వారంలో లక్షమందితో అసెంబ్లీ ముట్టడి | One lakh people with Assembly siege says TDP MLA R.Krishnaiah | Sakshi
Sakshi News home page

వారంలో లక్షమందితో అసెంబ్లీ ముట్టడి

Published Wed, Mar 9 2016 3:59 AM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

వారంలో లక్షమందితో అసెంబ్లీ ముట్టడి - Sakshi

వారంలో లక్షమందితో అసెంబ్లీ ముట్టడి

టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం ఉద్యోగాలను ఒకే నోటిఫికేషన్‌పై భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే వారం రోజుల్లో లక్ష మందితో అసెంబ్లీ ముట్టడి తప్పదని హెచ్చరించారు.

పలు శాఖల ముఖ్య కార్యదర్శులతో నిరుద్యోగుల భేటీ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. వేల సంఖ్యలో గ్రూపు 1, గ్రూప్-2 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం వందల సంఖ్యలో నోటిఫికేషన్‌లు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఈ సందర్భంగా సచివాలయంలో బీసీ సంఘాల నేతలతో, పలు శాఖల ప్రధాన కమిషనర్‌లను కలసిన కృష్ణయ్య ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, ఫీజుల బకాయిలపై చర్చించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement