శృంగవరపుకోట: రైవాడ నీటి కోసం రైతులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రైవాడ నీటిని తమకివ్వాలంటూ 18 ఏళ్ల కిందట రైతులు నిర్వహించిన పోరాటం రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృషించింది. అయితే ఇప్పుడు అదే రైవాడ నీటి కోసం మరో ఉద్యమం ఊరికిపోసుకుంది. 1975లో అప్పటి సీఎం జలగం వె ంగళరావు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, జీఓ నంబర్ 417తో పాత శృంగవరపుకోట తాలూకాకు రెండువేల ఎకరాలు, విశాఖ జిల్లా చోడవరం, వియ్యంపేట తాలూకాలకు నాలుగువేల ఎకరాలకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే 14 ఎంజీడీ నీటిని విశాఖపట్నం తరలించాలని ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని గతంలో చంద్రబాబు ప్రభుత్వంతుంగలో తొక్కేసింది. జీఓనెం.160తో 27ఎంజీడీ నీటిని ఓపెన్ కెనాల్ ద్వారా విశాఖ పట్టుకుపోతున్నారు. మళ్లీ చంద్రబాబు హాయాంలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.216 కోట్ల ప్రపంచ బ్యాంక్ నిధులో ఓపెన్ కెనాల్ స్థానంలో పైప్‌లైన్‌వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది.
భగ్గుమంటున్న రైతాంగం
రైతుల నోట్లో మట్టికొట్టి రిజర్వాయర్ల నీటి ని దోచుకెళ్లి ప్రభుత్వం యధేచ్ఛగా వ్యాపారం చేసుకుంటోందని వేపాడ, కోటపాడు , దేవరాపల్లి, సబ్బవరం మండలాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోంచి రైవాడ నీరు వెళ్తున్నా, కాలువ పక్క పొలాలు బీటలు వారి వ్యవసాయంలేక వలసలు పోయే పరిస్థితి ఏర్పడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ కెనాల్ స్థానంలో పైప్‌లైన్ ఏర్పాటు చేసే యోచనను వారు వ్యతిరేకిస్తున్నారు. పంచాయతీ స్థాయి నుంచి మండల, జిల్లా సమావేశాల్లో ప్రబుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేలా తీర్మానించేందుకు సిద్ధమవుతున్నారు. ఈనేపథ్యలో పైపు లైన్ నిర్మాణం ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం వేపాడ మండలం నీలకంఠరాజపురం గ్రామసమీపంలో రైవాడ కాలువ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు.
రైవాడ నీటి కోసం మరో ఉద్యమం
Published Sun, Sep 6 2015 12:22 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement