'దమ్ముంటే కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయాలి' | Jupudi prabhakar rao challenge to seemandhra Central ministers | Sakshi
Sakshi News home page

'దమ్ముంటే కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయాలి'

Published Fri, Dec 6 2013 2:54 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

'దమ్ముంటే కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయాలి' - Sakshi

'దమ్ముంటే కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయాలి'

హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి తాము వ్యతిరేకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది జూపూడి ప్రభాకర్రావు అన్నారు. కేబినెట్ నిర్ణయం రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగిస్తోందని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్రలో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపుకు అనూహ్య స్పందన వచ్చిందన్నారు.

విజభనను అడ్డుకోవాల్సిన టీడీపీ నేతలు తమను విమర్శించటం ఎంత వరకూ సబబు అని జూపూడి ప్రశ్నించారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇంకా పార్టీలో ఎందుకున్నారో చెప్పాలని ఆయన నిలదీశారు. చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement