నేడు సీమాంధ్ర బంద్: పి.అశోక్‌బాబు | Bandh call in 13 districts of Seemandhra against Telangana today | Sakshi
Sakshi News home page

నేడు సీమాంధ్ర బంద్: పి.అశోక్‌బాబు

Published Fri, Dec 6 2013 2:38 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

నేడు సీమాంధ్ర బంద్: పి.అశోక్‌బాబు - Sakshi

నేడు సీమాంధ్ర బంద్: పి.అశోక్‌బాబు

సాక్షి, విజయవాడ: ఆరుకోట్ల మంది తెలుగు ప్రజల మనోభావాలను పక్కనపెట్టి కేంద్ర కేబినేట్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం సీమాంద్ర బంద్‌కు పిలుపు ఇస్తున్నట్లు ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు చెప్పారు. విజయవాడలో గురువారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ బంద్‌కు ప్రజలంతా మద్దతు పలకాలని కోరారు.
 
  సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల చేతకానితనం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్రం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. కేబినేట్ ఆమోదం పొందినంత మాత్రాన తెలంగాణ వచ్చినట్లు కాదన్నారు. మొదటి అడుగు మాత్రమే పడిందని, ఇంకా చాలా దశలున్నాయని చెప్పారు. కేబినేట్ ఆమోదం పొందిన తర్వాత ఆగిపోయిన బిల్లులు ఎన్నో ఉన్నాయని, ఈ బిల్లు కూడా అలానే అవుతుందన్న ఆశాభావం ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement