assembly siege
-
కదంతొక్కిన రైతన్న
ముంబై: అన్నదాతలు ఆదివారం ముంబై నగరాన్ని ముంచెత్తారు. డిమాండ్ల సాధన కోసం దాదాపు 50 వేల మంది మహారాష్ట్ర రైతులు ముంబైలో అడుగుపెట్టారు. వారంతా సోమవారం అసెంబ్లీని ముట్టడించనున్నారు. రైతు సమస్యలు తీర్చాలంటూ మహారాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది కర్షకులు పాదయాత్రగా వచ్చారు. ఎండలు మండిపోతున్నా, అరికాళ్లు బొబ్బలెక్కుతున్నా లెక్కచేయకుండా దీక్షతో ఆరు రోజులపాటు 180 కిలో మీటర్లు నడిచిన వారంతా ముంబైలోని కేజే సోమయ మైదానానికి చేరుకున్నారు. ఆ తర్వాత వారు అర్ధరాత్రి ఆజాద్ మైదానానికి బయల్దేరారు. మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ వీరికి ముంబై శివార్లలో స్వాగతం పలికారు. మంగళవారం నాసిక్‌లో యాత్ర ప్రారంభమైంది. ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లుగా రైతు రుణాలను మాఫీ చేయడం, పెట్టుబడికి అయిన ఖర్చు కన్నా కనీసం 50 శాతం ఎక్కువగా కనీస మద్దతు ధర ఉండేలా చూడడం, ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయడం, అకాల వర్షాలు, తెగుళ్ల కారణంగా పంట నష్టపోయిన వారిని ఆదుకోవడం, ఆదివాసీలు సాగు చేస్తున్న భూములను వారి పేర్లన రిజిస్టర్ చేయడం తదితరాలు రైతుల డిమాండ్లలో ప్రధానమైనవి. రైతు సమస్యల పరిష్కారానికి ఆరుగురు సభ్యులతో ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశామనీ, ఆ సంఘం రైతులతో చర్చలు జరుపుతుందని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. కమ్యూనిస్టుల అనుబంధ అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) రైతుల పోరాటానికి నేతృత్వం వహిస్తోంది. ఎవరికీ ఇబ్బంది లేకుండా, శాంతియుతంగా తాము నిరసన తెలుపుతామని ఏఐకేఎస్ తెలిపింది. -
‘మహా’ మార్చ్
ముంబై: చరిత్రలో రైతు ఉద్యమాలు ఎన్నో చూశాం. కానీ రికార్డు స్థాయిలో వేలాది మంది అన్నదాతలు 180 కి.మీ మేర పాదయాత్ర చేపట్టడం బహుశా ఇదే తొలిసారేమో! ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతోంది ఇదే. రుణ మాఫీ అమలు సహా ఇతర సమస్యలు పరిష్కరించాలని సుమారు 30 వేల మంది రైతులు మార్చి 6న నాసిక్ నుంచి ముంబైకి మహా యాత్రగా బయల్దేరారు. మార్గ మధ్యలో వారికి థానె, పాల్ఘడ్ తదితర జిల్లాల రైతులు జతకలిశారు. 12న ర్యాలీ ముంబై చేరుకునే సరికి రైతుల సంఖ్య 70 వేలకు పెరగొచ్చు. అదే రోజు రాష్ట్ర అసెంబ్లీని ముట్టడించే వీలుంది. భారతీయ కిసాన్ సభ ఈ పోరాటానికి నేతృత్వం వహిస్తోంది. ముంబై–ఆగ్రా జాతీయ రహదారి మీదుగా మార్చ్ కొనసాగుతోంది. రైతులు భోజనాలు, నిద్ర లాంటి అవసరాలను రోడ్లపైనే తీర్చుకుంటున్నారు. ఈ మహా పాదయాత్రలో మహిళా రైతులు, 90 ఏళ్లకు పై బడిన వృద్ధులు కూడా ఉన్నారు. అసంతృప్తిని రగిల్చిన పంట నష్టం.. ఈ ఏడాది అకాల వర్షాలు రైతన్నలను నిండా ముంచాయి. పింక్ బాల్ వార్మ్ చీడ పత్తి పంటను దెబ్బతీసింది. ఫిబ్రవరిలో కురిసిన వడగళ్ల వానలకు లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 19 జిల్లాల్లో రబీ పంట తుడిచిపెట్టుకుపోయింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంది. గత ఏడాది మహారాష్ట్ర సర్కార్ రూ. 34 వేల కోట్ల రుణాల మాఫీకి హామీ ఇచ్చినా అది క్షేత్రస్థాయిలో సరిగా అమలు కాలేదు. దీంతో అన్నదాతల్లో అసంతృప్తి కట్టలు తెంచుకుని ఉద్యమానికి దారి తీసింది. ఆగని ఆత్మహత్యలు.. రుణ మాఫీ పథకం అమలులో ప్రభుత్వం వైఫల్యం చెందడం వల్ల రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 1753 మంది రైతన్నలు బలవన్మరణానికి పాల్పడ్డారు. విదర్భ, మరఠ్వాడ, నాసిక్ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరోవైపు, రైతులకు చేయాల్సినదంతా చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. 35 లక్షల 68 వేల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రుణమాఫీ పథకం కింద ఇప్పటివరకు రూ. 13, 782 కోట్లు విడుదల చేశామని తెలిపింది. రైతు సమస్యల పరిష్కారానికి రూ. 2,400 కోట్ల ఆర్థిక సాయం కోరగా కేంద్రం నుంచి స్పందన రాలేదు. రైతుల డిమాండ్లు ఇవీ.. ► ఫడ్నవీస్ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతు రుణాలన్నీ మాఫీ చేయాలి ► విద్యుత్ బిల్లుల్ని రద్దు చేయాలి ళీ స్వామినాథన్ కమిటీ సిఫారసులన్నీ అమలు చేయాలి ► కనీస మద్దతు ధరతో రైతులకు ఒరిగేదేమీ లేదు. చట్టబద్ధమైన ధరను కల్పించాలి. ► అకాల వర్షాలు, పింక్ బాల్ వార్మ్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పెంచాలి ► బుల్లెట్ రైళ్లు, సూపర్‌హైవేలు వంటి అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో పంటభూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిలిపివేయాలి. -
రైతు సమస్యలపై 27న అసెంబ్లీ ముట్టడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి గిట్టుబాటు ధర లభించడం లేదని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్ధం కావడం లేదని, రైతుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఆం దోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం మెడలు వంచేందుకు 27న అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కు పరిమితం కావద్దని హితవు పలికారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని వస్తున్న వార్తలపై తనకేమీ తెలియదని, రేవంత్ విషయాన్ని తనతో ఎవరూ చర్చించలేదని చెప్పారు. -
బీజేపీ అసెంబ్లీ ముట్టడి భగ్నం
⇒ గ్రూపుల వారీగా వచ్చిన కార్యకర్తలు, నేతలు ⇒ భారీగా మోహరించిన పోలీసు బలగాలు సాక్షి, హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడిని పోలీసులు విఫలం చేశారు. శుక్రవారం బీజేపీ, బీజేవైఎం, మహిళా మో ర్చా కార్యకర్తలు ఓ పథకం ప్రకారం అసెంబ్లీ వద్దకు చేరుకొని నిరసన తెలిపే ప్రయత్నం చేయగా అప్పటికే మోహరించిన పోలీస్ బలగాలు వారిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించాయి. బీజేపీ కార్యకర్తలు ఒకవైపు, బీజేవైఎం కార్య కర్తలు మరోవైపు అసెంబ్లీని ముట్టడించేందుకు పథకం రూపొందించా రు. బీజేపీ కార్యకర్తలు గేట్ నంబర్1 వైపు వస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు అరెస్ట్ అయ్యే సమయంలో అసెంబ్లీ ఉస్మానియా గేట్ వద్ద బీజేవైఎం కార్యకర్తలు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించా రు. ఒకేసారి కాక పదుల సంఖ్యలో గ్రూపులుగా విడిపోయి అసెంబ్లీకి చేరుకున్నారు. పది నిమిషాలకొక గ్రూప్ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం సృష్టించింది. మొత్తంగా అసెంబ్లీ వద్ద 300 మందికిపైగా కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేవైఎం, మహిళా మోర్చా విభాగాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఉస్మానియా గేట్–గన్‌పార్క్ చౌరస్తా వద్ద నడిరోడ్డుపై హంగామా సృష్టించారు. ప్రధాన రహదారిపై బీజేవైఎం కార్యకర్తలు పడుకుని నిరసన తెలిపారు. అటు అసెంబ్లీ గేట్ నంబర్ 1 వద్ద మహిళా మోర్చా నేతలు రోడ్డుపై అడ్డం గా కూర్చొని నిరసన తెలిపే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలు కంచన్‌బాగ్‌కు.. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు బషీర్‌బాగ్ నుంచి ర్యాలీగా అసెంబ్లీ వైపునకు రావాలని అనుకు న్నారు. అయితే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చే సమయంలోనే ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, రాజా సింగ్, రాంచంద్రారెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి కంచన్‌బాగ్ తరలించారు. పోలీసుల కళ్లుగప్పి బషీర్‌బాగ్ చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే ప్రభాకర్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డిలు పార్టీ నాయకులతో కలసి అరెస్టులకు నిరసనగా గాంధీనగర్ పోలీసు స్టేషన్ ఆవరణలో బైఠాయించి ధర్నా చేశారు. ప్రజలు గుణపాఠం చెబుతారు: లక్ష్మణ్ టీఆర్ఎస్ ఓటుబ్యాంకు రాజకీయాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కె.లక్ష్మణ్ హెచ్చరించారు. ము స్లిం రిజర్వేషన్ల ప్రతిపాదనను విరమిం చుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలను చేపడతామని ప్రకటించారు. మతపర మైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టిన తమ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం అమానుషమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. -
వారంలో లక్షమందితో అసెంబ్లీ ముట్టడి
టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం ఉద్యోగాలను ఒకే నోటిఫికేషన్‌పై భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే వారం రోజుల్లో లక్ష మందితో అసెంబ్లీ ముట్టడి తప్పదని హెచ్చరించారు. పలు శాఖల ముఖ్య కార్యదర్శులతో నిరుద్యోగుల భేటీ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. వేల సంఖ్యలో గ్రూపు 1, గ్రూప్-2 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం వందల సంఖ్యలో నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఈ సందర్భంగా సచివాలయంలో బీసీ సంఘాల నేతలతో, పలు శాఖల ప్రధాన కమిషనర్లను కలసిన కృష్ణయ్య ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, ఫీజుల బకాయిలపై చర్చించారు. -
'తెలంగాణ బిల్లును భోగి మంటల్లో తగలబెడతాం'
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఈనెల 17, 18 తేదీల్లో సీమాంధ్ర బంద్‌కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈనెల 20న అసెంబ్లీని ముట్టడిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు తెలిపారు. ఈ నెల 14 అన్ని సీమాంధ్ర జిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తెలంగాణ బిల్లును భోగి మంటల్లో తగలబెట్టే కార్యక్రమం చేపడతామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల సహాయ సహకారాలతో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. సమైక్యం కోసం సీమాంధ్ర నాయకులు కృషి చేస్తారని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోమని నేతలు ప్రజల సమక్షంలో హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వాయిదా పడకుండా చూడాల్సిన బాధ్యత సభ్యులదేనని అశోక్‌బాబు అన్నారు. సభలో బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.