వాగ్నర్ చీఫ్, తిరుగుబాటు నాయకుడు ప్రిగోజిన్‌ను రష్యానే హతమార్చిందని పశ్చిన దేశాల నాయకుల ఆరోపణలపై తాజాగా క్రెమ్లిన్ స్పందించింది. అదంతా పచ్చి అబద్దం అని తెలిపింది. ప్రిగోజిన్ ఖచ్చితంగా చనిపోయాడనే విషయాన్ని తెలపడానికి నిరాకరిచింది. దర్యాప్తు పరీక్షల ఫలితాలు రావాలని స్పష్టం చేసింది.
అటు.. ప్రైవేటు విమానం ప్రమాదానికి గురైన సమయంలో వాగ్నర్ చీఫ్ అందులోనే ఉన్నారని రష్యా విమానయాన అథారిటీ వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని పేర్కొంది. విమాన ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుభూతి తెలిపారు. ప్రిగోజిన్, ఆయన సహచరులను పొగుడుతూనే.. కొన్ని తప్పులు కూడా చేశారని అన్నారు.
వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మరణంపై పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు చేసినందుకు ప్రతీకారంతోనే అతన్ని అంతం చేశారని ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన రష్యా అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలని అన్నారు. దర్యాప్తులోనే అసలైన నిజాలు బయటకొస్తాయని చెప్పారు.
ఇదీ చదవండి: Wagner Chief Plane Crash Video: అంతా 30 సెకన్లలోనే.. వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment