
తొగుట (దుబ్బాక): పాలకుల అణచివేత నుంచే ప్రజా ఉద్యమాలు పుట్టుకొస్తాయని ప్రజా గాయకురాలు విమలక్క అన్నారు. సిద్దిపేట జిల్లా వేములఘాట్ గ్రామస్తులు చేపట్టిన సంవిధాన్ సమ్మాన్ యాత్ర (రాజ్యాంగ గౌరవయాత్ర)కు శనివారం ఆమె సంఘీభావం ప్రకటిం చారు.
ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ మైదాన ప్రాంతంలో 50 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించడం సాధ్యంకాదని నిపుణులు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం మల్లన్న సాగర్ విషయంలో మొండిగా వ్యవహరిస్తోందన్నారు. మహిళలు ముందుండి పోరాడితే విజయం మనదేనన్నారు. వేములఘాట్ ను రక్షించుకునేందుకు గ్రామస్తులు 875 రోజులుగా దీక్షలు చేయడం అభినందనీయమన్నారు.