
గురువారం ‘తెలంగాణ ఆందోళన-గాంధీవాదం పునఃస్థాపన’ పుస్తకాన్ని కేసీఆర్‌కు అందజేస్తున్న రచయిత రాంజీ సింహ. చిత్రంలో హోంమంత్రి నాయని
సీఎంకు బహూకరించిన రచయిత రాంజీ సింహ
సాక్షి, హైదరాబాద్: తెలుగులోకి అనువదించిన హిందీ రచన ‘తెలంగాణ ఆందోళన-గాంధీవాదం పునఃస్థాపన’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఆ పుస్తక రచయిత రాంజీ సింహ ఉదయన్ గురువారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. వారణాసికి చెందిన రాంజీ తెలంగాణ ఉద్యమం సమయంలో హిందీ మిలాప్ దినపత్రికకు హైదరాబాద్ చీఫ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నడిపించిన తీరు, కేసీఆర్ ఆమరణ దీక్ష, తదనంతర పరిణామాలు, రాష్ట్ర ఏర్పాట్లను సునిశితంగా పరిశీలించాక ఈ పుస్తకాన్ని రచించినట్లు రాంజీ తెలిపారు. గాంధేయమార్గంలో శాంతియుతంగా నడిచిన తెలంగాణ ఉద్యమం దేశంలో గాంధీవాదాన్ని తిరిగి స్థాపించిందని పేర్కొన్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించగా కేసీఆర్ అంగీకరించారు.