సాక్షి, కడప: కడపలో జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, నగర సమన్వయకర్త అంజాద్‌బాషా ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. అప్సర సర్కిల్‌లో సురేష్‌బాబు బంద్‌ను పర్యవేక్షించారు. రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు. అంజాద్‌బాషా ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్‌ర్యాలీ చేపట్టారు. కోటిరెడ్డి సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, ఏడురోడ్ల కూడళ్లతో పాటు ప్రధాన వీధులలో వాహనాల్లో తిరుగుతూ దుకాణాలు మూయించి బంద్ చేపట్టారు. వై-జంక్షన్‌లో రోడ్డుపై కనిపించిన ఓ ఆర్టీసీ బస్సు అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నినాదాలు చేశారు.
దీంతో పోలీసులు అంజాద్‌తో పాటు వైఎస్సార్‌పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు. చింతకొమ్మదిన్నె వైఎస్సార్ సర్కిల్‌లో మాజీ మేయర్వ్రీంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. జమ్మలమడుగులో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఆధ్వర్యంలోబంద్ కొనసాగింది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు మూసేశారు. ఆర్టీసీ బస్సులు కూడా తిరగలేదు. ప్రొద్దుటూరులో నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగింది. పుట్టపర్తి సర్కిల్ , టీబీరోడ్డు, గాంధీరోడ్డులోని దుకాణాలను మూయించారు. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మునిసిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, ఎన్జీవోల సంఘం పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యాయ జేఏసీ నేత రషీద్‌ఖాన్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
పుట్టపర్తి సర్కిల్‌లో మానవహారం చేపట్టారు. రాష్ట్రం విడిపోతే అన్ని రంగాల్లోనూ రాయలసీమ తీవ్రంగా నష్టపోతుందని, సీమ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని పట్టణవాసులు ముక్త కంఠంతో నినదించారు. పులివెందులలో వ్యాపారులు రెండోరోజూ స్వచ్ఛందంగా దుకాణాలు మూసి బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీనేతలు బంద్‌ను పర్యవేక్షించారు. ఆర్టీసీ బస్సులు డిపో నుంచి బయటకు కదల్లేదు. రాజంపేట బైపాస్‌రోడ్డులో వైఎస్సార్‌సీపీ నేత పోలా శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్లలో వైఎస్సార్‌సీపీ నేతలు బైక్‌ర్యాలీ నిర్వహించారు. రైల్వేకోడూరులో పంజం సుకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. రాయచోటిలో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూత పడ్డాయి.
నిరసన జ్వాల
Published Sun, Dec 8 2013 4:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement
Advertisement