ఆంధ్రప్రదేశ్ విభజనకు కేంద్ర మంత్రి మండలి పచ్చ జెండా ఊపడంతో సీమాంధ్రలో బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు రాష్ట్రంలోని పలు యూనివర్శిటీలు శనివారం వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించాయి. తమ యూనివర్శిటీ పరిధిలో జరాగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేసినట్లు విశాఖపట్నంలోని ఆంధ్రయూనివర్శిటీ ప్రకటించింది.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నేడు, రేపు జరగవలసిన అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ శనివారం హైదరాబాద్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. వీటితోపాటు అనంతపురంలోని జేఎన్టీయూ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీలు కూడా పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు.