'తెలంగాణ బిల్లును భోగి మంటల్లో తగలబెడతాం' | AP NGOs Call Seemandhra Bandh on January 17, 18 | Sakshi
Sakshi News home page

'తెలంగాణ బిల్లును భోగి మంటల్లో తగలబెడతాం'

Published Fri, Jan 10 2014 3:29 PM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

'తెలంగాణ బిల్లును భోగి మంటల్లో తగలబెడతాం'

'తెలంగాణ బిల్లును భోగి మంటల్లో తగలబెడతాం'

హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఈనెల 17, 18 తేదీల్లో సీమాంధ్ర బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈనెల 20న అసెంబ్లీని ముట్టడిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు తెలిపారు. ఈ నెల 14 అన్ని సీమాంధ్ర జిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తెలంగాణ బిల్లును భోగి మంటల్లో తగలబెట్టే కార్యక్రమం చేపడతామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల సహాయ సహకారాలతో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

సమైక్యం కోసం సీమాంధ్ర నాయకులు కృషి చేస్తారని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోమని నేతలు ప్రజల సమక్షంలో హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వాయిదా పడకుండా చూడాల్సిన బాధ్యత సభ్యులదేనని అశోక్బాబు అన్నారు. సభలో బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement