారులు పురులియా వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. పొరుగునే ఉన్న ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో కూడా కుర్మీలు రైల్ రోకోలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: జనరల్ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్: కేంద్రం -
బొగ్గు సరఫరా రైళ్లకు బ్రేక్.. కలకలం
న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండకు నిరసనగా రైతు సంఘాలు సోమవారం చేపట్టిన రైల్ రోకో కారణంగా దేశవ్యాప్తంగా 293 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. 150 గూడ్స్ రైళ్లకు ఆటంకం ఏర్పడగా వీటిలో 75 వరకు విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేస్తున్న రైళ్లు ఉన్నట్టు సమాచారం. బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం తలెత్తనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో గూడ్స్ రైళ్లు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండకు బాధ్యుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నేడు రైల్ రోకోకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైలు పట్టాలపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పంజాబ్‌లోని ఫిరోజిపూర్ డివిజన్లోని నాలుగు రైల్వే విభాగాలు రైతుల ఆందోళనతో స్తంభించాయని అధికారులు తెలిపారు. ఫిరోజ్‌పూర్ నగరంలోని ఫిరోజ్‌పూర్-ఫాజిల్కా విభాగం, మొగాలోని అజిత్వాల్ వద్ద ఉన్న ఫిరోజ్‌పూర్-లూధియానా విభాగంపై నిరసనల ప్రభావం పడిందని వెల్లడించారు. మిశ్రాను అరెస్ట్ చేసే వరకు విశ్రమించం: తికాయత్ 'రైల్ రోకో' ఆందోళన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని, తదుపరి వ్యూహం కోసం ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తామని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ తెలిపారు. లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండకు బాధ్యుడైన అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించి, అరెస్ట్ చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిందితుడిగా ఉన్న అజయ్ మిశ్రాకు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని, కేంద్రం ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన నిర్దోషిగా తేలితే మళ్లీ మంత్రి కట్టబెట్టుకోవచ్చని తికాయత్ అన్నారు. (చదవండి: హత్య కేసులో డేరాబాబాకు జీవిత ఖైదు) -
రైతుల రైల్ రోకో.. ‘అజయ్ మిశ్రా రాజీనామా చేయాల్సిందే’
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం మరింత తీవ్రతరమైంది. లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండను నిరసిస్తూ, దానికి బాధ్యుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు సోమవారం నాడు రైల్ రోకో చేపట్టాయి. దేశవ్యాప్తంగా కొనసాగనున్న రైల్ రోకో వల్ల 30 ప్రాంతాల్లో రైల్ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఉత్తర రైల్వే జోన్లో ఎనిమిది రైళ్లు నియంత్రించబడుతున్నాయని ఉత్తర రైల్వే సీఆర్పీఓ సోమవారం తెలిపింది. (చదవండి: లోతైన హృదయం ఉన్న నాయకుడి మాటలివీ) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎక్కడిక్కడే రైళ్లను అడ్డుకుంటామని రైతు సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. యూపీలోని లఖీంపూర్ జిల్లాలో రైతులపై హింస, ఆ ఘటనలో ప్రధాన నిందితుడైన ఆశిష్ మిశ్రా తండ్రి అజయ్ మిశ్రా ఇప్పటికీ కేంద్ర మంత్రి పదవిలోనే కొనసాగుతుండటాన్ని నిరసిస్తూ రైతు సంఘాల సమాఖ్య సంయుక్త్ కిసాన్ మోర్ఛా సోమవారం నాడు దేశ వ్యాప్త రైల్ రోకో చేపట్టింది. (చదవండి: నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు?) ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు రైల్ రోకో ఉంటుందని, అన్ని రాష్ట్రాల్లో స్థానిక రైతు సంఘాలు ఆ ఆరు గంటలపాటు రైలు పట్టాలపైనే నిరసనలు తెలుపుతారని కిసాన్ మోర్ఛా తెలిపింది. లఖీంపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో న్యాయం జరిగేవరకు పోరాడతామని సంయుక్త్ కిసాన్ మోర్చా తెలిపింది. చదవండి: Lakhimpur Kheri Violence: ‘ఒక్క ఆధారం చూపినా రాజీనామా చేస్తా’ Punjab: Farm law protestors sit on the railway track at Devi Dasspura village in Amritsar following the farmer's union call for 'Rail Roko Andolan' today pic.twitter.com/lQrKImJKso — ANI (@ANI) October 18, 2021 -
రైతుల రైల్ రోకో
న్యూఢిల్లీ/హిసార్: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు గురువారం నాలుగు గంటలపాటు రైల్ రోకో చేపట్టాయి. ఆందోళనలతో రైలు సర్వీసులపై కొద్దిపాటి ప్రభావమే పడిందని రైల్వేశాఖ తెలిపింది. కొన్ని రైళ్లను ముందు జాగ్రత్తగా రైల్వేస్టేషన్లలోనే నిలిపివేసినట్లు వెల్లడించింది. పంజాబ్, హరియాణాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు రైలు పట్టాలపై బైఠాయించడంతో కొన్ని మార్గాల్లో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ అక్కడక్కడా ఆందోళనలు జరిగాయి. చాలా వరకు రాష్ట్రాల్లో రైల్ రోకో ప్రభావం నామమాత్రంగా కనిపించింది. దేశవ్యాప్త రైల్ రోకోకు భారీగా స్పందన లభించినట్లు ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రకటించింది. మోదీ ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక వంటిదని వ్యాఖ్యానించింది. డిమాండ్లు సాధించేదాకా పోరాటం కొనసాగించేందుకు రైతులు కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపింది. అవాంఛనీయ ఘటనలు లేవు ‘రైల్ రోకో సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలపై రైల్ రోకో ప్రభావం కొన్ని చోట్ల నామమాత్రం, మరికొన్ని చోట్ల అస్సలు లేనేలేదు. సాయంత్రం 4 గంటల తర్వాత రైళ్లు యథావిధిగా నడిచాయి’ అని రైల్వే శాఖ ప్రతినిధి తెలిపారు. రైల్ రోకో నేపథ్యంలో ముందుగానే రైల్వే శాఖ 25 రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించింది. ముందు జాగ్రత్తగా ముఖ్యంగా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్లో 20 కంపెనీల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను మోహరించింది. హరియాణాలోని అంబాలా, కురుక్షేత్ర, చర్ఖిదాద్రి రైల్వేస్టేషన్లలో రైతులు పట్టాలపై బైఠాయించారని రైల్వే శాఖ వెల్లడించింది.పంజాబ్‌లో ఢిల్లీ–లూధియానా–అమృత్సర్ మార్గం, జలంధర్–జమ్మూ మార్గాల్లోని పట్టాలపై రైతులు కూర్చున్నారు. రాజస్తాన్‌లో రెవారీ–శ్రీగంగానగర్ స్పెషల్ రైలును మాత్రమే ఆందోళనల కారణంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. మీ పంటలను త్యాగం చేయండి: తికాయత్ చట్టాలను వాపసు తీసుకునే వరకు రైతులు ఇళ్లకు తిరిగి వెళ్లబోరని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. చేతికి వచ్చే దశలో ఉన్న పంటను త్యాగం చేసేందుకు సిద్ధం కావాలన్నారు. ‘పంటకు నిప్పు పెట్టాల్సిన అవసరం వచ్చినా అందుకు మీరు సిద్ధంగా ఉండాలి. పంటలు కోతకు రానున్నందున రైతులు ఆందోళనలను విరమించి ఇళ్లకు వెళ్లిపోతారని ప్రభుత్వం భావించరాదు’అని తెలిపారు. ఆందోళనలను ఉధృతం చేయాలంటూ రైతు సంఘాలు ఇచ్చే పిలుపునకు సిద్ధంగా ఉండాలన్నారు. ‘మీ ట్రాక్టర్లలో ఇంధనం నిండుగా నింపి, ఢిల్లీ వైపు తిప్పి సిద్ధంగా ఉంచండి. రైతు సంఘాల కమిటీ నుంచి ఏ సమయంలోనైనా పిలుపు రావచ్చు’అని చెప్పారు. ఈ దఫా ఢిల్లీలో చేపట్టే ట్రాక్టర్ ర్యాలీలకు వ్యవసాయ పనిముట్లు కూడా తీసుకురావాలని రైతులను కోరారు. -
వ్యవసాయ బిల్లులపై నిరసనలు
చండీగఢ్/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై రైతన్నలు భగ్గుమన్నారు. తమకు నష్టదాయకమైన ఈ బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ప్రధానంగా పంజాబ్, హరియాణా రాష్ట్రాలు శుక్రవారం అన్నదాతల ఆందోళనలతో అట్టుడికిపోయాయి. దేశవ్యాప్త బంద్‌లో భాగంగా రైతులు ఎక్కడికక్కడ వీధుల్లోకి వచ్చారు. రహదారులను దిగ్బంధించారు. వ్యవసాయ బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకూ తాము పోరాటం ఆపే ప్రసక్తే లేదని నినదించారు. రైతుల నిరసనలతో పంజాబ్, హరియాణాలో జనం రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. గురువారం ప్రారంభమైన రైలు రోకో రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. రైతులు రైలు పట్టాలపై బైఠాయించారు. వ్యవసాయ బిల్లులపై రైతుల ఉద్యమానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ బంద్‌కు మద్దతునిచ్చాయి. ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ రాష్ట్రంలో పలుచోట్ల రోడ్ల దిగ్బంధం చేపట్టింది. వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బిల్లులతో రైతులను బానిసలుగా మారుస్తారా? అని నిలదీసింది. కనీస మద్దతు ధరను రైతుల నుంచి దూరం చేయడం ఏమిటని ప్రశ్నించింది. వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించింది. -
25న షట్డౌన్కు రైతు సంఘాల పిలుపు
అమృత్సర్ : వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించిన నేపథ్యంలో పంజాబ్, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈనెల 25న పంజాబ్ షట్డౌన్కు 31 రైతు సంఘాలు పిలుపు ఇచ్చాయి. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ అమృత్‌సర్‌లో రైలు పట్టాలపై కూర్చుని రైల్ రోకో ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. అమృత్‌సర్‌తో పాటు ఫిరోజ్‌పూర్‌లోనూ రైతులు రైల్ రోకోలో పాల్గొని రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని, బిల్లులకు అనుకూలంగా ఓటు వేసిన వారిని బాయ్‌కాట్ చేయాలని రైతు సంఘాల నేతలు పిలుపు ఇచ్చారు. బర్నాలా, సంగ్రూర్‌లో భారతీయ కిసాన్ యూనియన్ కార్యకర్తలు రైలు పట్టాలపై ఆందోళన చేపట్టారు. ఇక రైతుల ఆందోళనతో ప్రత్యేక రైళ్లను రైల్వేలు రద్దు చేశాయి. మూడు రోజుల పాటు 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్టు రైల్వేలు ప్రకటించాయి. ప్రయాణీకుల భద్రత, రైల్వే ఆస్తుల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. కాగా వ్యవసాయ బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందడంతో కనీస మద్దతు ధర వ్యవస్ధ కుప్పకూలుతుందని, బడా కార్పొరేట్ వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై తాము ఆధారపడాల్సి వస్తుందనే భయం పంజాబ్ రైతులను వెంటాడుతోంది. మరోవైపు వ్యవసాయ బిల్లులతో రైతాంగానికి మేలు జరుగుతుందని, కనీస మద్దతు ధర విధానం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తోంది. చదవండి : బిల్లులపై రైతుల ఆందోళన ఎందుకు ?! -
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు..
పుత్తూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నిరసన సెగ దేశ రాజధాని ఢిల్లీని తాకాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎన్ ఏలుమలై పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పుత్తూరు రైల్వేస్టేషన్లో రైల్‌రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ప్రాణాలకు తెగించి నిరాహారదీక్ష చేస్తుండడం గర్వకారణమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించాలని తొలి నుంచి పోరాటం చేస్తున్నది ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. నాలుగేళ్లు ప్యాకేజీ పాట పాడి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం నాలుగేళ్లుగా ప్యాకేజీ పాట పాడి ఇప్పుడు హోదా కావాలని అడగడం విడ్డూరంగా ఉందని ఏలుమలై స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఉన్న లోపాయికారి ఒప్పందం కారణంగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన కారణమన్నారు. అంతకుమునుపు స్థానిక బజారువీధిలోని శక్తిగణపతి ఆలయం నుంచి కార్యకర్తలతో కలిసి రైల్వేస్టేషన్ వద్దకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు ర్యాలీగా వచ్చారు. అనంతరం స్టేషన్ ఎదుట ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నై నుంచి తిరుపతి వెళుతున్న మెమో ప్యాసింజర్‌ను అడ్డుకున్నారు. ఇంజిన్ వద్ద అడ్డంగా నిలబడి ప్రత్యేకహోదా ప్రకటించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐ కొండయ్య, ఎస్ఐ హనుమంతప్ప, రైల్వే పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డీసీసీబీ డైరెక్టర్ దిలీప్‌రెడ్డి, వడమాలపేట జెడ్పీటీసీ సభ్యులు సురేష్‌రాజు, నాయకులు రవిశేఖర్‌రాజు, ప్రతాప్, రెడ్డివారి భాస్కర్‌రెడ్డి, బాబూరావ్‌గౌడ్, వైఎస్సార్సీపీ మైనార్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎం మాహీన్, కంచి సుబ్రమణ్యం, నారాయణరెడ్డి, గోవిందస్వామిరెడ్డి, లారీమోహన్,గుణ, మురుగేష్, సంపత్, భాస్కరయ్య, గణేష్, రవి, జేసీబీ బాబు, బైపాస్‌రాజా, దొరస్వామిరెడ్డి, మురళిరాజు, తడుకు బాలాజీ, గూళూరు కరుణ పాల్గొన్నారు. ప్రాణాలను పణంగా పెట్టిన ఎంపీలు.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ప్రత్యేకహోదా సాధించే క్రమంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ 5 మంది ఎంపీలు ప్రాణాలను పణంగా పెట్టి చేస్తున్న పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని వైఎస్సార్సీపీ సత్యవేడు సమన్వయకర్త కోనేటి ఆదిమూలం అభిప్రాయపడ్డారు. బుధవారం పుత్తూరులో నిర్వహించిన రైల్‌రోకోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహాన్ని ఢిల్లీకి తెలియజెప్పేందుకే రైల్‌రోకో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
పట్టాలపై హోదాగ్ని
సాక్షి, నెట్వర్క్: ప్రత్యేక హోదా పోరు రోజురోజుకూ ఉధృత రూపం దాల్చుతోంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి. ఉద్యమ సెగ రైళ్లనూ తాకింది. అన్ని జిల్లాల్లోనూ ప్రజలు, వివిధ సంఘాల నాయకులు, వైఎస్సార్సీపీ నేతలు తరలివచ్చి రైల్‌రోకోలు నిర్వహించారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ విశ్రమించబోమని ప్రతినబూనారు. హోదా మా హక్కు అంటూ పెద్ద ఎత్తున నినదించారు. మరోవైపు ఉద్యమానికి మద్దతుగా నిలవాల్సిన టీడీపీ ప్రభుత్వం ఆందోళనకారులపైకి పోలీసులను ఉసిగొల్పింది. దీంతో అన్ని జిల్లాల్లోనూ ఆందోళనకారులపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. లాఠీలు ఝుళిపించారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చేశారు. విజయవాడలో రైల్ రోకోకు వెళ్తున్న ఎమ్మెల్యే రక్షణనిధి, పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెలంపల్లి, జోగి రమేశ్‌లను అడ్డుకుంటున్న పోలీసులు ప్రకాశం జిల్లాలో విరుచుకుపడిన పోలీసులు.. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు రైల్వేస్టేషన్లో ఆందోళనకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు. అయినా కూడా వైఎస్సార్సీపీ శ్రేణులు వెరవకుండా స్టేషన్ లోపలికి ప్రవేశించి ఆందోళనకు దిగారు. పట్టాలపై కూర్చొని నాందేడ్ రైలును అడ్డుకున్నారు. ఇంతలో అక్కడకు చేరకున్న పోలీసులు బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఐ.వి.రెడ్డి, వరికూటి అశోక్‌బాబు, రామనాథం, గరటయ్య, మాధవరావు, ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ తదితరులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. నేతలను స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్లే క్రమంలో వరికూటి అశోక్‌బాబును ఓ ఎస్సై చేయి పట్టుకొని బలంగా లాగాడు. స్టేషన్ బయట వరకూ దౌర్జన్యంగా నెట్టుకుంటూ వెళ్లి వాహనంలోకి అశోక్‌ను తోసివేశారు. బాలినేని మాట్లాడుతూ.. హోదా కోసం ఉద్యమిస్తున్న నాయకులపై పోలీసులను ఉసిగొల్పుతారా? అని చంద్రబాబును నిలదీశారు. ఇదేనా మీ చిత్తశుద్ధి అంటూ మండిపడ్డారు. కాగా, రైల్‌రోకోకు సంబంధించి ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్, నేతలు అశోక్‌బాబు, శింగరాజుతో పాటు మరో 200 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్సార్సీపీ నేతలు మేరుగ నాగార్జున, అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో రైల్‌రోకో విజయవంతమైంది. గుంటూరు నగరంలో రైల్‌రోకో నిర్వహించేందుకు వెళ్తున్న లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో తలపెట్టిన రైల్‌రోకోను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే రక్షణనిధి, నేతలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, బొప్పన భవకుమార్, జోగి రమేశ్‌ను ముందుగానే అరెస్ట్ చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ పోలీసులు జులుం ప్రదర్శించారు. నెల్లూరు స్టేషన్లోకి వెళ్లనివ్వకుండా పోలీసులు మోహరించారు. దీంతో ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. స్టేషన్ బయటే ధర్నాకు దిగారు. వెంకటగిరి, పడుగుపాడు, గూడూరు తదితర నియోజకవర్గాల్లో రైల్‌రోకోలు విజయవంతమయ్యాయి. హోదా నినాదంతో దద్దరిల్లిన రైల్వేస్టేషన్లు.. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, సామర్లకోట రైల్వేస్టేషన్లు హోదా నినాదంతో మార్మోగాయి. పార్టీ నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, కన్నబాబు, మోషేన్‌రాజు, రౌతు సూర్యప్రకాశరావు తదితరుల ఆధ్వర్యంలో శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పార్టీ నేతలు గ్రంథి శ్రీనివాస్, ప్రసాదరాజు, మేకా శేషుబాబు తదితరులు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకొని ఆందోళనకు దిగారు. ఏలూరు పవర్‌పేట స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన ఎమ్మెల్సీ ఆళ్ల నాని, తెల్లం బాలరాజు, కొఠారు రామచంద్రరావును అరెస్టు చేశారు. ఇక ఎమ్మెల్సీ కోలగట్ల, ఎమ్మెల్యేలు రాజన్నదొర, పుష్పశ్రీవాణి తదితరుల నేతృత్వంలో వందలాది మంది విజయనగరం స్టేషన్లోకి చొచ్చుకెళ్లి పట్టాలపై బైఠాయించారు. శ్రీకాకుళం జంక్షన్ రైల్వేస్టేషన్లో ఆందోళనపై పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు యత్నించారు. నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి మాట్లాడుతూ చంద్రబాబు.. హోదా పోరాటాన్ని అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే కంబాల జోగులు తదితరుల నేతృత్వంలో ఆందోళనలు జరిగాయి. విశాఖ స్టేషన్లో పోలీసులు, ఆర్పీఎఫ్ బృందాలు మోహరించడంతో ఉద్రిక్తత తలెత్తింది. అయినా కూడా పార్టీ నేతలు లోపలికి దూసుకెళ్లి పాసింజర్ రైలును అడ్డుకున్నారు. మళ్ల విజయప్రసాద్, విజయ్‌కుమార్, గుడివాడ అమర్నాథ్ రైలు ఇంజన్ పైకెక్కి నిరసన తెలిపారు. అనకాపల్లి, అరకులోనూ రైల్‌రోకోలు విజయవంతమయ్యాయి. ఒంగోలులో... పోలీసులతో ఉద్యమాన్ని అణిచివేస్తారా..? చిత్తూరు జిల్లాలోని రేణిగుంట రైల్వేస్టేషన్లో వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైల్‌రోకో జరిగింది. బరంపూర్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అడ్డంగా బైఠాయించి హోదా నినాదాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కాగా, చిత్తూరులో యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను ఆ పార్టీ నేత ఎన్.పద్మజ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. వైఎస్సార్ జిల్లా కడప రైల్వేస్టేషన్లో ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, మేయర్ సురేశ్‌బాబు ఆందోళనకు దిగి చెన్నై ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలును అడ్డుకున్నారు. రైల్‌రోకోల్లో ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రఘురామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలోనూ రైల్రోకోలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. కర్నూలు రైల్వేస్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే ఐజయ్య, నేతలు బీవై రామయ్య, హఫీజ్‌ఖాన్ తదితరులను పోలీసులు ప్లాట్‌ఫాం నుంచి బయటకు తోసుకొచ్చారు. నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డితో పాటు పలువురిని పోలీసులు స్టేషన్ బయటే అడ్డుకుని అరెస్టు చేశారు. కోట్ల హాల్ట్‌లో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లాలో రైల్‌రోకో విజయవంతమైంది. ‘అనంత’ స్టేషన్లో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, నేతలు కాపు రామచంద్రారెడ్డి తదితరులు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు. గుంతకల్లు, గుత్తి, కదిరి రైల్వేస్టేషన్లలో కర్ణాటక ఎక్స్‌ప్రెస్, చెన్నై మెయిల్‌ను అడ్డగించారు. నిరసనల్లో నేతలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తలారి పీడీ రంగయ్య, కిష్టప్ప, రాగే పరుశురాం, శంకరనారాయణ పాల్గొన్నారు. కర్నూలులో... -
నెల్లూరులో ఉద్రిక్తంగా మారిన వైఎస్సార్సీపీ నేతల రైల్‌రోకో
-
గుంటూరులో వైఎస్సార్సీపీ నేతల రైల్‌రోకో
-
కర్నూలులో వైఎస్సార్సీపీ నేతల రైల్‌రోకో
-
సామర్లకోటలో వైఎస్సార్సీపీ నేతల రైల్‌రోకో
-
ఏలూరులో ఉద్రిక్తంగా మారిన రైల్‌రోకో
-
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ రైలు రోకోలు
సాక్షి, నెట్వర్క్: ప్రత్యేక హోదా పోరు ఉధృత రూపం దాల్చింది. హోదా సాధనే ధ్యేయంగా ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఢిల్లీలోని ఏపీభవన్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన వైఎస్సార్సీపీ నేతలకు సంఘీభావంగా బుధవారం ఉదయం నుంచే వైఎస్సారీపీ శ్రేణులు రైల్ రోకో చేపట్టాయి. అన్నిజిల్లాల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులతోపాటు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిన్న జాతీయ రహదారులను దిగ్బంధించిన సంగతి తెల్సిందే. మంగళవారం ఎక్కడికక్కడ రహదారులపై మానవహారాలు, వంటావార్పు, భిక్షాటన, బైక్ ర్యాలీలు తదితర రూపాల్లో తమ నిరసన తెలియజేసిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం రైలు రోకోకు దిగారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని కొంతమందిని చెదరగొట్టారు. ఏపీలో రైల్వేస్టేషన్లు ప్రత్యేక హోదా నినాదాలతో దద్దరిల్లిపోతున్నాయి. అనంతపురం జిల్లా ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతుగా జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు రైల్ రోకోలో పాల్గొన్నాయి. గుంతకల్లు వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్ది ఆధ్వర్యంలో గుంతకల్లు రైల్వే స్టేషన్లో కర్నాటక ఎక్స్‌ప్రెస్ నిలివేత. అరగంట పాటు రైలు నిలిపి నిరసన తెలిపిన వైఎస్సార్సీపీ నేతలు. అలాగే అనంతపురం, గుత్తి రైల్వేస్టేషన్లలో కూడా రైల్ రోకో నిర్వహించారు. అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. పూలే విగ్రహానికి నివాళి అర్పించిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి, అనంతపురం సమన్వయకర్త నదీం అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగేపరశురాం. వైఎస్సార్సీపీ ఎంపీలు చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా ఉరవకొండలో ఐదోరోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఏపీ భవన్ లో వైస్సార్సీసీపీ ఎంపీలు చేపట్టిన సమర దీక్షకు మద్దతుగా గుంతకల్లు నియోజకవర్గ సమన్వయ కర్త వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో గుత్తిలో రైల్ రోకో. చెన్నైనుంచి ముంబై వెళ్తున్న రైలును అడ్డుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు. ఆందోళన కారులను చెదరగొట్టిన రైల్వే పోలీసులు. ప్రత్యేక హోదా నినాదాలతో గుత్తి రైల్వే స్టేషన్‌ను వైఎస్సార్సీపీ కార్యకర్తలు హోరెత్తించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేసిన నినాదాలతో రైల్వే స్టేషన్ దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు విద్యార్థి సంఘాలు , ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టిన రైల్ రోకో ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్సీపీనేత భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌కు భారీగా చేరుకున్న శ్రేణులు ప్రత్యేక హోదా నినాదాలతో హోరెత్తించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేశారు. రైళ్లను వెళ్లకుండా పట్టాలపై పడుకుని తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో రైల్వే పోలీసులు సంఘటానాస్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్నవారిని నిలువరించారు. నెల్లూరు జిల్లా ప్రత్యేక హోదా కోరుతూ ఆమరణ దీక్షకు దిగిన ఎంపీలకు మద్ధతుగా వెంకటగిరిలో జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు రైల్ రోకోకు దిగారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు ఢిల్లీ బాబు, నెమల్లపూడి సురేశ్ రెడ్డి, చిట్టెటి హరి కృష్ణ, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరులో వైఎస్సార్సీప చేపట్టిన రైల్‌రోకోను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, కార్యకర్తలు స్టేషన్ బయటికి వచ్చి రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ప్రత్యేక హోదా కోసం మద్దతు తెలుపుతూ తాడేపల్లిగూడెంలోని పోలీసు ఐల్యాండ్ వద్ద తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ప్రత్యేక హోదాసాధనకై రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీలకు మద్ధతుగా నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో నరసాపురం అంబేద్కర్ సెంటర్లో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం వైస్సార్సీపీ ఎంపీల ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఎంపీల దీక్షకు మద్ధతుగా ఏలూరు పవర్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద చేపట్టిన రైల్‌రోకోలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైల్ రోకో చేస్తోన్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు, నాయకులు రైల్వే స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన కొనసాగించారు. ఆందోళనకారులను బలవంతంగా పోలీసులు ఈడ్చుకెళ్లారు. అనంతరం అరెస్ట్ చేసి ఏలూరు టూటౌన్, త్రీటౌన్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ ఆందోళనలో ఎమ్మెల్సీ ఆళ్లనాని, సమన్వయకర్తలు తెల్లంబాలరాజు, ఎలీజా, మధ్యాహ్నాపు ఈశ్వరి, కొఠారు రామచంద్రరావు, బొద్దాని శ్రీనివాస్, కార్యకర్తలు తదీతరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీల ఆమరణ దీక్షకు మద్ధతుగా వైఎస్సార్సీపీ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమవరంలో రైల్‌రోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంటు అధ్యక్షుడు ముదినూరి ప్రసాద్ రాజు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, కొట్టు సత్యానారాయణ, గుణ్ణం నాగబాబు, పీవీఎల్ నరసింహరాజు, కవురు శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీల ఆమరణ దీక్షకు మద్ధతుగా పార్టీ సమన్వయకర్త మేరగ మురళీధర్ ఆధ్వర్యంలో గూడూరులో రైల్‌రోకో నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో రైల్వే స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్షకు మద్ధతుగా ఐదు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న రాజమండ్రి రూరల్ నియోజక వర్గ సమన్వయ కర్త గిరిజాల బాబు ఆరోగ్యం క్షీణించింది. రాజమండ్రిలో రైల్వేస్టేషన్లో వైఎస్సార్సీపీ నేతలు రైల్ రోకో నిర్వహించారు. సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి నిరసన వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ నేతలు. ఈ కార్యక్రమంలో మోషెన్‌రాజు, కందుల దుర్గేష్; రౌతు సూర్య ప్రకాశ్ రావు, జక్కంపూడి విజయలక్ష్మి, తానేటి వనిత, కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సామర్లకోట రైల్వేస్టేషన్లో వైఎస్సార్సీపీ నేతలు రైల్‌రోకో నిర్వహించారు. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేసి నిరసన వ్యక్తం చేసిన నేతలు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం కోఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు, పిఠాపురం కోఆర్డినేటర్ పెండెం దొరబాబు, జగ్గంపేట కోఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీల ఆమరణ దీక్షకు మద్ధతుగా విస్సన్నపేట మండల పార్టీ కన్వీనర్ భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో ఎంపీపీ భూక్యా రాణి, నెక్కళపు కుటుంబరావు, వైస్ ఎంపీపీ దుర్గారావు, డి.సిరసాని ప్రకాష్, జాఫర్ బాబా, సీతా రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావుపూలె జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు జంగా కృష్ణ మూర్తి, ఎమ్మెల్యే రక్షణ నిథి, మాజీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్, కార్పొరేటర్లు, తదీతరులు పాల్గొన్నారు.అనంతరం వైఎస్సార్సీపీ ఎంపీలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్ధతుగా చేపట్టిన ఆందోళనల్లో వీరు పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఎంపీలు చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా బద్వేలులో ఎంఎల్సీ డీసీ గోవింద రెడ్డి, పార్టీ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్య౦లో ఐదవ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు. ఈ దీక్షలో బ్రాహ్మణ పల్లె సింగిల్ వి౦డో అధ్యక్షుడు సు౦దర్ రామిరెడ్డి, మాజీ కౌన్సిలర్ చెన్నయ్య, నాగేశ్వరరావు, ప్రభాకర్, సాంబశివా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోరుమామిళ్లలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో కూర్చున్న బి.కోడూరు మండల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు. కమలాపురంలో ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ ప్రొద్దుటూరు శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి. అనంతరం 101 టెంకాయలు కొట్టిన వైఎస్సార్సీపీ నేత శివ చంద్రారెడ్డి జ్యోతిరావు పూలే 192వ జయంతి సందర్భంగా రాజంపేట మానసిక వికలాంగుల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కేకు కట్ చేసి పిల్లలకు పంచిన జిల్లా బీసీ సెల్ కన్వీనర్ పసుపులేటి సుధాకర్, పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, పార్టీ నేతలు. ఎంపీల ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన లింగాల మండలం నాయకులు, పులివెందుల వడ్డెర, రజక, బుడబుక్కల సంఘం నాయకులు . ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా రైల్వేకోడూరు గాంధీ విగ్రహం వద్ద చిట్వేలు మండల కన్వీనర్ చెవు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. పాల్గొన్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యాకర్తలు. రాయచోటి లో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదోరోజుకు చేరిన వైఎస్సార్సీపీ శ్రేణుల రిలే దీక్షలు. పాల్గోన్న రాయచోటి రూరల్ మండలం ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కార్యకర్తలు. కడప రైల్వే స్టేషన్లో రైల్ రోకో కార్యక్రమం ఉండటంతో ముందస్తుగా పోలీసులను భారీగా మోహరించారు. రైల్ రోకో కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ శ్రేణులు స్టేషన్‌కు చేరుకున్నాయి. దీంతో పోలీసులు అడ్డుకుని కార్యకర్తలను చెదరగొట్టారు. కడప రైల్వేస్టేషన్లో దాదర్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేసి నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రవీంద్రనాథ్ రెడ్డి, అంజద్ పాషా, రఘురామి రెడ్డి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్షకు మద్ధతుగా ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో రైల్ రోకో నిర్వహించారు. నాందేడ్-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి నిరసన తెలిపిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు. రైల్‌రోకో చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. బాలినేనిని బలవంతంగా పోలీసులు బయటకు లాక్కొచ్చారు. కొండెపి ఇంఛార్జి, దళిత నేత వరికూటి అశోక్ బాబుపై సీఐ గంగా వెంకటేశ్వర్లు దాడికి దిగారు. బాగా చితకబాది లారీలో పడేశారు. దీంతో దాడి చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలని కార్యకర్తలతో కలసి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నిరసనకు దిగారు. కర్నూలు జిల్లా కర్నూలు రైల్వేస్టేషన్ వద్ద కూడా రైల్‌రోకో సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కలిసి రైల్‌రోకో చేసేందుకు బయలుదేరిన ఎమ్మెల్యే ఐజయ్య, పార్టీ నేతలు బీవై రామయ్య, హఫీజ్‌ఖాన్, ప్రదీప్‌రెడ్డిలను స్టేషన్ వద్ద పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. నంద్యాల రైల్వేస్టేషన్లో వైఎస్సార్సీపీ సమన్వయకర్త శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు రైల్ రోకోకు దిగారు. కార్యర్తలను పోలీసులు అడ్డుకుని దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విశాఖపట్నం జిల్లా ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్షకు చేస్తోన్న వైఎస్సార్సీపీ ఎంపీలకు మద్ధతుగా నర్సీపట్నం ఆర్డీవో ఆఫీసు వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ దీక్షా శిబిరంపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. దాడి జరిగిన విషయం పోలీసులకు చేరవేసినా వారు పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. విశాఖ రైల్వేస్టేషన్లో వైఎస్ఆర్సీపీ నేతలు రైల్‌రోకో నిర్వహించారు. పలాస ప్యాసింజర్‌ను నిలిపేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా నినాదాలతో స్టేషన్ ప్రాంగణమంతా దద్ధరిల్లింది. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు గుడివాడ అమర్నాథ్, సైనాల విజయ్ కుమార్, మళ్ల విజయ ప్రసాద్, చెట్టిఫాల్గుణ, కుంభా రవిబాబు, ఉషాకిరణ్, గరికిన గౌరి, వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస రైల్వేస్టేషన్లో వైఎస్సార్సీపీ నేతలు రైల్‌రోకో నిర్వహించారు. భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ రైల్‌రోకోలో తమ్మినేని సీతారం, రెడ్డి శాంతి, ధర్మాన కృష్ణదాస్ తదితర నేతలు పాల్గొన్నారు. -
ఏపి అంతటా కొనసాగుతున్న రైల్‌రోకో
-
కేంద్రం మెడలు వంచేదిశగా వైఎస్సార్సీపీ పోరు ఉధృతం
-
రేపు రహదారుల దిగ్బంధం.. ఎల్లుండి రైల్‌రోకో
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం మెడలువంచే దిశగా ఆందోళనలకు పిలుపిచ్చింది. మంగళవారం (ఏప్రిల్ 10న) రహదారుల దిగ్బంధం, బుధవారం (ఏప్రిల్ 11న) రైల్‌రోకో నిర్వహించనున్నట్లు పార్టీ ఒక ప్రకటన విడుదలచేసింది. వైఎస్సార్సీపీ ఎంపీల ఆమరణ దీక్షకు సంఘీభావంగా ఇప్పటికే అన్ని మండలాల్లో కొనసాగుతోన్న రిలే నిరాహారదీక్షలకు తోడు ఆందోళనా కార్యక్రమాలూ నిర్వహిస్తామని పార్టీ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తం జరిగే ఈ ఆందోళనా కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులతోపాటు ప్రజలూ పాల్గొనాలని కోరారు. హోదా సాధన పోరులో భాగంగా సభ్యత్వాలకు రాజీనామాలు చేసిన ఐదుగురు వైఎస్సార్సీపీ ఎంపీలు.. ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. సోమవారం నాటికి దీక్ష నాలుగో రోజుకు చేరింది. దీక్ష చేస్తూ అస్వస్థతకు గురైన ముగ్గురు ఎంపీలు మేకపాటి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డిలను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలు యధావిధిగా దీక్ష కొనసాగిస్తున్నారు. వారికి మద్దతుగా రాష్ట్రంలో సంఘీభావ దీక్షలతోపాటు ఆందోళనలూ చేపట్టాలని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. -
కేంద్రంపై తమిళనాడు కన్నెర్ర
సాక్షి ప్రతినిధి, చెన్నై: సుప్రీంకోర్టు తీర్పుననుసరించి కావేరీ నదీజలాల మేనేజ్మెంట్ బోర్డును వెంటనే ఏర్పాటుచేయాలన్న డిమాండ్లు తమిళనాడులో వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, ప్రధాని దిష్టిబొమ్మల దహనంతో తమిళనాడు ప్రజలు కేంద్రంపై తమ ఆగ్రహాన్ని చూపించారు. అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీల ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మార్చి 30న ముగిసినా కేంద్రం స్పందించకపోవడంతో అన్నాడీఎంకే, ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళనబాట పట్టాయి. చెన్నై, తిరువయ్యూరు, మదురై సహా తమిళనాడువ్యాప్తంగా 600 చోట్ల రాస్తారోకోలు నిర్వహించారు. కోయంబత్తూరు, తిరుచిరాపల్లి, పడుకొట్టాయ్సహా చాలాచోట్ల రైల్‌రోకో చేపట్టారు. కోయంబత్తూరులో ఇద్దరు డీఎంకే కార్యకర్తలు కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి ప్రయత్నించారు. తమిళనాడు విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరు కోర్టు ప్రాంగణంలో లాయర్లు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో పోలీసులు దాదాపు 1,000 మందిని అదుపులోకి తీసుకుని గొడవలు సద్దుమణిగాక వదిలేశారు. మంగళవారం రాష్ట్రబంద్‌కు రైతు సంఘాలు, వాణిజ్య సంఘాలు పిలుపునిచ్చాయి. కాగా, డీఎంకే నేతృత్వంలోని విపక్షపార్టీలు ఏప్రిల్ 5న బంద్ నిర్వహించనున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఒత్తిడి తేకుండా అన్నాడీఎంకే ప్రభుత్వం తమిళుల హక్కులను కాలరాస్తోందని డీఎంకే ఆరోపించింది. అన్నాడీఎంకే ఎంపీ రాజీనామా, ఉససంహరణ కావేరీ అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటులో కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యులు ముత్తుకరుప్పన్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. అయితే, సీఎం పళనిస్వామి ఆదేశాలతో తన రాజీనామాను ముత్తుకరుప్పన్ ఉపసంహరించుకున్నారు. మరోవైపు, కావేరీ వాటర్ బోర్డు త్వరగా ఏర్పాటుచేయాలని కోరుతూ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కావేరి అంశంపై మంగళవారం అన్నాడీఎంకే రాష్ట్రవ్యాప్త నిరాహారదీక్షలు చేపట్టనుంది. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, మంత్రులు ఈ దీక్షల్లో పాల్గొననున్నారు. కోర్టు ధిక్కార కేసు వింటాం: సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించని కేంద్రంపై తమిళనాడు దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏప్రిల్ 9న ఈ కేసు విచారణకు రానుంది. నిరసనల నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ పురోహిత్ ఢిల్లీకి వెళ్లారు. -
తమిళనాడులో DMK రైల్‌రోకో ఆందోళన
-
ఆగిన రైళ్లు
* ఆలస్యంపై ఆగ్రహం * ప్రయాణికుల రాస్తారోకో * రెండు గంటలు సేవల ఆటంకం సాక్షి, చెన్నై: రైల్వే యంత్రాంగంపై ప్రయాణికులు శుక్రవారం కన్నెర్ర చేశారు. ఎలక్ట్రిక్ రైలు ఆలస్యంగా నడుస్తుండడంపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రైల్ రోకోకు దిగడంతో రెండు గంటలు రైలు సేవలకు తీవ్ర ఆటంకం ఎదురైంది. సెంట్రల్ నుంచి తిరువళ్లూరు, గుమ్మిడిపూండి మార్గంలో నిత్యం రైళ్లు పరుగులు తీస్తుంటాయి. గుమ్మిడి పూండి మార్గంలో నడిచే ఎలక్ట్రిక్ రైళ్లకు సిగ్నల్ లభించడంలో ఇబ్బందులు తప్పవు. ప్రధానంగా బేషిన్ బ్రిడ్జి దాటాలంటే సమయం అంతా వృథాకాక తప్పదు. ఈ పరిస్థితుల్లో పొన్నేరి నుంచి సెంట్రల్‌కు ఉదయం ఎలక్ట్రిక్ రైలు బయలుదేరింది. ఈ రైలు నిర్ణీత సమయం 8.40 గంటలకు సెంట్రల్ చేరుకోవాల్సి ఉంది. ఈ రైలు నత్తనడకన సాగుతుండడంతో, అన్ని స్టేషన్లలో నిర్ణీత సమయం కంటే, ఎక్కువ సమయం ఆగుతూ రావడం ప్రయాణికుల్లో తీవ్ర అసహనాన్ని రేపింది. బే షిన్ బ్రిడ్జి వద్ద ఈ రైలుకు సిగ్నల్ లభించ లేదు. దీంతో గంట పాటుగా రైల్లోనే కూర్చోవాల్సి వచ్చింది. కూతవేటు దూరానికి గంట సేపు వేచి ఉండాల్సి రావడంతో ప్రయాణికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైల్‌రోకోతో సేవల ఆటంకం : తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రయాణికులు మరో ట్రాక్ మీదకు చేరుకున్నారు. అటు వైపుగా వచ్చే రైళ్లను అడ్డుకుంటూ రైల్ రోకోకు దిగారు. దీంతో తిరువళ్లూరు మార్గంలో వెళ్లాల్సిన రైళ్ల సేవలకు ఆటంకం ఏర్పడింది. అటు తిరువళ్లూరు, ఇటు గుమ్మిడిపూండి మార్గంలో రైలు సేవలు దాదాపుగా ఆగాయి. ఎక్కడి రైళ్లు అక్కడే నిలిపి వేయాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, ఉన్నతాధికారులు ఉరుకులు పరుగులతో అక్కడికి చేరుకున్నారు. కొందరు ప్రయాణికులు అయితే, తమ సమయం వృథా అవుతుండడంతో ట్రాక్ వెంబడి నడుచుకుంటూ పరుగున సెంట్రల్‌కు చేరుకున్నారు. మరికొందరు ప్రయాణికులు సమీపంలోని రోడ్డు మీదకు చేరుకుని ఆటోల్ని ఆశ్రయించి తమ గమ్యస్థానాలకు పరుగులు తీశారు. బుజ్జగింపు : బేషిన్ బ్రిడ్జి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న పోలీసులు, అధికారులు ప్రయాణికుల్ని బుజ్జగించే యత్నం చేశారు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న కొందరు ప్రయాణికులు వారిపై తిరగబడే యత్నం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎక్కడిక్కడ రైళ్లు ఆగడంతో ఆయా స్టేషన్లలో ప్రయాణికులు గంటకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు ప్రయాణికుల్ని బుజ్జగించేందుకు రైల్వే అధికారులు నానా తంటాలు పడ్డారు. ప్రతి రోజూ ఈ రైలు ఆలస్యంగా నడుస్తుండడం వల్లే తాము కార్యాలయాలకు ఆల స్యంగా వెళ్లాల్సి వస్తున్నదంటూ కొందరు ఉద్యోగులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఆ రైలును త్వరితగతిన సెంట్రల్‌కు పం పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక మీదట పొన్నేరి - సెంట్రల్ మధ్య ఉదయం 7.15 గంటలకు బయలుదేరే ఈ రైలు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ప్రయాణికులు శాంతించారు. ఈ తతంగం పూర్తి అయ్యేందుకు రెండు గంటలు పట్టడంతో ఇతర మార్గాల్లోని రైళ్లు ఆలస్యంగా నడవాల్సి వచ్చింది. -
రైల్ రోకో కార్యక్రమాలపై సమైక్యాంధ్ర జేఏసీ దృష్టి
హైదరాబాద్: రైల్ రోకో కార్యక్రమాలపై సమైక్యాంధ్ర జేఏసీ దృష్టి సారించనుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జేఏసీ సోమవారం ఏపీఎన్జీవో భనవ్ లో సమావేశమైంది. ఈ సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యచరణపై చర్చించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రైల్ రోకో కార్యక్రమాల నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. అంతకుముందు ఉద్యోగుల సమ్మెపై హైకోర్టులో తీర్పు ఎలా వచ్చినా, సమ్మెను మరింత ఉధృతంగా కొనసాగించి తీరాలని ఏపీఎన్జీవోలు నిర్ణయానికి వచ్చారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు కోసం ఏపీఎన్జీవో కార్యవర్గ సమావేశం ఆదివారం ఏపీఎన్జీవో కార్యాలయంలో జరిగింది. 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్ నగర శాఖ నేతలు కూడా పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గం, అన్ని జిల్లాల నాయకుల సమావేశం రాత్రి 9 గంటల వరకు సాగింది. హైకోర్టు తీర్పు సమ్మెకు వ్యతిరేకంగా వచ్చినా, సమ్మె కొనసాగించాల్సిందేనని సమావేశంలో ఎక్కువ మంది అభిప్రాయడ్డారు. తీర్పు సమ్మెకు వ్యతిరేకంగా ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ఉన్న అవకాశాలపై సమావేశంలో చర్చించారు. -
నాందేడ్వాసుల రైల్‌రోకో
నాందేడ్, న్యూస్‌లైన్: ముంబై-లాతూర్ ఎక్స్‌ప్రెస్‌ను నాందేడ్ వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం స్థానికులు రైల్‌రోకో నిర్వహించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలటకు అంతరాయం ఏర్పడింది. ఉదయం తొమ్మిది గంటలకు నాందేడ్ చేరుకున్న ముంబై-సికింద్రాబాద్ దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయం 11 గంటల వరకు నిలిచిపోయింది. దీంతో ముంబై నుంచి శనివారం రాత్రి ఆ రైలులో స్వగ్రామాలకు బయలుదేరిన తెలుగు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముంబై-లాతూర్ ప్రాంతాల మధ్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును త్వరలో నాందేడ్ వరకు పొడిగిస్తామని అప్పట్లో రైల్వే బడ్జెట్లో ప్రకటించారు. అయితే ఇంతవరకు దాన్ని పొడిగించలేదు. ఇదే అంశంపై గతంలో పలుమార్లు ర్యాలీలు, ఆందోళనలు కూడా జరిగాయి. మరోవైపు ఈ రైలును నాందేడ్ వరకు పొడిగించవద్దని లాతూర్వాసులు కూడా భారీగా ఆందోళనలు చేశారు. దీంతో రైల్వే పరిపాలన విభాగం, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా ఆగ్రహానికి గురైన నాందేడ్వాసులు రైలురోకోకు దిగారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రజలు పోలీసుల కళ్లుగప్పి మెల్లమెల్లగా నాందేడ్ స్టేషన్‌కు చేరుకున్నారు. రైల్వే సంఘర్ష్ సమితి నాయకుడు సుధాకర్‌రావ్ డోయిఫొడే నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో స్థానికులతోపాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అనంతరం పోలీ సులు కలుగజేసుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ను ఉదయం 11.10 గంటలకు నాందేడ్ నుంచి పంపించారు. ఈ ఆందోళనలో ఎంపీ భాస్కర్‌రావ్ పాటిల్, శివసేన పార్టీ ప్రజా సంబంధాల అధికారి ప్రకాశ్ మారావార్, జిల్లా పరిషద్ అధ్యక్షుడు దిలీప్ పాటిల్, వివిధ పార్టీల పదాధికారులు, స్థానికులు పాల్గొన్నారు. -
విశాఖపట్నంలో సమైక్యవాదుల అరెస్ట్
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. రైల్‌రోకోకు సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో రైల్‌రోకోకు ప్రయత్నించిన సమైక్యవాదులను అరెస్టు చేశారు. రైల్వే స్టేషన్ వద్ద భారి పోలీస్ బందోబస్తు పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట రైల్వేస్టేషన్లో సమైక్యవాదులు రైల్‌రోకో చేపట్టనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరులో నిరాహారదీక్ష చేసేందుకు సిద్దమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డిను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా టెంట్ తొలిగించారు. చిత్తూరు జిల్లాలో 12వ రోజు కొనసాగుతున్న బంద్ కొనసాగుతోంది. దుకాణాలు ఇంకా తెరుచుకోలేదు. -
రైలు ఆపితే జైలే : డీజీపీ దినేష్‌రెడ్డి
సీమాంధ్ర ఉద్యమకారులకు డీజీపీ దినేష్‌రెడ్డి హెచ్చరిక విభజన గురించి 15 రోజుల ముందే తెలుసని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రైళ్ల రాకపోకలను అడ్డుకునేందుకు పట్టాలపైకి వెళితే.. నాన్‌బెయిలబుల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, చిన్న రాయిని ముట్టుకున్నా కేసు పెడతామని డీజీపీ వి.దినేష్‌రెడ్డి హెచ్చరించారు. రైల్‌రోకో చేయాలనే నిర్ణయాన్ని సీమాంధ్ర ఉద్యమకారులు విరమించుకోవాలని సూచించారు. రైల్రోకోలపై నిషేధం ఉందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. గురువారమిక్కడ డీజీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆందోళనకారులను గుర్తిం చేందుకు రైల్వేస్టేషన్లు, రైలు పట్టాలపైనా వీడియో చిత్రీకరణ చేస్తామన్నారు. హెలికాప్టర్ ద్వారా ఏరియ ల్ సర్వే చేస్తున్నామని వివరించారు. రైల్‌రోకోను నిరోధించేందుకు ప్రస్తుతం ఉన్న అదనపు బలగాలకు తోడు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)ను కూడా రంగంలోకి దించుతున్నామన్నారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల రైలు మార్గం మధ్యలో మన రాష్ట్రం ఉందని, ఇక్కడ రైల్‌రోకో నిర్వహిస్తే సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయం 15 రోజుల ముందుగానే తనకు తెలుసని, ముందస్తు జాగ్రత్తగా సీమాంధ్రలో 55 కంపెనీల పారా మిలటరీ బలగాలను మోహరించామని డీజీపీ వెల్లడించారు. ర్యాలీలకు రాజధానిలో అనుమతిలేదు సమైక్యాంధ్ర కోరుతూ హైదరాబాద్‌లో ర్యాలీలు నిర్వహించేందుకు ఎలాంటి అనుమతీ లేదని దినేష్‌రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంతోపాటు పలు కార్యాలయ ఉద్యోగులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. అయితే, సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే విధంగా వ్యవహరించవద్దన్నారు. రాజధానిలో నివసించే సీమాంధ్ర ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని, ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఏపీఎస్పీ డీఐజీ షేక్ మహ్మద్ ఇక్బాల్ తన రాజీనామాను ఉపసంహరించుకున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా డీజీపీ చెప్పారు. పోలీసులకు ప్రాంతీయ వైషమ్యాలు లేవు.. పోలీసు అధికారులు, సిబ్బందికి రాజకీయ, కుల, మత, ప్రాంతీయ విభేదాలు ఉండవని డీజీపీ అన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేస్తుందని తెలిపారు. సీమాంధ్ర ఆందోళనల విషయంలో డీజీపీ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. విగ్రహాల ధ్వంసం, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసం ఘటనలపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని వివరించారు. ఆందోళనలను చానళ్లలో పదేపదే చూపించడం మంచిది కాదని, కేబుల్ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని ఇప్పటికే టీవీ చానల్ యాజమాన్యాలకు సమాచారం పంపామని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ చెప్పారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై హత్య కుట్రకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదూ అందలేదని, హత్యకు సుపారీ ఇచ్చిన వ్యవహారంపై ఫిర్యాదు ఇస్తే దర్యాప్తు చేస్తామని డీజీపీ చెప్పారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగించినా, ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా రైల్వే చట్టాన్ని ప్రయోగిస్తామని పోలీసుశాఖ స్పష్టంచేసింది. రైళ్లను అడ్డుకోవడం, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం వంటి నేరాలకు ఏడాది జైలు నుంచి జీవిత ఖైదు వరకూ విధించే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారుల స్పష్టం చేశారు. -
రైల్‌రోకో చేస్తే కఠిన చర్యలు: డీజీపీ
-
రైల్‌రోకో చేస్తే కఠిన చర్యలు : డీజీపీ
హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ దినేష్ రెడ్డి గురువారం డీజీపీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రైల్‌రోకో చేస్తే కఠిన చర్యలు తప్పవని ఉద్యమకారులను ఆయన హెచ్చరించారు. రైళ్లను ఆపినా, రైల్వే ఆస్తులు ధ్వంసం చేసినా నాన్‌బెయిల్‌బుల్ కేసులు నమోదు చేస్తామని డీజీపీ వెల్లడించారు. రైల్‌రోకో కార్యక్రమాలను ఆషామాషీగా తీసుకోవద్దని ఆయన అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కఠిన చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రైల్రోకోలపై నిషేధం ఉందన్ని....నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలిపితే ఎలాంటి అభ్యంతరం లేదని డీజీపీ అన్నారు. రైల్రోకోలను నిరోధించేందుకు తగినంత భద్రత ఉందని డీజీపీ తెలిపారు. జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేసినవారిపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరికలు చేశారు. ఆందోళనలను వీడియో తీస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర ఉద్యమాలకు అనుమతి లేదని డీజీపీ తెలిపారు. నిరసన తెలపాలనుకుంటున్న ఉద్యోగులు పికెటింగ్‌లు చేయరాదన్నారు. అలాగే హైదరాబాద్ లో ర్యాలీలకు అనుమతి లేదన్నారు.