
సాక్షి, తిరుపతి: మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. తిరుపతిలో ఎస్వీయులో గురువారం చేపట్టిన ఈ ఉద్యమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మూడు రాజధానులు కావాలంటూ విద్యార్థులు పోస్టు కార్డుల ద్వారా నినాదాలు చేస్తూ రాష్ట్రపతికి వినతి చేసుకున్నారు.