బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వద్ద లక్ష్మణ్‌ను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
⇒ గ్రూపుల వారీగా వచ్చిన కార్యకర్తలు, నేతలు
⇒ భారీగా మోహరించిన పోలీసు బలగాలు
సాక్షి, హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడిని పోలీసులు విఫలం చేశారు. శుక్రవారం బీజేపీ, బీజేవైఎం, మహిళా మో ర్చా కార్యకర్తలు ఓ పథకం ప్రకారం అసెంబ్లీ వద్దకు చేరుకొని నిరసన తెలిపే ప్రయత్నం చేయగా అప్పటికే మోహరించిన పోలీస్ బలగాలు వారిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించాయి. బీజేపీ కార్యకర్తలు ఒకవైపు, బీజేవైఎం కార్య కర్తలు మరోవైపు అసెంబ్లీని ముట్టడించేందుకు పథకం రూపొందించా రు. బీజేపీ కార్యకర్తలు గేట్ నంబర్1 వైపు వస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరు అరెస్ట్ అయ్యే సమయంలో అసెంబ్లీ ఉస్మానియా గేట్ వద్ద బీజేవైఎం కార్యకర్తలు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించా రు. ఒకేసారి కాక పదుల సంఖ్యలో గ్రూపులుగా విడిపోయి అసెంబ్లీకి చేరుకున్నారు. పది నిమిషాలకొక గ్రూప్ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం సృష్టించింది. మొత్తంగా అసెంబ్లీ వద్ద 300 మందికిపైగా కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేవైఎం, మహిళా మోర్చా విభాగాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఉస్మానియా గేట్–గన్‌పార్క్ చౌరస్తా వద్ద నడిరోడ్డుపై హంగామా సృష్టించారు. ప్రధాన రహదారిపై బీజేవైఎం కార్యకర్తలు పడుకుని నిరసన తెలిపారు. అటు అసెంబ్లీ గేట్ నంబర్ 1 వద్ద మహిళా మోర్చా నేతలు రోడ్డుపై అడ్డం గా కూర్చొని నిరసన తెలిపే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎమ్మెల్యేలు కంచన్‌బాగ్‌కు..
అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు బషీర్‌బాగ్ నుంచి ర్యాలీగా అసెంబ్లీ వైపునకు రావాలని అనుకు న్నారు. అయితే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చే సమయంలోనే ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, రాజా సింగ్, రాంచంద్రారెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి కంచన్‌బాగ్ తరలించారు. పోలీసుల కళ్లుగప్పి బషీర్‌బాగ్ చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే ప్రభాకర్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డిలు పార్టీ నాయకులతో కలసి అరెస్టులకు నిరసనగా గాంధీనగర్ పోలీసు స్టేషన్ ఆవరణలో బైఠాయించి ధర్నా చేశారు.
ప్రజలు గుణపాఠం చెబుతారు: లక్ష్మణ్
టీఆర్‌ఎస్ ఓటుబ్యాంకు రాజకీయాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కె.లక్ష్మణ్ హెచ్చరించారు. ము స్లిం రిజర్వేషన్ల ప్రతిపాదనను విరమిం చుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలను చేపడతామని ప్రకటించారు. మతపర మైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టిన తమ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం అమానుషమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు.